grideview grideview
  • Feb 04, 03:44 PM

    సుమతీ శతకం-19

    కప్పకు నొరగాలైనను సప్పమునకు రోగమైన, సతి తులువైనన్ ముప్పున దరిద్రుండైనను తప్పదు మరి దుఖమగుట తథ్యము సుమతీ కప్పకు నొరగాలైన- కప్ప కుంటిదైనట్లయితే, సప్పమునకు రోగమైన- పాముకి రోగమొచ్చినట్లయితే, సతి తులువైనన్- భార్య దుర్మార్గంగా ప్రవర్తించేదైతే, ముప్పున- ముసలితనంలో, దరిద్రుండైన- డబ్బు...

  • Feb 03, 04:10 PM

    సుమతీ శతకం-18

    ఏఱకుమీ కసుగాయలు దూఱకుమీ బంధుజనుల దోషము సుమ్మీ పాఱకుమీ రణమందున మీఱకుమీ గురువులాఙ మేదిని సుమతీ ఏఱకుమీ- ఏరవద్దు, కసుగాయలు- పచ్చికాయలను, దూఱకుమీ- దూషించవద్దు, బంధుజనుల- బంధువులను, , దోషము సుమ్మీ- తప్పు సుమా, పాఱకుమీ- పారిపోవద్దు, రణమందున- యుద్ధంలో ఉన్నప్పుడు, మీరకుమీ...

  • Feb 02, 02:48 PM

    సుమతీ శతకం-17

    ఉపమింప మొదలు తియ్యన కపటం బెడనెడను జెఱకు కైవిడినే పో నెపములు వెదకును గడపట గపటపు దుర్జాతి పొందు గదరా సుమతీ ఉపమింప- పోల్చి చూసినట్లయితే, మొదలు తియ్యన- మొదట్లో తియ్యగానే ఉంటుంది, కపటపు- మోసం చేసే గుణం ఉన్న, ఎడనెడన్-...

  • Feb 01, 03:05 PM

    సుమతీ శతకం -16

    కమలములు నీటబాసిన కమలాప్తుని రశ్మి సోకి కమలిన భంగిన్ దమతమ నెలవులు దప్పిన దమ మిత్రులె శత్రులౌట తథ్యము సుమతీ కమలములు- తామరపువ్వులు, నీటబాసిన- నీటిలోంచి బయటకు వచ్చినట్లయితే, కమలాప్తుని రశ్మి సోకి- తామరపువ్వులకు బంధువైన సూర్య రశ్మి సోకి నప్పుడు,...

  • Jan 31, 02:57 PM

    సుమతీ శతకం-15

    కనకపు సింహాసనము శునకము కూర్చుండబెట్టి శుభలగ్నమునం దొనరగ బట్టముగట్టిన వెనుకటి గుణమేల మాను వినరా సుమతీ కనకపు సింహాసనము- బంగారు సింహాసనం, శునకము కూర్చుండబెట్టి- కుక్కను కూర్చోబెట్టి, శుభలగ్నమునందొనరగ- మంచి ముహూర్తంలో, పట్టము గట్టిన- పట్టాభిషేకం చేసినట్లయితే, వెనుకటి గుణమేలమాను- అంతకుముందున్న...

  • Jan 28, 03:26 PM

    సుమతీ శతకం- 14

    ఎప్పుడు సంపద గలిగిన నప్పుడు బంధువులు వత్తురదియెట్లన్నన్, దెప్పలుగ చెరువునిండిన గప్పలు పదివేలు చేరు గదరా సుమతీ ఎప్పుడు సంపద గలిగిన- ఎప్పుడైతే ధనవంతులవుతారో, అప్పుడు- ఆ సమయంలో, బంధువులు వత్తురు- బంధువలు వస్తారు, అది ఎట్లన్నన్- అది ఎలాంటిదంటే, తెప్పలుగ...

  • Jan 25, 06:28 PM

    సుమతీ శతకం - 12

    ఎప్పిటికెయ్యది ప్రస్తుత మప్పటికా మాటలాడి యన్యుల మనముల్ నొప్పించక తానొవ్వక, తప్పించుక తిరుగువాడు ధన్యుడు సుమతీ   ఎప్పటికెయ్యది-ఎప్పుడు ఏది, ప్రస్తుతం- అవసరమై, అప్పటికి- ఆ సమయంలో, ఆ మాటలాడి- తగిన విధంగా మాట్లాడుతూ, అన్యుల- ఇతరుల, మనముల్- మనసులను, నొప్పించక-...

  • Jan 23, 06:58 PM

    సుమతీ శతకం - 11

    ఉపకారికి నుపకారము విపరీతము గాదు సేయ వివరింపంగా నపకారికి నుపకారము నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతీ ఉపకారికి- మేలు చేసినవానికి, ఉపకారము సేయ- మేలు చెయ్యటం, విపరీతము కాదు- పెద్ద గొప్పేమీ కాదు, వివరింపంగా- వివరంగా విమర్శాత్మకంగా చూసినట్లయితే, అపకారికి- కీడు...