తాగుబోతునాయళ్లు.. వీళ్లని నమ్ముకుని ఏ పని చేసినా.. అది బూడిదలో పోసిన పన్నీరే.. ఎంత సేపు మద్యం మీదే ధ్యాస తప్ప.. పని మీద కించిత్ అలోచన కూడా ఉండదు అని మన తాత, నాయినమ్మలు ఎవరైనా తిటుడుంటే.. అయ్యే పాపం అని అనుకుంటాం. కానీ అలా అనుకోవడమే తప్పని ఆనక తెలుసుకుంటాం. తాతాయ్య, నానమ్మలు వారిని అలా తిడుతున్నారంటే వారు చేసిన పనుల ఫలితాలు కూడా అలానే ఉండివుంటాయ్. ఇలాంటివారిని నమ్మి పనులు అప్పజెప్పి.. మళ్లీ చేసుకోవాల్సిన రావడంతో వారిని వద్దు అనలేక.. తిడుతూనే పనలు చేయించుకుంటారు.
మద్యం పుచ్చుకుంటేనే వీరు మాట వినరు కానీ.. మద్యం పుచ్చుకోకపోతే మాత్రం వీరు చేసినంత శ్రమ మరెవరూ చేయలేరన్న విషయం వారికి తెలుసు. చుక్కపడినా.. లేక కనబడినా వారి బుద్ది కుక్క తోక వంకర అన్నట్లే మారిపోతుంది. అందుకు ఈ ఘటనే పెద్ద ఉదాహరణ. తమిళనాడులోని తిరువల్లూర్ జిల్లాలో ఇద్దరు మందుబాబుల రోజు మందు కోట్టాలని పూనుకున్నారు. అయితే అందుకుగానే తమ వద్ద అంత డబ్బు లేకపోవడంతో ఓ స్కేచ్ వేశారు. తమ పథకాన్ని అనుకున్నది అనుకున్నట్లు తొలిబాగం బాగానే చేశారు. అయితే మద్యం దుకాణంలోకి ఎంట్రీతో వారి ‘మద్యం చోరీ’ స్కెచ్ బెడిసికొట్టింది.
మద్యాన్ని అమ్ముకొని సొమ్ము చేసుకోవాలనుకొని ఓ వైన్ షాప్ గోడకు కన్నం వేసిన దొంగలు.. తీరా లోపలున్న మందు సీసాలను చూశాక కాస్త ప్లాన్ మార్చుకున్నారు. ముందుగా ఓ రెండు పెగ్గులేసి గొంతు తడుపుకొని ఆ తర్వాత ‘పని’కానిద్దామనుకున్నారు. అయితే అదే సమయంలో గస్తీ తిరుగుతున్న పోలీసులు గోడకున్న రంధ్రాన్ని చూసి షాపు వద్దకు వచ్చి చూడగా లోపలి తతంగం వారి కంటపడింది. అయితే దుకాణానికి తాళం వేసి ఉండటంతో వెళ్లిన ‘దారి’లోనే బయటకు రావాలని దొంగలను పోలీసులు ఆదేశించారు. దీంతో తిరిగి వారు రంధ్రంలోంచి బయటకు వచ్చాక అరెస్టు చేసి కటకటాల్లోకి పంపారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Two men drilled a hole in the wall of a liquor shop & were boozing inside when caught redhanded by a patrol police in Thiruvallur district. The men had planned to steal the liquor bottles but decided to booze before taking off when they were caught @xpresstn @NewIndianXpress pic.twitter.com/zF9MoRjlUX
— Novinston Lobo (@NovinstonLobo) September 4, 2022
(And get your daily news straight to your inbox)
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more
Oct 07 | గుజరాత్ పోలీసులు స్థానిక యువతపై కాకీ కాఠిన్యాన్ని ప్రదర్శించారు. ఓ వర్గానికి చెందిన యువతపై ఇలా విరుచుకుపడటం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అంటూ కేంద్ర,... Read more