Devotees throng Tirumal to witness Garuda Seva శ్రీవారి గరుడ వాహనసేవ వీక్షణ పొటెత్తిన భక్తులు..

Tirumala tirupati 4 5 lakh devotees to witness garuda seva today

Tirumala Srivaru, salakatla brahmotsavalu, Garuda vahana seva, Brahmotsavams, TTD, Garuda Seva, large number, devotees, Lord Venkateshwara swamy, Tirupati, Chitoor, Andhra Pradesh, Devotional

TTD has geared up for the big day during the ongoing annual Brahmotsavams, the Garuda Seva on October 1. Action plans and all arrangements have been made to provide Garuda Vahana darshan to nearly 4.5 lakh devotees. Drinking water supply and Annaprasadams will be provided to the devotees, who occupied the galleries from 6 am till 12 midnight by deploying 1,500 odd Srivari sevaks, volunteers including women, to offer services to them.

భక్తజన సంధ్రంగా తిరుమల: శ్రీవారి గరుడ వాహనసేవ వీక్షణ పొటెత్తిన భక్తులు..

Posted: 10/01/2022 06:51 PM IST
Tirumala tirupati 4 5 lakh devotees to witness garuda seva today

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శనివారం నాటికి ఈ వేడుకలు ఐదవ రోజుకు చేరుకున్నాయి. గరుడ వాహనసేవ నిర్వహణ రోజుకు ప్రత్యేకమైన విశిష్టత ఉండటంతో తెలుగు రాష్ట్రాల భక్తులతో పాటు పలు రాష్ట్రాల భక్తులు కూడా తిరుమల కొండకు పోటెత్తారు. శనివారం రాత్రి గరుడ వాహనసేవలో పాల్గొనేందుకు విశేష సంఖ్యలో భక్తజనం తిరుమలకు పోటెత్తింది. తిరుమల మొత్తం భక్తులతో నిండిపోయింది. దాదాపు 4.50 లక్షల మంది గరుడవాహన సేవను తిలకిస్తారని టీటీడీ అధికారులు అంచనావేస్తున్నారు.

భక్తులందరికి గరుడ వాహన సేవలో పాల్గొనే అవకాశాన్ని కల్పించనున్నట్లు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి హామీ ఇచ్చారు. సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడ వాహనసేవను పురస్కరించుకుని రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు పొరుగు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.  భక్తుల సంఖ్య విశేషంగా ఉండటంతో తిరుమల గిరులు స్వామివారి నామంతో మార్మోగిపోతున్నది. గరుడ వాహన సేవలో దాదాపు 4.50 లక్షల మంది పాల్గొనే అవకాశం ఉన్నది. ఇప్పటికే నాలుగు లక్షల మేర భక్తులు తిరుమలకు చేరినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

గరుడ వాహనసేవ సందర్భంగా 5వేల మందితో పోలీసులు భద్రతనిర్వహిస్తున్నారు. గ్యాల‌రీల్లో ఉద‌యం 6 నుంచి రాత్రి 12 గంట‌ల వ‌ర‌కు అన్నప్రసాదాలు, తాగునీరు కల్పిస్తున్నారు. మాడ వీధుల్లో ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. గరుడ సేవలో స్వామి వారికి అలంకరించేందుకు ప్రత్యేక గొడుగులు శుక్రవారం తిరుమలకు చేరాయి. చెన్నైలోని హిందూ ధర్మార్థ సమితి ట్రస్టీ ఆర్‌ఆర్‌ గోపాల్‌జీ ఆధ్వర్యంలో తిరుమల చేరిన గొడుగులకు అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. గరుడ వాహన సేవకు చేపట్టిన ఏర్పాట్లను టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తనిఖీ చేశారు. మాడ వీధులు, గ్యాలరీల్లో భక్తులకు కల్పించిన సదుపాయాలను పరిశీలించారు.

