Man dupes woman of Rs 48 lakh posing as NRI పేరు.. ఫోటో మార్చి.. మ్యాట్రిమోనీ సైట్లో యువతికి టోకరా

Man dupes woman of rs 48 lakh posing as nri on matrimonial site

Srikanth, Vamsi Krishna, Srikanth alias Vamsi Krishna, Vijayawada man, vijayawada vamsi krishan, prakasam, extorting money, man duping woman, America, Visa Charges, matrimonial site, Narsaraopet, Andhra Pradesh, Crime

The Andhra Pradesh Police registered a case agianst a person for allegedly duping a woman by posing as an Non Resident Indian on a matrimonial site. The Man allegedly changed his name and Photo for duping the woman, had extorted over Rs 48 lakh from the woman.

పేరు, ఫోటో మార్చి.. అమెరికాలో ఉంటున్నానని ఏమార్చి.. యువతికి టోకరా

Posted: 09/03/2022 01:25 PM IST
Man dupes woman of rs 48 lakh posing as nri on matrimonial site

ఇందుగలదు అందు లేదన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందందు కలదు మోసం, కుట్ర. అంటే వినడానికి ఆశ్చర్యంగా ఏమీ లేదు. ఎందుకంటే దేనిని పరిశీలించినా అందు నిక్షిప్తమై ఉండు దగా అన్నది ఈమెకు తన చేతిలోని డబ్బును కోల్పోయిన తరువాత అవగతమైంది. జీవిత భాగస్వామి కోసం మ్యాట్రిమోనిని ఆశ్రయించిన బాధితురాలు నిట్టనిలువునా మోసపోయింది. ఈ ఘటన అంధ్రప్రదేశ్ లోని నరసరావుపేటలో చోటుచేసుకుంది. దీంతో చేసేది లేక ఆమె పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

నరసరావుపేటకు చెందిన మహిళ నకిలీ మ్యాట్రిమోని వెబ్‌సైట్‌లో పేరు నమోదు చేసుకుంది. ఈ వెబ్‌సైట్‌ను ఫాలో అవుతున్న శ్రీకాంత్‌ అనే వ్యక్తి ఆన్‌లైన్లో ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. కొద్దిరోజుల తరువాత పరిచయాన్ని ప్రణయంగా మర్చేందుకు ఎత్తుగడ వేసిన నిందితుడు.. అనుకున్నట్లుగానే తన స్కేచ్ ప్రకారం కథను నడిపాడు. అతడ్ని మాయ మాటలకు మోసపోయిందో లేక అతనితో అగ్రరాజ్యంలో సెటిల్ అవ్వచ్చనన్న స్వార్థమో తెలియదు కానీ.. బాధితురాలు కూడా అతన్ని పూర్తిగా నమ్మింది. దీంతో తాను అమెరికాలో ఉంటానని నమ్మించి అక్కడికే రావాలని మహిళను నమ్మించాడు.

అందుకు వీసా పంపడానికి డబ్బు పంపాలని కోరగా విడతల వారిగా ఆమె నిందితుడు శ్రీకాంత్‌ బ్యాంక్‌ అకౌంట్‌లోకి రూ. 48 లక్షలు పంపింది. అనంతరం అతడి నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడం, ఫొన్‌ స్వీచ్ఛాఫ్‌ వస్తుండడంతో మోసానికి గురైనట్లు గ్రహించి నరసరావుపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి నిందితుడి ఫొన్‌ నంబర్‌ ఆధారంగా పోలీసుల దర్యాప్తు ప్రారంభించగా నిందితుడు విజయవాడకు చెందిన వంశీకృష్ణగా గుర్తించారు. అతడు మ్యాట్రిమోనిలో ఫొటో, పేరు మార్చి మోసానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. గతంలో ప్రకాశం జిల్లాలోనూ ఇదే మాదిరిగా నిందితుడు మోసానికి పాల్పడి అరెస్టు అయిన్నట్లు గుర్తించి అతగాడి కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles