Leopard Attacks Cyclist Near Kaziranga Park సైకిలిస్టుపై చిరుత దాడి.. ఎక్కడ అన్నదే వీళ్లకు ముఖ్యం

Leopard attacks cyclist near kaziranga national park what happens next

leopard attack, kaziranga, man-animal conflict, Leopard Attack video, IFS officer, Susanta Nanda, Dehradun-Rishikesh Highway, Uttarakhand, Assam, Kaziranga National Park, leopard attack, old video goes viral, viral video

Indian Forest Service officer Susanta Nanda shared the video, claiming the incident took place on Dehradun-Rishikesh Highway. The video was also shared on Facebook by the same claim. However, EastMojo found that the viral video is an old one and the incident had taken place near the Kaziranga National Park in Assam.

ITEMVIDEOS: సైకిలిస్టుపై చిరుత దాడి.. ఎక్కడ అన్నదే వీళ్లకు ముఖ్యం

Posted: 09/23/2022 07:24 PM IST
Leopard attacks cyclist near kaziranga national park what happens next

అటవీ ప్రాంతంలో వెళ్తున్న సమయంలో ఒళ్లంతా కళ్లు చేసుకుని వెళ్లాలని.. పెద్దలు చెబుతుంటారు. వన్యప్రాణలు ఎక్కడి నుంచి వచ్చి దాడి చేస్తాయో తెలియదని, అందుచేత.. చేతిలో కర్ర లేకుండా వెళ్లరాదని కూడా చెబుతుంటారు. కానీ మారుతున్న కాలంతో పాటు అందుబాటులోకి వస్తున్న అధునాతన సాంకేతికతతో కూడిన సమాజంలో.. మనిషి కేవలం అప్పటి మాటుకు అలోచించి తన అవసరాలు తీర్చుకోవడానికే ప్రాధాన్యతను ఇస్తున్నాడు తప్ప.. పెద్దలు చెప్పిన మాటలకు ప్రాముఖ్యతను ఇవ్వడం లేదు. దశాబ్దాల కిందట అప్పటివారు అధికంగా నడుచుకుంటూనే ప్రయాణాలు చేసేవారు. అందుకనే కాబోలు ఇలా చెప్పారు.

అయితే కర్ర, చేతి రుమాలు, కండువా లేకుండా అప్పటివారు బయటకు వెళ్లేవారే కాదన్నది సత్యం. ఇక స్కూటర్లు, బైక్ లతో పాటు కార్లు కూడా విపరీతంగా పెరగడంతో కావాల్సిన వారు తమకు అనువైన సాధనాల్లో ప్రయాణాలు సాగిస్తున్నారు. కాగా ఓ వ్యక్తి తన సైకిల్ పై అటవీ ప్రాంతం గుండా ప్రయాణం చేస్తుండగా, అందులోనూ తన గమ్యస్థానానికి వెంటనే చేరుకోవాలని వేగంగా సైకిల్ తొక్కుతూ వెళ్లున్నాడు. ఇలా వెళ్తున్న వ్యక్తి కోసం అక్కడికి కొంచం దూరంలో ఎప్పట్నించి మాటువేసిందో తెలియదు కానీ ఓ చిరుతపులి సైకిలిస్టు సమీపించగానే అతడి వెనుకగా వచ్చిన దాడి చేసింది.

అయితే చిరుత దాడితో సైకిలిస్టు తన బ్యాలెన్స్ కోల్పోయాడు. వెంటనే కింద పడ్డాడు. ఆ తరువాత ఏం జరిగిందోనని వెనక్కు తిరిగి చూసే లోపు అతనికి ఏమీ కనిపించలేదు. ఏదో జరిగిందని అని తనలో తాను భావిస్తూ సైకిల్ ను పైకి లేపి.. మళ్లీ ఒక్కసారి చూశాడు. అతడికి ఓ చిరుతపులి పరిగెడుతూ కనిపించింది. వామ్మో అనుకుని వెంటనే సైకిల్ పైకి ఎక్కడి రోడ్డుకు అటు పైపుగా వచ్చిన మార్గంలోనే తిరుగుపయనం అయ్యాడు. అయితే అదృష్టవశాత్తు ఆ వ్యక్తికి ఏమీ కాలేదు. కానీ ఏదో జరిగిందన్న అత్రుతతో అతను వేసిన కేకకు రోడ్డుకు అటువైపుగా వెళ్తున్న మరో ఇద్దరు సైకిలిస్టులు ఆగారు.

వారి వద్దకు పరుగు పరుగున వెళ్లి ఆగిన బాధితుడు తనపై చిరుత దాడి చేసిందని చెప్పాడు. అతనిపై దాడి చేసిన సమయంలో ఎక్కడ గాయాలు అయ్యయో కూడా వారికి చూపించాడు. వారు అతడికి ధైర్యం చెబుతూ అక్కడి నుంచి తీసుకెళ్లారు. అస్సాంలోని కజిరంగా పార్క్ సమీపంలో ఈ సంఘటన జరిగింది. అక్కడి జాతీయ రహదారి 37పై ఒక వ్యక్తి సైకిల్‌పై వెళ్తున్నాడు. అయితే ఆ రహదారి పక్కగా ఉన్న చెట్ల వద్ద మాటువేసిన చిరుత పులి ఒక్కసారిగా ఆ సైక్లిస్ట్‌పై దాడి చేసింది. దీంతో సైకిల్‌పై పట్టుకోల్పోయిన ఆ వ్యక్తి కిందపడ్డాడు. ఈ సంఘటనతో ఆ చిరుత కూడా భయపడి చెట్లలోకి పరుగు తీసింది.


కాగా, చిరుత దాడితో షాక్‌కు గురైన ఆ వ్యక్తి వెంటనే కింద పడిన సైకిల్‌ను పైకి తీశాడు. రోడ్డుకు మరో పక్కగా సైకిల్‌ తొక్కుతూ అక్కడి నుంచి వెనక్కి వచ్చాడు. సైకిళ్లతో పాటు ఉన్న మరో ఇద్దరి వద్దకు చేరుకున్నాడు. చిరుత దాడిలో తనకు ఏమైనా గాయం అయ్యిందా అని పదే పదే చూసుకున్నాడు. మరోవైపు గతంలో జరిగిన ఈ సంఘటనకు చెందిన పాత వీడియోను ఐఎఫ్‌ఎస్‌ అధికారి సుశాంత నంద ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. డెహ్రాడూన్-రిషికేశ్ హైవేపై ఈ సంఘటన జరిగినట్లు పేర్కొన్నారు. ఇద్దరూ (చిరుత, సైక్లిస్ట్‌) అదృష్టవంతులని చమత్కరించారు. కాగా, ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. నెటిజన్లు కూడా భిన్నంగా, ఫన్నీగా స్పందించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles