RSS office damaged in crude bomb attack ఆర్‌ఎస్‌ఎస్‌ ఆఫీస్‌పై బాంబు విసిరిన దుండగులు..

Kerala bombs hurled at rss office in kannur district

Rashtriya Swayamsevak Sangh, rss bombs, assam, fazal khan, shahidul, kannur district, n harisdasan, cpi, Bomb hurled, RSS Office, Kannur, Kerala

An RSS office in Kerala's Kannur was damaged in a bomb attack that occurred in the wee hours on Tuesday. The glass panes of the front windows were shattered in the attack. No one was injured in the attack. The office is located at Payyannur in Kannur. Recently, the headquarters of Kerala CPI(M) in Thiruvananthapuram was attacked. Several Congress officers too were attacked following the AKG Centre attack. Though police had launched an investigation, the accused is still at large.

ITEMVIDEOS: వీడియో వైరల్: ఆర్‌ఎస్‌ఎస్‌ ఆఫీస్‌పై బాంబు విసిరిన దుండగులు..

Posted: 07/12/2022 08:24 PM IST
Kerala bombs hurled at rss office in kannur district

కేరళ పయ్యనూర్‌లోని రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) కార్యాలయంపై మంగళవారం తెల్లవారుజామున ఇద్దరు దుండగులు బాంబు విసిరారు. దీంతో భవనం ప్రధాన ద్వారం తలుపులు, కిటికీలు ధ్వంసమయ్యాయి. బాంబు దాడి దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో నమోదయ్యాయి. ధ్వంసమైన తలుపులు, కుర్చీలు, టేబుళ్ల ఫోటోలు, బాంబు దాడి వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. దాడికి కొద్ది సమయం ముందు ఇద్దరు వ్యక్తులు ద్విచక్రవాహనంపై వచ్చి ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యాలయాన్ని పరిశీలించినట్లు సీసీటీవీలో నమోదైంది.

బాంబుదాడి జరిగిన సమయంలో ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యాలయం మూసి ఉండటం వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. 'కన్నూర్‌ జిల్లా, పయ్యనూర్‌లోని ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యాలయంపై బాంబు దాడి జరిగింది. ఈరోజు తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. కిటికి అద్దాలు ధ్వంసమయ్యాయి.' అని పయ్యనూర్‌ పోలీసులు వెల్లడించారు. మరోవైపు.. దాడి జరిగిన ఆర్‌ఎస్‌ఎస్‌ ఆఫీసు స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు సమీపంలోనే ఉండటం గమనార్హం. దాడి నేపథ్యంలో ఆ ప్రాంతంలో భద్రత పెంచారు పోలీసులు.

కేసు నమోదు చేసుకుని దుండగులను పట్టుకునేందుకు గాలింపు చేపట్టారు. బాంబు దాడి వెనుక సీపీఎం పాత్ర ఉందని ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ నాయకులు ఆరోపించారు. దీనిపై ఉన్నతస్థాయి దర్యాప్తు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. 'ఈ దాడిలో సీపీఎం పాత్ర ఉందని మేము అనుమానిస్తున్నాం. బంగారం స్మగ్లింగ్ వ్యవహారం బహిర్గతమైన తర్వాత అధికార పార్టీ పీకల్లోతు కష్టాల్లోకి జారుకుంది. దాని నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే ఇలాంటివి చేస్తోంది.' అని బీజేపీ కన్నూర్‌ జిల్లా అధ్యక్షుడు ఎన్‌ హరిస్‌దాసన్‌ పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles