Person in consensual relationship need not check DOB of partner ఇష్ట‌పూర్వ‌క శృంగారానికి.. వయస్సు నిర్థారణతో పనిలేదన్న హైకోర్టు

Can t check aadhaar card before sex high court on minor s rape charge

Delhi High Court, Rape, POCSO Act, Bail, Consensual sex, Physical Relationship, Aadhaar Card, Pan card, Age Proof, Delhi, Crime

The Delhi High Court observed that a person, who is in a consensual physical relationship with another person, is not required to judicially scrutinise the date of birth (DOB), Aadhar card, or PAN card of the other person before entering into a physical relationship. The high court made the observation while granting bail to a man facing charges of rape and provisions under the Protection of Children from Sexual Offences (POCSO) Act.

ఇష్ట‌పూర్వ‌క శృంగారానికి.. వయస్సు నిర్థారణ అవ‌స‌రం లేదు: ఢిల్లీ హైకోర్టు

Posted: 08/30/2022 03:58 PM IST
Can t check aadhaar card before sex high court on minor s rape charge

ఢిల్లీ హైకోర్టు ఓ కేసులో కీల‌క తీర్పును వెలువ‌రించింది. అమ్మాయిలు తమ ఇష్ట‌పూర్వ‌క శృంగారంలో పాల్గొనే సందర్భంలో వారి వయస్సును నిర్థారించుకోవాల్సిన అవసరం లేదని న్యాయస్థానం తీర్పును ఇచ్చింది. సమ్మతితో కూడిన శృంగారంలో వ్య‌క్తులు, తమ భాగ‌స్వామి వ‌య‌సును నిర్థారించుకోవాల్సిన అవసరం లేదని న్యాయస్థానం తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో తమ భాగస్వామి వస్సుసును తెలుసుకునేందుకు ఆధార్‌, ప్యాన్ కార్డు చెక్ చేయాల్సిన అవ‌స‌రం లేద‌ని ఓ కేసులో కోర్టు తీర్పునిచ్చింది. ఇష్టపూర్వక శృంగారం విషయంలో పోస్కో చట్టం వర్తించదని తెలిపింది.

మైనారిటీ తీరని ఓ అమ్మాయితో ఓ వ్యక్తి ఇష్టపూర్వక శృంగారానికి పాల్పడ్డాడు. దీంతో సదరు వ్యక్తిపై మైన‌ర్‌ను రేప్ చేసినట్లు కేసు న‌మోదు చేశారు పోలీసులు. దీంతో ఈ కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా నిందితుడు న్యాయస్థానంలో బెయిల్ పిటిష‌న్‌ దాఖ‌లు చేశాడు, ఢిల్లీ హైకోర్టు ఈ బెయిల్ పిటీషన్ ను విచారించింది. ఈ సందర్భంగా సమ్మతితో కూడిన శృంగారం విషయంలో భాగస్వామి వయస్సను నిర్థారించుకోవాల్సిన అవసరం లేదని బెయిల్ పిటీషన్ విచారించిన న్యాయమూర్తి జ‌స్టిస్ జ‌స్మీత్ సింగ్ పేర్కోన్నారు. అయితే ఆ మ‌హిళకు రికార్డుల ప్ర‌కారం మూడు ర‌కాల పుట్టిన‌రోజులు ఉన్నాయ‌ని, రేప్ జ‌రిగిన నాటికి ఆమె మైన‌ర్ కాదు అని కోర్టు అభిప్రాయ‌ప‌డింది.

ఏకాభిప్రాయంతో శారీర‌క సంబంధం పెట్టుకున్న వ్య‌క్తి .. త‌న భాగ‌స్వామి డేట్ ఆఫ్ బ‌ర్త్‌ను తెలుసుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని, దాని కోసం ఆ వ్య‌క్తి ఆధార్‌, ప్యాన్ కార్డును ప‌రిశీలించాల్సిన అవ‌స‌రం లేద‌ని కోర్టు పేర్కొన్న‌ది. ఆధార్ కార్డులో ఆ మ‌హిళ పుట్టిన రోజు 01.01.1998గా ఉంద‌ని, ఈ ఒక్క ఆధారంతో ఆమె మైన‌ర్ కాదు అని తెలుస్తోంద‌ని జ‌డ్జి తెలిపారు. అయితే అమ్మాయికి భారీ మొత్తంలో డ‌బ్బు ట్రాన్స్‌ఫ‌ర్ అయ్యింద‌ని, బెయిల్ ఇవ్వ‌డానికి ఇది కూడా ఓ కార‌ణం అవుతుంద‌ని కోర్టు తెలిపింది. హ‌నీ ట్రాపింగ్ కేసుల గురించి జ‌డ్జి త‌న తీర్పులో ప్ర‌స్తావించారు. పోలీసులు అలాంటి కేసుల్ని సునిశితంగా విచారించాల‌ని ఆదేశించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Delhi High Court  Rape  POCSO Act  Bail  Consensual sex  Physical Relationship  Aadhaar Card  Pan card  Age Proof  Delhi  Crime  

Other Articles