మనిషిలోని శక్తి సన్నగిల్లుతుందని చెప్పేది తొలుత కళ్లు మాత్రమే. మధుమేహం, కిడ్నీ సమస్యలు, ఇలా ఏ దీర్ఘకాలిక వ్యాధి సోకుతున్నా.. ముందుగా హెచ్చరించేది నేత్రాలే. అందుకనే సర్వేంద్రియానం నైనం ప్రధానం అన్న సూక్తి తెరపైకి వచ్చింది. కళ్లు మంచిగా ఉన్నంతవరకు మనకు ఏలాంటి అరోగ్యసమస్యలు లేవన్న ధీమాగా ఉండవచ్చు. అయితే.. ప్రస్తుతం 40 ఏళ్లు పైబడిన వారికి కళ్లు మసకగా ఉంటాయి. దగ్గర్లోని వస్తువులు కూడా సరిగ్గా కనపించవు. అదే చత్వారం (ప్రెస్బయోపియా). అయితే చత్వారంతో బాధపడే వారు ఏమీ చదవలేరు. వారికి కళ్లు కనిపించక ఇబ్బందులు కూడా పడుతుంటారు.
ఇందుకోసం నేత్రవైద్యులను ఆశ్రయిస్తే వారు అటు ఔషదాలు రాయడంతో పాటు మరోవైపు కళ్లద్దాలను కూడా రాస్తారు. మందులంటే గుర్తుపెట్టుకుని మరీ వేసుకుంటారు. కానీ అలవాటు లేని కళ్లద్దాలు పెట్టుకోవడమంటే చాలామంది అయిష్టం వ్యక్తం చేస్తారు. కొందరు అబ్బా కళ్లజోడు చాలా బరువుగా ఉందని, మరికొందరు మరోకారణం చేతనో వాటిని పక్కనపడతారు. అయితే వాటిని పక్కనబెడితే కంచి చూపు ఎలా మెరుగవుతుందని కుటుంబసభ్యులు ప్రశ్నిస్తుంటారు. అయితే ఇలాంటివారి కోసం మరో కొత్త మందు అందుబాటులోకి వచ్చింది. ఇకపై కళ్లద్దాలు పెట్టుకోకపోయినా పర్వాలేదు కానీ.. ఈ మందు వేసుకుంటే చాలు కళ్లు అద్దాలు పెట్టుకున్నట్లుగానే కనిపిస్తాయి.
ఇది చుక్కల మందు. దీనిని ఒక్క చుక్క కంట్లో వేసుకుంటే.. కళ్లు దాదాపుగా ఆరు నుంచి ఏడు గంటల పాటు స్పష్టంగా కనిపిస్తాయి. అదే వ్యూటీ. సరికొత్త ఔషధం. దీనిని కంటిలో వేసుకున్న 15 నిమిషాలకే కళ్లలో మసకపోయి స్పష్టంగా చూడగలుగుతారు. అలాగే పుస్తకాలు, పేపర్లను చదువుకోవచ్చు. ఇదొచ్చిన వారు కళ్లజోడు అవసరం లేకుండా పుస్తకాలు చదవలేరు. దీంతో ఇలాంటి వారి కోసం ‘వ్యూటీ’ చుక్కల మందు అందుబాటులోకి వచ్చింది. అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ ఎఫ్‌డీఏ దీనికి అనుమతిని ఇచ్చింది. కన్ను పనిచేసే తీరును బట్టి ఈ చుక్కల మందు పనిచేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఎఫ్‌డీఐ అనుమతితో చత్వారాన్ని సరిచేసే తొలి చుక్కల మందుగా ‘వ్యూటీ’ రికార్డులకెక్కింది. అయితే ఇది కేవలం క్లోజ్-అప్ (దగ్గరి)దృష్టిని మెరుగుపరచడానికి ఉద్దేశించిన కొత్త ఔషధం ఇప్పుడు అమెరికాలోని ఫార్మసీలలో ప్రిస్క్రిప్షన్ ద్వారా అందుబాటులో ఉంది. పిలోకార్పైన్ కంటి చుక్కలు - వ్యూటీ బ్రాండ్ పేరుతో అమ్మకాలు కొనసాగుతున్నాయి. వయస్సు-సంబంధిత అస్పష్టమైన దృష్టితో బాధపడుతున్న మిలియన్ల మంది వ్యక్తుల కోసం రీడింగ్ గ్లాసెస్ వ్యూటీ ప్రత్యామ్నాంగా మారనుంది. అక్కడి మీడియా ప్రకారం వ్యూటీకి ఔషధానికి అక్టోబర్‌లో ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా ఆమోదం లభించింది. కాగా ఈ వారం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది.
ప్రతి కంటిలో ఒక చుక్క 6 నుండి 10 గంటల వరకు వినియోగదారులకు పదును చూపుతుంది. వ్యూటీ యొక్క 30 రోజుల సరఫరా ధర అమెరికాలో సుమారు $80గా నిర్ధేశించబడింది. కాగా వ్యూటీ కంటి చుక్కల మందుతో దూర దృష్టిని ఏమాత్రం ప్రభావితం కాదు. దీంతో ఇది కేవలం పెద్దవయస్కులైన వారి సమీపదృష్టితో పాటు మధ్యస్థ దృష్టిని మెరుగుపరుస్తుంది. ఛత్వారంతో బాధపడుతున్న మిలియన్ల మంది అమెరికన్ల కోసం ఈ మొదటి రకం చికిత్సను ఊహించిన దానికంటే త్వరగా మార్కెట్‌లోకి తీసుకురావడం మాకు సంతోషంగా ఉంది" అని అలెర్గాన్ మెడికల్ థెరప్యూటిక్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జగ్ దోసాంజ్ తెలిపారు. .
(And get your daily news straight to your inbox)
Jun 30 | మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేల నాయకుడు ఏక్నాథ్ షిండే గురువారం రాత్రి 7.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయగా, డిప్యూటీ సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇవాళ రాత్రి... Read more
Jun 30 | రైలు టికెట్ కొనాలంటే ముందుగా కౌంటర్ వద్దకు వెళ్లేందుకు ప్రయాణీకులు ఎంతో సమయం క్యూల్లో నిలబడిఉండాలి. టికెట్లు ఇచ్చే వ్యక్తిపైనా తరచూ ఫిర్యాదులు వస్తుంటాయి. ఈ ప్రక్రియ సంక్లిష్టంగా మారడంతో పరిస్థితి మెరుగుపరిచేందుకు పలు... Read more
Jun 30 | గత కొన్నిరోజులుగా కొనసాగుతున్న మహారాష్ట్ర సంక్షోభానికి ఎట్టకేలకు తెరపడింది. కాంగ్రెస్, ఎన్సీపీలతో కలసి ప్రభుత్వ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న శివసేన రెబల్ వర్గ ఎమ్మెల్యేలు బీజేపితో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి రంగం సిద్దమైంది. అయితే... Read more
Jun 30 | బంగారం అంటే మహిళలకు చాలా ఇష్టం. దీని కోసమే ఎన్నో ఇళ్లలో మగవారు చీవాట్లు తింటారు. ఇంకొన్ని ఇళ్లలో ప్రశంసలను అందుకునే వాళ్లూ ఉన్నారు. మరి ఈ కుందనం నలుపు శరీర ఛాయ ఉన్నవారిపై... Read more
Jun 30 | గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న మహారాష్ట్ర సంక్షోభం శివసేన అధినేత, మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే రాజీనామాతో క్లైమాక్స్ కు చేరింది. మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్ ఎనమిది మంది మంత్రులపై విధించిన... Read more