పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, జనులా పుత్రుని కనుగొని పొగడగ పుత్రోత్సాహము నాడు పొందుర సుమతీ పుత్రోత్సాహము- కొడుకు వలన కలిగే ఆనందం, పుత్రుడు జన్మించినపుడె పుట్టదు- కొడుకు పుట్టినప్పుడు కాదు, జనులు- ప్రపంచంలోనివారు, ఆ పుత్రుని కనుగొని- ఆ...
నయమున బాలును ద్రావరు భయమున విషమైనగాని భక్షింతురుగా నయమెంత దోసకారియొ భయమే చూపంగవలయు బాగుగ సుమతీ నయమున- అనునయంగా మంచి మాటలతో, పాలును త్రావరు- పాలు కూడ తాగరు, భయమున- భయపెట్టినట్లయితే, విషమైనగాని- విషపదార్థమైనా, భక్షింతురుగా- తినేస్తారు కదా, నయమెంత- మంచితనం...
దగ్గర కొండెము చెప్పెడు ప్రెగ్గడ పలుకులకు రాజు ప్రియుడై మరి తా నెగ్గు ప్రజకాచరించుట బొగ్గులకై కల్పతరువు బొడుచుట సుమతీ దగ్గర- దగ్గరచేరి, కొండెము చెప్పెడు- చాడీలు చెప్పే, ప్రెగ్గడ పలుకులకు- మంత్రి మాటలకు, రాజు ప్రియుడై- రాజుకి నచ్చి, తాన్-...
ధనపతి సఖుడైయుండియు నెనయంగా శివుడు భిక్ష మెత్తంగ వలసెన్ దనవారి కెంత గలిగిన దన భాగ్యమె తనకుగాక తథ్యము సుమతీ ధనపతి= కుబేరుడు, సఖుడైయుండియు= స్నేహితుడైనా కూడా, ఎనయంగా= సంభవించినట్లు శివుడు భిక్షమెత్తగ వలసెన్= భిక్షమెత్తుకోవలసి వచ్చింది, తనవారికెంత కలిగిన= తనవాళ్ళకి...
తలనుండు విషము ఫణికిని వెలయంగా దోకనుండు వృశ్చికమునకున్ దలతోక యనకయుండును ఖలునకు నిలువెల్ల విషము గదరా సుమతీ ! తలనుండు విషము= తలలో విషముంటుంది, ఫణికిని= పాముకి, వెలయంగా= పైకి కనిపించేవిధంగా, తోకనుండు= తోకలో ఉంటుంది, వృశ్చికమునకున్= తేలుకి తలతోక యనక...
తన కోపమె తన శత్రువు తన శాంతమె తనకు రక్ష, దయ చుట్టంబౌ తన సంతోషమె స్వర్గము తన దుఖమె నరకమండ్రు తథ్యము సుమతీ దీనికి ప్రతిపదార్థం ఇవ్వనక్కరలేదు. బహుళ ప్రచారంలో ఉన్నది, ఎవరికైనా ఇట్టే అర్థమయ్యే పద్యమిది. మనిషి తన...
చీమలు పెట్టిన పుట్టలు పాముల కిరవైనయట్లు, పామరుడు దగన్ హేమంబు గూడబెట్టిన భూమీశుల పాలజేరు భువిలో సుమతీ చీమలు పెట్టిన పుట్లలు- చీమలు కష్టపడి పుట్టలను తయారుచేసుకుంటే, పాములకు ఇరువైన యట్లు- పాములకు నివాసమైనట్లుగా, పామరుడు- తెలివిలేనివాడు, హేమంబు- బంగారం, కూడబెట్టిన-...
కూరిమిగల దినములలో నేరము లెన్నందును గలుగనేరవు మరియా కూరిమి విరసంబైనను నేరములే తోచుచుండు నిక్కము సుమతీ కూరిమిగల దినములలో- ఒకరి మీదొకరికి ఇష్టము కలిగవున్నపుడు, నేరములు- తప్పులు, ఎన్నందును- ఏనాడూ, కలుగనేరవు- తోచవు, మరియా కూరిమి- ఆ ఇష్టం కాస్తా, విరసంబైనను-...