తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈరోజు టీడీఎల్పీ కార్యాలయంలో మీడియా సమావేశం అయ్యారు.
* రాజ్యసభ ఎన్నికలు కుట్రకు పరాకాష్ఠ అని చంద్రబాబు నాయుడు అన్నారు.
* కాంగ్రెస్ పార్టీ, వైకాపా తెరాసల పరిస్థితి చూస్తే కళ్లు మూసుకొని పాలుతాగుతున్న పిల్లి కథ గుర్తొస్తొందన్నారు.
* కాంగ్రెస్ అవగాహనలో భాగంగానే తెరాస పోటీ చేసిందని, తెరాస, కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించేందుకే జగన్ రాజ్య సభకు తమ పార్టీ సభ్యులను పోటికి పెట్టలేదని అన్నారు.
* కాంగ్రెస్ పార్టీ, వైకాపా, తెరాసా 10 జనపథ్ స్ర్కిప్ట్ అమలు చేసేందుకు బాగా కష్టపడుతున్నాయని చంద్రబాబు ఆరోపించారు.
* రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని వ్యతిరేకిస్తూనే.. రాజ్యసభకు అభ్యర్థుల చేత నామినేషన్లు వేయించారని అన్నారు.
* అధిష్టానానికి వ్యతిరేకం అంటూనే రెబల్ అభ్యర్థితో ఉపసంహరణ చేయించారని చంద్రబాబు గుర్తు చేశారు.
* రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానం ఆడించే డ్రామాలో ఒక భాగమేనని .. బాబు మీడియాతో అన్నారు.
* అంతేకాకుండా పార్టీనుంచి వెళ్లిపోయిన వారికి అవినీతి పనులు చేసేందుకు అధికారం ఎవరిచ్చారని చంద్రబాబు ప్రశ్నించారు.
* రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీ తో విసిగిపోయారని, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి దీటుగా ఎవరూ పనిచయడం లేదని బాబు అన్నారు.
* వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పేది సమైక్యవాదమని, చేసేది మాత్రం విభజనవాదమని చంద్రబాబు ఆరోపించారు.
* ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విభజనలో మొదటి ముద్దాయి కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధేయేనని చంద్రబాబు విమర్శించారు.
-ఆర్ఎస్
(And get your daily news straight to your inbox)
Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more
Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more
Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more
Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more
Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more