housewife finds diamond worth Rs 10 lakh in mine అదృష్ట పరీక్షలో నెగ్గిన గృహిణి.. లక్షాధికారిగా మారిన చెమేలి బాయి

Mp village housewife finds diamond worth rs 10 lakh in panna mine

village woman turns lakpati, Village housewife finds diamond in Mine, Village woman finds diamond worth Rs 10 lakh, Village housewife finds diamond worth Rs 10 lakh in Panna mine, village woman finds good quality diamond, Chameli Bai, village house wife, Itwakala village, 2.08 carat diamond, good quality diamond, Krishna Kalyanpur Pati area, Panna city, Madhya Pradesh

A woman from a village has found a 2.08-carat diamond in a shallow mine in Madhya Pradesh’s Panna district, officials said. The stone is of good quality and may fetch up to Rs 10 lakh in auction, they said.

అదృష్ట పరీక్షలో నెగ్గిన గృహిణి.. లక్షాధికారిగా మారిన చెమేలి బాయి

Posted: 05/25/2022 06:25 PM IST
Mp village housewife finds diamond worth rs 10 lakh in panna mine

తన కుటుంబం ఒక చిన్న ఇళ్లు కొనుక్కోవాలని అనుకుంది. అయితే తాముండే గ్రామంలో కాకుండా జిల్లా కేంద్రంలో అంటే లక్షల రూపాయల వ్యవహారం. ఐతే లక్షలు కావాలంటే  ఎవరు మాత్రం ఇస్తారు. వ్యాపారం చేస్తామంటే ఎలాగైనా తీరుస్తారని గ్రామంలోని పెద్దలు సాయం చేసేందుకు ముందుకు వస్తారు. కానీ ఉన్న ఊరును వదిలేసి జిల్లా కేంద్రంలో ఇళ్లు కట్టుకుని ఉండాలంటే ఎవరు మాత్రం ఎందుకిస్తారు. అక్కడికి వెళ్లిన తరువాత మాట పాయే.. మనిషే కనబడటమూ చాలా అరుదు అవుతుందని వారికి తెలియదా.? ఈ విషయం వారికి అవగతమైంది. దీంతో తామే తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావించారు.

తన భార్యపై పూర్తి నమ్మకమున్న ఓ రైతు అమె పేరున అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనుకున్నాడు. అంతే అనుకున్నదే తడవుగా రంగంలోకి అమెను దింపాడు. అంతే తనపై పూర్తి విశ్వాసం, నమ్మకాలను పెట్టుకున్న భర్తను, అతని మాటను వమ్ము చేయడం అమెకు ఇస్టం లేదు. అంతే తన భర్త కోరిక మేరకు మేూడు నెలలుగా కష్టపడుతున్న అమె.. ఎట్టకేలకు విజయం సాధించింది. తన అదృష్టానికి తిరుగులేదని అమె చెప్పకనే చెప్పింది. అదెలా సాధ్యమంటే.. వజ్రాల మైనింగ్ కోసం ప్రయత్నించిన అమె విజయవంతమయ్యారు. మధ్యప్రదేశ్​కు చెందిన ఓ మహిళ. ఈ ఏడాది మార్చిలో మైన్ లీజుకు తీసుకోగా.. తాజాగా 2.08 క్యారెట్ల వజ్రం బయటపడింది.

ఆ వజ్రం విలువ రూ.10 లక్షలు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. మధ్యప్రదేశ్​కు చెందిన ఓ మహిళ పంట పండింది. లీజుకు తీసుకున్న గనిలో 2.08 క్యారెట్ల వజ్రం దొరికింది. పన్నా జిల్లాలోని ఇత్వాకలా గ్రామంలో నివసించే చమేలి బాయి.. కృష్ణ కల్యాణ్​పుర్ పాటి ప్రాంతంలో వజ్రాల గనిని లీజుకు తీసుకున్నారు. ఈ ఏడాది మార్చిలోనే లీజుకు తీసుకొని మైనింగ్ ప్రారంభించారు. ఇక్కడే వీరికి ఈ వజ్రం దొరికింది. మంగళవారం పన్నా డైమండ్ ఆఫీస్​లో ఈ వజ్రాన్ని అధికారుల వద్ద డిపాజిట్ చేశారు చమేలి బాయి దంపతులు. దీనికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ధర నిర్ణయించి త్వరలో వేలం వేస్తారు.

వజ్రం నాణ్యతను బట్టి దీనికి రూ.10 లక్షల వరకు పలకొచ్చని అధికారులు తెలిపారు. వేలంలో వచ్చిన ధర నుంచి పన్నులు, రాయల్టీలను మినహాయించి మిగిలిన మొత్తాన్ని మహిళకు అప్పగిస్తామని చెప్పారు. తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వజ్రాల గనిని లీజుకు తీసుకున్నామని చమేలి భర్త అర్వింద్ సింగ్ చెప్పుకొచ్చారు. వజ్రం దొరకడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. వజ్రాన్ని వేలం వేసిన తర్వాత వచ్చిన సొమ్ముతో పన్నా నగరంలో ఇల్లు కొనుక్కుంటామని చెప్పారు. పన్నా జిల్లాలోని గనుల్లో 12 లక్షల క్యారెట్ల వజ్రాలు ఉన్నట్లు అధికారుల అంచనా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles