When will GPF be deposited? High Court questioned Govt ‘ఉద్యోగుల జీపీఎఫ్​ డబ్బు ఎందుకు ఉపసంహరించారు..?'

Tell when gpf amount will be returned to staff ap high court asks govt

High Court, GPF withdrawl, government employees, Govt Employees union leader, Krishnaiah, krishnaiah petition on GPF withdrawl, High Court on GPF, AP High Court, GPF, AP government, Vijayawada, Andhra News, Andhra Pradesh News

The High Court has asked the government to tell when the GPF amount drawn from the account of the government employees will be deposited. In this regard, it has been ordered to file a counter before 3rd August. On Friday, the court heard the petitions filed by Krishnaiah against the GPF withdrawl.

‘ఉద్యోగుల జీపీఎఫ్​ డబ్బు ఎందుకు ఉపసంహరించారు..?': సర్కారుకు హైకోర్టు ప్రశ్న

Posted: 07/22/2022 07:59 PM IST
Tell when gpf amount will be returned to staff ap high court asks govt

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఆ రాష్ట్ర హైకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఉద్యోగుల జీపీఎఫ్​ మాయం అంశంపై రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టులో విచారణ సందర్బంగా.. న్యాయస్థానం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. జీపీఎఫ్​ సొమ్మును ఎందుకు ఉపసంహరించారని ఏపీ ప్రభుత్వాన్ని ఆ రాష్ట్ర హైకోర్టు ప్రశ్నించింది. ఉద్యోగులకు కనీస సమాచారం లేకుండా వారి అకౌంట్ల నుంచి డబ్బును ఎలా ఉపసంహరిస్తారని ప్రశ్నించింది. ప్రభుత్వానికి తెలియకుండా ఉద్యోగులు ప్రజాధనాన్ని ఉపసంహరిస్తే.. ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందని ప్రశ్నించింది. అదే పని ఇప్పుడు ఉద్యోగులు చేస్తే.? పరిస్థితి ఏమిటని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.

సాంకేతిక తప్పిదం వల్లే జరిగిందని ప్రభుత్వ న్యాయవాది న్యాయస్థానానికి బదులివ్వగా.. ప్రతీసారి ఇలాగే చెబితే ఓ చార్టెడ్ అకౌంటెంటును అడ్వకేట్ కమిషనర్‌గా నియమించాల్సి వస్తుందని హైకోర్టు అభిప్రాయపడింది. ప్రభుత్వానికి అవసరమై 2 వేల కోట్ల రూపాయలు వాడుకున్నారన్న హైకోర్టు.. ఎప్పుడు జమ చేస్తారని ప్రశ్నించింది. ఈ మేరకు దాఖలైన పిటీషన్లపై కిందిస్థాయి అధికారితో అఫిడవిట్ వేయించడం సరికాదని పిటిషనర్ తరఫు న్యాయవాది రవితేజ కోర్టుకు నివేదించగా.. సమయాభావంతో అలా జరిగిందని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు.

ఇకపై ప్రిన్సిపల్ సెక్రటరీ అఫిడవిట్ దాఖలు చేస్తారని సమాధానమిచ్చారు. అయితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు దాఖలు చేసిన పిటీషన్లపై ఎవరు అఫిడవిట్ దాఖలు చేసినా.. ప్రభుత్వ కార్యదర్శే బాధ్యులు అవుతారని తెలిపిన న్యాయస్థానం.. నగదు ఎప్పుడు జమ చేస్తారో పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఆగస్టు 3కి వాయిదా వేసింది. జీపీఎఫ్​ ఖాతాల నుంచి సొమ్ముల ఉపసంహరణపై గెజిటెడ్ ఉద్యోగుల సంఘం నేత కృష్ణయ్య దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : High Court on GPF  AP High Court  GPF  AP government  Vijayawada  Andhra News  Andhra Pradesh News  

Other Articles