"India Not Creating Good Jobs": Raghuram Rajan భారత్ లో తీవ్ర నిరుద్యోగమే పెను ప్రమాదం: రఘురామ్ రాజన్

Without reforms india will grow too slowly for its own good says raghuram rajan

Raghuram Rajan, Former RBI Governor, Raghuram Rajan On Democracy, India At 75 Lecture Series, Jobs Crisis in India, Agnipath Protest, India reforms, bank privatisation, Inflation, monetary policy, rbi rates, rbi, sri lanka, Hindu Temples, BJP, Narendra modi, Indian economy, India growth, GDP growth, India growth

Former Reserve Bank of India Governor Raghuram Rajan has said that if unemployment rates in India remain high, it may lead to 'entrepreneurial' politicians who cater to religious divisions, rather than focusing on actually enhancing jobs.

భారత్ లో తీవ్ర నిరుద్యోగమే పెను ప్రమాదం.. అగ్నిపథ్ అందోళనలే నిదర్శనం: రఘురామ్ రాజన్

Posted: 07/11/2022 01:00 PM IST
Without reforms india will grow too slowly for its own good says raghuram rajan

ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ దేశంలోని తాజా పరిస్థితులపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. 75 వసంతాల స్వతంత్ర భారతావనిలో ప్రజాసామ్యం, అభివృద్ధి అనే అంశంపై మాట్లాడుతూ, ఉదారవాద ప్రజాస్వామ్యం వేళ్లూనుకున్నప్పుడే భారత్ 'విశ్వగురు' అనిపించుకుంటుందని అన్నారు. కాలం చెల్లిన సిద్ధాంతాలు, భావజాలంతో భారత్ ఎప్పుడూ అంతర్జాతీయంగా ఎదగలేదని స్పష్టం చేశారు. భారత్ యువతకు సరైన ఉద్యోగాలు కల్పించలేకపోతోందని, అందుకు ఇటీవల అగ్నిపథ్ కు వ్యతిరేకంగా తలెత్తిన నిరసనలే నిదర్శనమని రఘురామ్ రాజన్ పేర్కొన్నారు.

భారత్ లో అభివృద్ధి మందగమనంలో సాగుతుండడానికి కేవలం కరోనా సంక్షోభాన్ని కారణంగా చూపలేమని, పేలవ నాయకత్వం కూడా ఓ కారణమని విశ్లేషించారు. అయితే, ప్రపంచ ఆర్థిక సంక్షోభం, దాని పర్యవసానాల ప్రభావం భారత్ పైనా పడిందని వివరించారు. ఏదేమైనా అత్యంత నాణ్యమైన ఉద్యోగ, ఉపాధి కల్పనలో మనం వెనుకబడి ఉన్నామని పేర్కొన్నారు. దేశంలో నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉండగా రాజకీయ నాయకులు యువతకు ఉపాధి అవకాశాల కల్పనపై దృష్టిసారించకుండా మతపరమైన విభజనలతో కాలయాపన చేస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.

దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉండటం దేశానికి పెను ప్రమాదకరమని ఆయన పేర్కోన్నారు. దిగువ మధ్యతరగతి ప్రజలను ఈ సమస్య మరింత దిగజార్చుతుందని అయన అన్నారు. దీంతో విజభన రాజకీయాలకు మరింత పెరగడంతో పాటు అసమానతలు కూడా తీవ్రమవుతాయని తెలిపారు. ఇప్పుడు ఓ వర్గానికి చెందిన ప్రార్థనా స్థలాలుగా ఉన్న ప్రాంతాలను అంతకు పూర్వం అవి ఇతర వర్గాల ప్రార్థనా స్థలాలుగా ఉన్నాయని.. దీంతో వాటి పునరుద్దరణకు దృష్టి సారించేలా చేస్తున్నాయని దుయ్యబట్టారు. ఈ యువత శక్తిని మళ్లిస్తూ రాజకీయ నాయకులు పబ్బం గడుపుకుంటున్నారని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles