Passenger Punches American Airlines Flight Attendant ఫ్లైట్ అటెండెంట్ పై ప్రయాణికుడి దాడి.. ఎందుకంటే..

American airlines bans passenger for punching flight attendant after heated argument

flight attendant, flight attendant punched, American Airlines, American Airlines passenger, American Airlines news, American Airlines crew, passenger punches flight attendant, Los Cabos, America Los Angeles, Unruly Passenger, Los Cobos in Mexico, Los Angeles, United States, Crime

A passenger travelling on an American Airlines flight was arrested and has been banned for life. Why, you may ask? Well, a video that has gone viral on social media shows the passenger punching a flight attendant. He was travelling from Los Cabos in Mexico to Los Angeles. The incident took place on American Airlines flight 377 on September 21.

ITEMVIDOES: ఫ్లైట్ అటెండెంట్ పై ప్రయాణికుడి దాడి.. ఎందుకంటే..

Posted: 09/24/2022 12:39 PM IST
American airlines bans passenger for punching flight attendant after heated argument

మనిషి తాను ఎక్కడున్నా.. ఏ స్థాయిలో ఉన్నా.. తనను శాసించే అరిషడ్వర్గాలకు లోనవుతూ.. ఆనర్థాలకు కారణమై.. అరదండాల పాలవుతున్నాడు. విమానంలో వెళ్లగలిగే అదృష్టం అతని సొంతమైనందుకు అతను ఎంతో హుందాగా వ్యవహరించాలి. కానీ ఏదో చిన్న విషయంలో అభ్యంతరం తెలిపిన విమాన సిబ్బందిపై దాడి చేయాల్సినంత అవసరం లేదు. ఇలా చేయడం వల్ల స్వయంగా తాను తన స్థాయిని దిగజార్చుకున్నవాడు అవుతాడా.? లేదా.? అన్నది ఓ పర్యాయం అలోచించుకోవాలి. కానీ ఇలాంటి అనర్థానికి కారణమయ్యాడు ఓ ప్రయాణికుడు.

ఔనా నిజంగానా అంటే.. విమానం ఏకంగా గాల్లో ఎగురుతుండగా.. అందులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి.. ఫ్లైట్ అటెండెంట్‌పై చేయిచేసుకున్నాడు. అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో ఈ సంఘటన జరిగింది. అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన 377 విమానం మెక్సికోలోని లాస్ కాబోస్ నుంచి అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌కు బయలుదేరింది. అయితే ఆ విమానం టేకాఫ్‌ అయ్యి గాల్లో ప్రయాణిస్తుండగా ఒక ప్రయాణికుడు దురుసుగా ప్రవర్తించాడు. ఒక విమాన సిబ్బంది భుజంపై తట్టి కాఫీ అడిగాడు. అనంతరం ముందున్న ఫస్ట్‌ క్లాస్ క్యాబిన్‌లోకి నడుస్తూ వెళ్లాడు. అక్కడ ఖాళీగా ఉన్న సీటులో కూర్చొన్నాడు.

అయితే ఫైట్ అటెండెంట్ వచ్చి.. ఖాళీగా ఉన్నంత మాత్రాన ఫస్ట్ క్లాస్ సీట్లలో కూర్చోరాదని.. అందుచేత తనకు కేటాయించిన సీటులోనే కూర్చోవాలని చెప్పాడు. దీంతో కొడతా అన్నట్లుగా ఆ వ్యక్తి పిడికిలి బిగించాడు. ఏం బెదిరిస్తున్నావా? అని ఫ్లైట్ అటెండెంట్‌ అడిగాడు. అతడి ప్రవర్తనపై ఫిర్యాదు చేసేందుకు వెనక్కి తిరిగి అక్కడి నుంచి వెళ్లాడు. అయితే ఫ్లైట్ అటెండెంట్ అలా ముందుకు కదులుతుండగానే వెనకగా వచ్చిన ప్రయాణికుడు వేగంగా వచ్చి పిడికిలితో ఫ్లైట్ అటెండెంట్‌ మెడపై గట్టిగా పంచ్‌ ఇచ్చాడు. ఊహించని ఈ దాడి వల్ల ఫ్లైట్ అటెండెంట్‌ ముందుకు వెళ్లి కింద పడ్డాడు. ఒక ఎయిర్‌హోస్టెస్‌ అతడి వద్దకు వచ్చి సపర్యలు చేసింది.

మరోవైపు ఈ సంఘటనపై ఆ విమానంలోని మిగతా ప్రయాణికులు షాక్‌ అయ్యారు. దురుసుగా ప్రవర్తించిన ఆ వ్యక్తిని కొందరు ప్రయాణికులు నిర్బంధించారు. విమానం లాస్ ఏంజెల్స్‌ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్‌ కాగానే ఆ ప్రయాణికుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడ్ని కాలిఫోర్నియాకు చెందిన 33 ఏళ్ల అలెగ్జాండర్ తుంగ్ క్యూ లేగా గుర్తించారు. కాగా, ఆ ప్రయాణికుడిపై అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌ జీవిత కాలంపాటు నిషేధం విధించింది. తమ సిబ్బందికి అండగా ఉంటామన్న ఆ సంస్థ ఈ కేసు దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తామని పేర్కొంది. మరోవైపు విమానంలోని కొందరు ప్రయాణికులు తమ మొబైల్‌ ఫోన్‌లో రికార్డు చేసిన దాడి వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles