Vemana Sathakam in Telugu 29605 Vemana Satakalu

Vemana satakam

Vemana Sathakam, Vemana Satakalu, Telugu Satakalu, Vemana Satakalu in Telugu మృగమదంబు Vemana satakam

Get the Vemana Sathakam చూడటానికి నల్లగా కనిపించే కస్తూరి, సువాసనలో మేటి అయినట్టుగానే, సద్గురువుల లక్షణాలు కూడా పైకి గొప్పగా కనపడవు. In Telugu Vemana Satakalu

వేమన శతకం-35

Posted: 12/01/2011 03:36 PM IST
Vemana satakam

vemana-img

మృగమదంబు చూడ=కస్తూరిని చూస్తే, మీద నల్లగనుండు=నల్లగా ఉంటుంది, పరిఢవిల్లు=వ్యాపిస్తుంది, దాని పరిమళంబు=దాని సువాసన, గురువులైనవారి=నిజమైన గురువుల, గుణములీలాగురా=గుణమిలాగే ఉంటుంది.

      చూడటానికి నల్లగా కనిపించే కస్తూరి, సువాసనలో మేటి అయినట్టుగానే, సద్గురువుల లక్షణాలు కూడా పైకి గొప్పగా కనపడవు.

కస్తూరి అంటే ఏమిటో కూడా ఈ కాలం వారికి తెలియకపోవచ్చు. అడవి జంతువుల్లో కస్తూరి జంతువు అని ఒక జంతువు ఉంటుంది. దాని బొడ్డులో నల్లని పదార్థముంటుంది. దాని సువాసన చాలా దూరం వరకూ వ్యాపిస్తుంది. పూర్వకాలంలో మనుషులు తక్కువ, అడవి జంతువులు ఎక్కువగా ఉన్న సమయంలో, వన్య ప్రాణి సంరక్షణ అవసరం లేని ఆ సమయంలో మనుషులు యధేచ్ఛగా జంతువులను వేటాడేవారు. ఆ సమయంలో ఈ కస్తూరి జంతువుని కనుగొన్నారు. దాని నుంచి వచ్చే నల్లని పదార్థాన్ని కస్తూరి అనేవారు. దాన్ని నుదుటన పెట్టుకునే బొట్టులో కలిపి పెట్టుకుంటే రోజంతా సువాసన వస్తుండేది. అప్పుడంతా సహజంగా దొరికే పుష్పాలు, కస్తూరిలతోనే వాతావరణాన్ని సువాసనలతో నింపుకునేవారు. కృష్ణుడిని వర్ణించేటప్పుడు కస్తూరీ తిలకం లలాట ఫలకే'' అన్నదానిలో కస్తూరి ఇదే. ఆ సమయంలోనే కస్తూరి నల్లగా బాగోలేదు అనుకునే వారు ఇక ఈకాలంలో ప్రతి వస్తువూ అందమైన ప్యాక్ లలో వస్తున్న సమయంలో ఏమనుకుంటారో కానీ అసలు ఇప్పుడు లభించటమే దుర్లభం.

ఆ కస్తూరి పైకి చూడటానికి నల్లగా ఉండి, పరిమళంలో సాటిలేనిదై ఉన్నట్టుగానే, సద్గురువులు వారి ఙానాన్ని ప్రదర్శించరు. పైకి సాధరణంగానే కనిపిస్తారు. లోపల ఏమీ లేనివారే పైకి ఆర్భాటాలు చూపించి లోపాన్ని దాచుకునే ప్రయత్నం చేస్తారు కానీ నిజమైన గురువులు తమ గురించి ఎవరు ఏమనుకుంటారో అనేదే పెట్టుకోరు. తమ నిజస్థితిలో ఉంటారు. ప్రపంచంలో మిగిలిన వాళ్ళందరినీ చూస్తే ప్రతివారూ ఏదో ఒక విధంగా తన మీద ఇతరులకు మంచి అభిప్రాయం కలగాలని తాపత్రయపడుతుంటారు. ఒకరినొకరు ఇంప్రెస్ చేసుకోవటంలోనే మన జీవితంలో చాలా కాలాన్ని వెచ్చిస్తున్నాం. ఆ సమయనష్టాన్ని గురువులు కలిగించుకోరు. వారి అపారమైన ఙానాన్ని అవసరం మేరకే ఇతరుల ప్రయోజనం కోసమే బయటపెడతారు కానీ తమకో గుర్తింపు రావాలని ఎప్పుడూ కోరుకోరు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

 
 
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Vemana satakam

    వేమన శతకము

    Apr 15 | తప్పులెన్నువారు తండోప తండంబు లుర్వి జనులకెల్ల నుండు తప్పు తప్పు లెన్నువారు తమ తప్పు లెరుగరు విశ్వదాభిరామ వినురవేమ! తాత్పర్యము : ప్రపంచంలో ప్రతిఒక్కరు తప్పులు చేస్తారు. చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లలవరకు... Read more

  • Vemana satakam

    వేమన శతకము

    Apr 14 | పట్టు బట్టరాదు, పట్టివిడవరాదు పట్టెనేని బిగియఁ బట్టవలయు పట్టు విడుటకన్న, బరగఁ జచ్చుట మేలు విశ్వదాభిరామ వినురవేమ! తాత్పర్యము : పట్టుదల లేనిదే ఏ కార్యాన్నిగాని, పనినిగాని మొదలుపెట్టకూడదు. అసలు ఆలోచించుకోకూడదు కూడా. ఒకవేళ... Read more

  • Vemana satakam

    వేమన శతకము

    Apr 12 | చంపదగిన యట్టి శత్రువు తనచేత జిక్కెనేని కీడు సేయరాదు పొనగ మేలుచేసి పొమ్మనుటే చాలు విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యము : మనకు ఎల్లప్పుడూ హాని కలిగించే మన శత్రువును చంపే సమయం వచ్చినప్పుడు.. అతనిని... Read more

  • Vemana satakam in telugu

    వేమన శతకము

    Apr 11 | చెప్పులోన ఱాయి చెవిలోని జోరిగ కంటిలోని నలుసు కాలిముల్లు ఇంటిలోని పోరు నింతింత గాదయా విశ్వదాభిరామ వినురవేమ ! భావం : చెప్పులో రాయి రావడం, చెవిలో జోరిగ తిరగడం, కంటిలో నలుసు పడటం,... Read more

  • Vemana satakam

    వేమన శతకము

    Apr 08 | చిప్పలోనబడ్డ చినుకు ముత్యంబయ్యె నీటబడ్డ చినుకు నీట గలిసె బ్రాప్తి గలుగుచోట ఫలమేల తప్పురా విశ్వదాభిరామ వినురవేమ ! తాత్పర్యము : ముత్యపు చిప్పలో పడ్డ వాన చినుకు ముత్యంగా మారిపోతుంది. అదే చినుకు... Read more