టీటీడీ ఏర్పాట్లు చాలా బాగున్నాయని సుబ్బారెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు. పలువురు భక్తులతో మాట్లాడి టీటీడీ సేవల గురించి ఆరా తీశారు. వాహనసేవను దర్శించుకున్న అనంతరం భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా నిర్దేశిత మార్గాల ద్వారా వెలుపలికి వెళ్లేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలని ఇంజినీరింగ్‌, భద్రతా సిబ్బందికి సూచించారు. కాగా, గరుడ వాహనసేవకు యాత్రికులు పోటెత్తుతుండటంతో రవాణా సౌకర్యాల్ని మెరుగుపరిచారు. ప్రతి నిమిషానికి రెండు బస్సులను కొండపైకి వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. తిరుమలకు వెళ్లే ప్రైవేటు వాహానాలను అలిపిరి టోల్‌గేట్‌ వద్దే పోలీసులు నిలిపివేస్తున్నారు. దాంతో అలిపిరి నుంచి కపిల తీర్థం వరకు వాహనాలు భారీగా నిలిచిపోయాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tirumala Srivaru  salakatla brahmotsavalu  Garuda vahana seva  devotees  Lord Venkateshwara swamy  Tirupati  Chitoor  Andhra Pradesh  Devotionalతిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శనివారం నాటికి ఈ వేడుకలు ఐదవ రోజుకు చేరుకున్నాయి. గరుడ వాహనసేవ నిర్వహణ రోజుకు ప్రత్యేకమైన విశిష్టత ఉండటంతో తెలుగు రాష్ట్రాల భక్తులతో పాటు పలు రాష్ట్రాల భక్తులు కూడా తిరుమల కొండకు పోటెత్తారు. శనివారం రాత్రి గరుడ వాహనసేవలో పాల్గొనేందుకు విశేష సంఖ్యలో భక్తజనం తిరుమలకు పోటెత్తింది. తిరుమల మొత్తం భక్తులతో నిండిపోయింది. దాదాపు 4.50 లక్షల మంది గరుడవాహన సేవను తిలకిస్తారని టీటీడీ అధికారులు అంచనావేస్తున్నారు. భక్తులందరికి గరుడ వాహన సేవలో పాల్గొనే అవకాశాన్ని కల్పించనున్నట్లు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి హామీ ఇచ్చారు. సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడ వాహనసేవను పురస్కరించుకుని రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు పొరుగు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భక్తుల సంఖ్య విశేషంగా ఉండటంతో తిరుమల గిరులు స్వామివారి నామంతో మార్మోగిపోతున్నది. గరుడ వాహన సేవలో దాదాపు 4.50 లక్షల మంది పాల్గొనే అవకాశం ఉన్నది. ఇప్పటికే నాలుగు లక్షల మేర భక్తులు తిరుమలకు చేరినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. గరుడ వాహనసేవ సందర్భంగా 5వేల మందితో పోలీసులు భద్రతనిర్వహిస్తున్నారు. గ్యాల‌రీల్లో ఉద‌యం 6 నుంచి రాత్రి 12 గంట‌ల వ‌ర‌కు అన్నప్రసాదాలు  తాగునీరు కల్పిస్తున్నారు. మాడ వీధుల్లో ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. గరుడ సేవలో స్వామి వారికి అలంకరించేందుకు ప్రత్యేక గొడుగులు శుక్రవారం తిరుమలకు చేరాయి. చెన్నైలోని హిందూ ధర్మార్థ సమితి ట్రస్టీ ఆర్‌ఆర్‌ గోపాల్‌జీ ఆధ్వర్యంలో తిరుమల చేరిన గొడుగులకు అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. గరుడ వాహన సేవకు చేపట్టిన ఏర్పాట్లను టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తనిఖీ చేశారు. మాడ వీధులు  గ్యాలరీల్లో భక్తులకు కల్పించిన సదుపాయాలను పరిశీలించారు. టీటీడీ ఏర్పాట్లు చాలా బాగున్నాయని సుబ్బారెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు. పలువురు భక్తులతో మాట్లాడి టీటీడీ సేవల గురించి ఆరా తీశారు. వాహనసేవను దర్శించుకున్న అనంతరం భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా నిర్దేశిత మార్గాల ద్వారా వెలుపలికి వెళ్లేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలని ఇంజినీరింగ్‌  భద్రతా సిబ్బందికి సూచించారు. కాగా  గరుడ వాహనసేవకు యాత్రికులు పోటెత్తుతుండటంతో రవాణా సౌకర్యాల్ని మెరుగుపరిచారు. ప్రతి నిమిషానికి రెండు బస్సులను కొండపైకి వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. తిరుమలకు వెళ్లే ప్రైవేటు వాహానాలను అలిపిరి టోల్‌గేట్‌ వద్దే పోలీసులు నిలిపివేస్తున్నారు. దాంతో అలిపిరి నుంచి కపిల తీర్థం వరకు వాహనాలు భారీగా నిలిచిపోయాయి.  

Other Articles