Indian expat honoured by Dubai police లిఫ్టులో రూ.2కోట్లు దొరికితే.. ఆ యువకుడు ఏం చేశాడో తెలుసా?

Indian expat honoured by dubai police for handing over rs 2 crore cash found in lift

Indian expat, Tariq Mahmood Khalid, dubai police, Dh1 million in cash, Police Appreciation, Al Barsha, Dubai police, Brigadier Abdul Rahim bin Shafi, Dubai

Indian National Tariq Mahmood Khalid was honoured with a certificate of appreciation by the Dubai police. Khalid found Dh1 million in cash in his building’s elevator and handed it to the Dubai police. The NRI found the money in his building in Al Barsha.

రూ.2కోట్లు డబ్బుల బ్యాగ్ దొరికితే.. భారతీయ యువకుడు.. ఏం చేశాడో తెలుసా?

Posted: 06/06/2022 05:48 PM IST
Indian expat honoured by dubai police for handing over rs 2 crore cash found in lift

ఈ కాలంలో నీతి, నిజాయితీలు గురించి ఎవరిని అడిగినా చెప్పేస్తున్నారు. గంటల పాటు నిల్చున్న చోట నుంచి కదలకుండా ప్రసంగాలు గుప్పిస్తున్నారు. అయితే వారిలో వాటిని ఆచరించే వారు ఎంతమంది అంటే మాత్రం కాస్తా కష్టమైన టాస్క్ అనే చెప్పాలి. కానీ మన భారతీయుల్లో మాత్రం ఇంకా నీతి నిజాయితీ ఉందని అటోడ్రైవర్ల నుంచి పలు చిన్నాచితక పనులు చేసుకునే పేదల్లో ఇంకా అవి కొట్టోచ్చినట్టు కనబడుతున్నాయి అనడానికి ఇప్పటికే పలు ఘటనలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. తమ జీవితాలకు తమకు లభించిన వస్తువు అత్యంత అసరమని తెలిసినా.. వాటి విలువ తెలిసిన వ్యక్తులు నిజాయితీగా వ్యవహరించిన.. వాటిని వాటి యజమానుల దగ్గరకు చేరవేస్తున్నారు.

కానీ ఇప్పటికీ చాలా మంది ప్రజలు నిజాయితీగా జీవనం సాగిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తుండటం కనిపిస్తూనే ఉంటుంది. దేశం కాని దేశం.. ఏకంగా డబ్బుల మూట లభించినా.. తన అవసరం తీరిపోతుంది. బ్యాంకులో డిపాజిట్ చేసి స్వదేశం తిరిగివచ్చేయవచ్చే అవకాశం వున్నా.. తన నిజాయితీకే ప్రధమ తాంబులం ఇచ్చిన వ్యక్తి మన భారతీయుడు. ఔనా ఎక్కడ అంటారా..? దుబాయ్‌లో భారతీయ వ్యక్తికి డబ్బుల మూట కళ్లముందు కనిపించింది. అడిగేవారు లేరు. నాది అనేవారు లేరు. దానిని తీసుకుని వెళ్లినా.. అప్పటికప్పుడు ప్రశ్నించేవారు లేరు. అయినా ఆ వలస కార్మికుడు తన నిజాయితీకే ఓటువేశాడు. ఆయనే తరీక్ మహమూద్ ఖలీద్ మహమూద్.

ఇక్కడ అల్ బార్షా ప్రాంతంలో నివశిస్తున్నాడు. తను ఉండే అపార్ట్‌మెంట్ లిఫ్టులో అతనికి ఒక బ్యాగ్ కనిపించింది. ఏంటా? అని చూస్తూ పది లక్షల దీనార్లు (రూ.2.1 కోట్లపైగా) డబ్బులు దొరికాయి. వాటిని చూసి కూడా దురాశ చెందని తరీక్ మహమూద్.. వెంటనే ఆ డబ్బును తీసుకెళ్లి స్థానిక పోలీసు స్టేషన్‌లో అప్పగించాడు. అతని నిజాయితీ చూసి మెచ్చుకున్న పోలీసులు.. తరీక్‌ను గౌరవిస్తూ ఒక ధ్రువపత్రాన్ని అందించారు. ‘‘మన సమాజంలో ఉండే ఉన్నతమైన విలువలకు అతని నిజాయితీ అద్దం పడుతోంది’’ అని పోలీసు ఉన్నతాధికారులు మెచ్చుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles