Vemana Sathakam in Telugu 29777 Vemana Satakalu

Vemana satakam

Vemana Sathakam, Vemana Satakalu, Telugu Satakalu, Vemana Satakalu in Telugu అలను బుడగ పుట్టినపుడే క్షయమౌను Vemana satakam

Get the Vemana Sathakam అలను బుడగ పుట్టినపుడే నీటి అలల మీద ఉద్భవించే బుడగ, క్షయమౌను నశించిపోతుంది, కలను గాంచు కలలో చూసే, లక్ష్మి ధనం కనుట లేదు చూడలేం, ఇలను భూమ్మీద, భోగభాగ్యం సంపదలను, ఈ తీరె ఈ విధంగానే కానరు చూడరు. In Telugu Vemana Satakalu

vemana satakam - 37

Posted: 12/08/2011 11:58 AM IST
Vemana satakam

vemana-inner

 

వేమన శతకం - 37

అలను బుడగ పుట్టినపుడే క్షయమౌను

కలను గాంచు లక్ష్మి గనుటలేదు

ఇలను భోగభాగ్య మీతీరె కానరు

విశ్వదాభిరామ వినురవేమ!

అలను బుడగ పుట్టినపుడే నీటి అలల మీద ఉద్భవించే బుడగ, క్షయమౌను నశించిపోతుంది, కలను గాంచు కలలో చూసే, లక్ష్మి ధనం కనుట లేదు చూడలేం, ఇలను భూమ్మీద, భోగభాగ్యం సంపదలను, ఈ తీరె ఈ విధంగానే కానరు చూడరు.

అల, కల, ఇల అంటూ అలల మీద, కలలలోనా, భూమ్మీదా కనిపించేవాటి ప్రస్తావన తెస్తూ, అల మీది నీటి బుడగ ఎలా అయితే వెనువెంటనే నశించిపోతుందో, స్వప్నంలో కనిపించే ధనం వాస్తవంలో ఎలా అయితే పనికిరాదో, అలాగే ఈ భూమ్మీది సంపదలు, భోగభాగ్యాలు కూడా అంతే సుమా అని వేమనాచార్యులవారు హెచ్చరిస్తున్నారు.

వేదాంతంలో అతి ఉచ్ఛస్థితిలో ఉండే సర్వోతృష్టమైన అద్వైత సిద్ధాంతం ప్రకారం, జాగృదావస్తలోని వాస్తవమని మనందరం దేన్నైతే నమ్ముతున్నామో అది కూడా స్వప్నావస్తలాంటిదే నన్నది మూల సిద్ధాంతం. జాగృదావస్త కూడా ఒక పెద్ద స్వప్నమే నంటూ శంకరాచార్యులవారు అద్వైతాన్ని బోధించారు. ప్రపంచంలో అన్ని సిద్ధాంతాలు, శాస్త్రీయమే కానీ లేదా ఆధ్యాత్మికమే కానీ కేవలం జాగృదావస్తనే పరిగణనలోకి తీసుకున్నాయి. కానీ అద్వైతమొక్కటే మానవుని మూడు దశలైన జాగృతి, స్వప్న, గాఢ సుషుప్తిలను కూడా లెక్కలోకి తీసుకుంది. వాటికీ సమానమైన ప్రాధాన్యతనిచ్చింది.

ఈ పద్యంలో మన కంటికి కనిపించే బుడగతోనూ, కనిపించిందని భ్రమించే స్వప్నంలోని ధనసంపదలతోనూ పోలుస్తూ, వాస్తవంగా ఉందనుకుంటున్న సంపదలన్నీ అలాంటివే కాబట్టి వాటి మీద ఆశ పెట్టుకుని అదే జీవిత లక్ష్యంగా చేసుకోరాదని వేమన మనలను హెచ్చరిస్తున్నారు.

-శ్రీజ

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

 
 
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Vemana satakam

    వేమన శతకము

    Apr 15 | తప్పులెన్నువారు తండోప తండంబు లుర్వి జనులకెల్ల నుండు తప్పు తప్పు లెన్నువారు తమ తప్పు లెరుగరు విశ్వదాభిరామ వినురవేమ! తాత్పర్యము : ప్రపంచంలో ప్రతిఒక్కరు తప్పులు చేస్తారు. చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లలవరకు... Read more

  • Vemana satakam

    వేమన శతకము

    Apr 14 | పట్టు బట్టరాదు, పట్టివిడవరాదు పట్టెనేని బిగియఁ బట్టవలయు పట్టు విడుటకన్న, బరగఁ జచ్చుట మేలు విశ్వదాభిరామ వినురవేమ! తాత్పర్యము : పట్టుదల లేనిదే ఏ కార్యాన్నిగాని, పనినిగాని మొదలుపెట్టకూడదు. అసలు ఆలోచించుకోకూడదు కూడా. ఒకవేళ... Read more

  • Vemana satakam

    వేమన శతకము

    Apr 12 | చంపదగిన యట్టి శత్రువు తనచేత జిక్కెనేని కీడు సేయరాదు పొనగ మేలుచేసి పొమ్మనుటే చాలు విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యము : మనకు ఎల్లప్పుడూ హాని కలిగించే మన శత్రువును చంపే సమయం వచ్చినప్పుడు.. అతనిని... Read more

  • Vemana satakam in telugu

    వేమన శతకము

    Apr 11 | చెప్పులోన ఱాయి చెవిలోని జోరిగ కంటిలోని నలుసు కాలిముల్లు ఇంటిలోని పోరు నింతింత గాదయా విశ్వదాభిరామ వినురవేమ ! భావం : చెప్పులో రాయి రావడం, చెవిలో జోరిగ తిరగడం, కంటిలో నలుసు పడటం,... Read more

  • Vemana satakam

    వేమన శతకము

    Apr 08 | చిప్పలోనబడ్డ చినుకు ముత్యంబయ్యె నీటబడ్డ చినుకు నీట గలిసె బ్రాప్తి గలుగుచోట ఫలమేల తప్పురా విశ్వదాభిరామ వినురవేమ ! తాత్పర్యము : ముత్యపు చిప్పలో పడ్డ వాన చినుకు ముత్యంగా మారిపోతుంది. అదే చినుకు... Read more