Extreme rainfall to lash in multiple Telangana districts తెలంగాణకు మరో నాలుగు రోజుల పాటు వర్షాలు: ఐఎండీ

Imd issues orange alert for 4 days in parts of telangana heavy rains continue to pound

Rain in Hyderabad, Rain in Telangana, yellow alert, telanagana, meteorological department, cyclonic, bay of bengal, upper air cyclonic circulation, Peddapalli, Jayashankar Bhupalpally, Mulugu, Bhadradri Kothagudem, Khammam, Nalgonda, Suryapet, Mahabubabad, Medak, Warangal rural districts, heavy flood flow, musarambhag bridge close, hyderabad floods, musi floods

The Met Department, issued orange alert for heavy rains at several places over the next three days. Officials said light to moderate rain or thundershowers were likely at many places across the State. IMD notes that the upper air cyclonic circulation over the west-central Bay of Bengal off Andhra Pradesh coast extends upto 3.1 km above mean sea level which results in rains for the next four days.

తెలంగాణ ప్రజలకు మరో పిడుగులాంటి వార్త.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు: ఐఎండీ

Posted: 08/03/2022 05:04 PM IST
Imd issues orange alert for 4 days in parts of telangana heavy rains continue to pound

తెలంగాణ రాష్ట్రంపై వరుణుడు తన ప్రకోపాన్ని చాటుతూనే ఉన్నాడు. వరదలంటే ఎరుగుని హైదరాబాద్ ప్రజలకు వరదల తీవ్రత ఎలాంటిదో రుచిచూపాడు. జంట జలాశయాల గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు వదిలిన ఘటనలు నమోదయ్యాయి. జూలైలో నమోదు కావాల్సిన వర్షపాతం కన్నా 125శాతం అధికంగా నమోదయ్యేలా చేశాడు. అయినా వరుణుడు ఇంకా శాంతించడం లేదని తాజాగా మరో పిడుగులాంటి వార్తను తెలంగాణ ప్రజలకు వెలువరించింది భారత వాతావరణ శాఖ. రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతవరణ కేంద్రం హెచ్చరించింది.

రాష్ట్రంలోని నిర్మల్‌, నిజామాబాద్‌, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో అతి భారీవర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ మేరకు ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ చేసింది. అలాగే ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది.

గురువారం రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఆదిలాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, మహబూబాబాద్‌, సంగారెడ్డి, మెందక్‌, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ మేరకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. 5న కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. 6న రంగారెడ్డి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయంటూ ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ చేసింది. అలాగే నిజామాబాద్‌, నిర్మల్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, సిద్ధిపేట, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ ఎల్లో అరెల్ట్‌ను జారీ చేసింది. అలాగే గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles