Pharma students hold Birthday Party Inside Lucknow Hospital ఆసుపత్రిలో విద్యార్థుల బర్త్‌ డే పార్టీ.. బెల్టుతో కొట్టుకుంటూ హంగామా.!

Pharma students create ruckus while celebrating birthday at lucknow civil hospital

Pharma students, Lucknow civil hospital, birthday party in Hospital, lucknow students birthday party, pharmacy students birthday party, pharmacy, birthday party, higher authorities, enquiry, Lucknow, Uttar Pradesh, Viral Video

A video of pharmacy students of a civil hospital in Lucknow creating a ruckus inside the hospital premises while celebrating a birthday is doing rounds online. The video has attracted the attention of the higher authorities who have initiated an enquiry in the matter. The video was shared on Twitter by ANI on Monday and has received more than 5,500 views so far.

ITEMVIDEOS: ఆసుపత్రిలో విద్యార్థుల బర్త్‌ డే పార్టీ.. బెల్టుతో కొట్టుకుంటూ హంగామా.!

Posted: 08/08/2022 04:47 PM IST
Pharma students create ruckus while celebrating birthday at lucknow civil hospital

పుట్టిన రోజు వేడుకల పేరుతో వికృత చేష్టలకు పాల్పడుతున్న సంఘటనలు ఇటీవల పెరిగిపోయాయి. అందులోనూ ఉత్తర్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో స్వయంగా రాజకీయ నాయకులే చట్టాలను అతిక్రమించి మరీ బర్త్ డే పార్టీలలో తుపాకీలతో గాల్లోకి కాల్పులు జరుపుతున్న ఘటనలు కూడా నమోదయ్యాయి. అలాంటి సంఘటనే మరోమారు ఉత్తర్‌ప్రదేశ్‌ రాజధాని లక్నోలో వెలుగు చూసింది. సమాజానికి మంచి చెప్పాల్సిన రాజకీయ నాయకులే సముచిత స్థానంలో కొనసాగుతూ తప్పులు చేస్తుంటే.. తామేం తక్కువ తిన్నామా.? అన్నట్లు వ్యవహరించారు లక్నోలోని ఓ ఫార్మ విద్యార్థులు.

లక్నోలోని సివిల్‌ ఆసుపత్రిలో ట్రైనింగ్ లో ఉన్న విద్యార్థులు.. తాము ఎక్కడ ఉన్నాము.. ఎలాంటి సున్నితమైన ప్రదేశంలో ఉన్నామన్న ఇంకితజ్ఞానం కూడా లేకుండా.. హల్ చల్ చేశారు. రోగులు తమ బాధలతో అప్పుడప్పుడే కంటి మీద కునుకు వేస్తున్న సమయంలో ఫార్మసీ విద్యార్థులు ఆదివారం అర్ధరాత్రి బర్త్‌డే పార్టీ పేరుతో బీభత్సం సృష్టించారు. తామున్నది అసుపత్రి.. అక్కడున్నది తమ రోగాలను నయం చేసుకునేందుకు వచ్చిన రోగులు.. వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా, అత్యంత నెమ్మెదిగా వ్యవహరించాల్సిన అసుపత్రిలో.. ఫార్మా విద్యార్థులు హంగామా చేశారు. తమను ఎవరు అడ్డుకునేంది అన్న రీతిలో వ్యవహరించి పలువురు ఫార్మసీ విద్యార్థులు ఆసుపత్రిలో రచ్చరచ్చ చేశారు.

బర్త్ డే పార్టీ పేరుతో బెల్టుతో కొట్టుకుంటూ, అరుస్తూ హల్ చల్ చేశారు. సుమారు గంట సమయం పాటు ఆసుపత్రి ప్రాంగణం గోల గోలగా మారిపోయింది. రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం ఆ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఆరోగ్య శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి బ్రజేశ్‌ పతక్‌.. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దర్యాప్తు చేపట్టి కారకులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వైరల్‌ వీడియో తన దృష్టికి వచ్చిందని, దర్యాప్తు చేపట్టామని సివిల్‌ ఆసుపత్రి డైరెక్టర్‌ డాక్టర్‌ ఆనంద్‌ ఓజా తెలిపారు. ‘వీడియోలోని వ్యక్తులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నాం. వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.’ అని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles