తరువ దరువ బుట్టు దరువునందనలంబు దరువదరువ బుట్టు దధి ఘృతంబు తలపదలప బుట్టు తలపున తత్త్వంబు విశ్వదాభిరామ వినురవేమ తరువదరువన్=తరచగా తరచగా, పుట్టు=పుడుతుంది, తరువునందు=చెట్టులో, అనలంబు=నిప్పు, దధి=పెరుగు, ఘృతంబు=నెయ్యి, తలపుదలపు=బాగా ఆలోచించగా ఆలోచించగా, పుట్టు తలపున=మనసులో పుడుతుంది, తత్త్వంబు= ధర్మ సూక్ష్మం....
అరయ నాస్తియనక యడ్డు మాటాడక తట్టువడక మదిని తన్నుకోక తనది గాదనుకొని తా బెట్టునదె పెట్టు విశ్వదాభిరామ వినురవేమ! అరయన్=చూడగానే, నాస్తియనక=లేదని చెప్పకుండా, అడ్డు మాటాడక=అభ్యంతరం చెప్పకుండా, తట్టువడక=సంశయించకుండా, మదిని తన్నుకోక=మనసులో కొట్టుమిట్టాడకుండా, తనదిగాదనుకొని=తన సొమ్ము కాదని తలచి, తాబెట్టునదె=ఇచ్చేదే, పెట్టు=నిజమైన...
వేమన శతకం- 38 కులముగలుగువాడు గోత్రంబు గలవాడు విద్యచేత విర్రవీగువాడు పసిడిగలుగువాని బానిస కొడుకులు విశ్వదాభిరామ వినురవేమ కులముగలవాడు=ఉన్నత కులంలో పుట్టినవారు, గోత్రంబు గలవాడు=గోత్రం కలిగినవారు, విద్యచేత విర్రవీగువాడు=బాగా చదువుకున్నానన్న గర్వంతో ఉన్నవారు, పసిడికలుగువాని=ధనం కలిగివున్నవారికి, బానిసకొడుకులు=చెప్పుచేతల్లో ఉండవలసిందే....
వేమన శతకం - 37 అలను బుడగ పుట్టినపుడే క్షయమౌను కలను గాంచు లక్ష్మి గనుటలేదు ఇలను భోగభాగ్య మీతీరె కానరు విశ్వదాభిరామ వినురవేమ! అలను బుడగ పుట్టినపుడే నీటి అలల మీద ఉద్భవించే బుడగ, క్షయమౌను నశించిపోతుంది, కలను...
వేమన శతకం 36 ఏమి గొంచు వచ్చె తానేమి గొనిపోవు బుట్టువేళ నరుడు గిట్టువేళ ధనములెచటికేగు దానెచ్చటికేగు విశ్వదాభిరామ వినురవేమ! ఏమి గొంచు వచ్చె=ఏం తీసుకొచ్చాడు, తానేమి గొనిపోవు=ఏం తీసుకుని పోతాడు, బుట్టు వేళ నరుడు గిట్టువేళ=మనిషి పుట్టిన సమయంలోనూ చనిపోయే...
మృగమదంబు చూడ=కస్తూరిని చూస్తే, మీద నల్లగనుండు=నల్లగా ఉంటుంది, పరిఢవిల్లు=వ్యాపిస్తుంది, దాని పరిమళంబు=దాని సువాసన, గురువులైనవారి=నిజమైన గురువుల, గుణములీలాగురా=గుణమిలాగే ఉంటుంది. చూడటానికి నల్లగా కనిపించే కస్తూరి, సువాసనలో మేటి అయినట్టుగానే, సద్గురువుల లక్షణాలు కూడా పైకి గొప్పగా కనపడవు. కస్తూరి అంటే...
నేరనన్నవాడు=తనకు రాదు అని అనేవాడు, నెరజాణ=మంచి నేర్పరి, మహిలోన=ప్రపంచంలో, నేర్తునన్నవాడు=అన్నీ తెలుసన్నవాడు, నిందజెందు=అపకీర్తిపాలవుతాడు, ఊరకున్నవాడు=మౌనం పాటించేవాడే, ఉత్తమ యోగి=గొప్ప యోగి. తనకి అన్నీ తెలుసని బరిలోకి దూకినవాడు ఎప్పుడైనా బెడిసికొట్టినట్టయితే, మాటపోగొట్టుకునే అవకాశం ఉంది, నింద భరించవలసి రావొచ్చు అందుకే, నాకేం...
నిక్కమైన=నిజమైన, మంచి నీలము=ఇంద్రనీల మణి, ఒక్కటి చాలు=ఒక్కటే చాలు, తళుకుబెళుకు రాళ్ళు=రకరకాల రంగు రాళ్ళు, తట్టెడేల=తట్టడెందుకు, చాటుపద్యం=అందరికీ ఇష్టం కలిగించే చక్కని పద్యం, ఇలను=భూమ్మీద, ఒక్కటి చాలదా= ఒక్కటి సరిపోతుంది కదా! రంగురాళ్లు, గులకరాళ్ళు తట్టలకొద్దీ పోగుచేసుకున్నదానికంటే ఒక్క మంచి జాతి...