పెళ్ళంటె పందిళ్ళు.. సందళ్ళు, తప్పెట్లు.. తాళాలు తలంబ్రాలూ, మూడే ముళ్ళు.. ఏడే అడుగులు.. మొత్తం కలిసీ నూరేళ్ళు అంటూ ఎవర్వైనా తమ పెళ్లి అనగానే ఆ రోజున ఎంతో ఆనందంగా ఉంటూ.. అహ్లాదకరంగా గడపుతారు. అలానే ఇక్కడ ఈ పెళ్లిలోనూ వధూవరులు తమ పెళ్లి తర్వాత ఏర్పాటు చేసిన డీజేలో వారు కాలుకదపి డాన్స్ చేశారు. వధువు వచ్చి డాన్స్ చేస్తుండగా, వరుడు కూడా ఆ వెంటనే జతకలిసి.. హాయిగా, ఆనందంగా డాన్స్ చేస్తూ.. తన జీవితంలోకి అడుగుపెట్టిన భాగస్వామిని సంతోషపరుస్తున్నాడు. ఇంతలో ఎవరి దృష్టి పడిందో లేక.. ఎవరి కన్నుకుట్టిందో తెలియదు కానీ.. పెళ్ళి వేదిక కూలిపోయింది.
అన్నదమ్ముల పెళ్లిళ్లు ఒకేసారి జరుగ్గా.. ఆ కళ్యాణ వేదికలో అందరూ ఎంతో హుషారుగా పాల్గోని తమ సంతోషాలను పంచుకున్నారు. ఆ సమయంలో ఏకంగా పెళ్లి వేదికే కూలిపోవడంతో అప్పటివరకు విసిరిన ఆనందాలన్నీ క్షణాల్లో తారుమారై హాహాకారాలుగా మిన్నంటాయి. వేదికపైనున్న 14 మందికి గాయాలు కాగా అందులో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారని, ఒక మహిళకు మెడ సర్వైకల్ కూడా దెబ్బతిన్నదని వైద్యులు తెలిపారు. వేదిక పడిపోగానే అప్పటివరకు వేదికకు చేరువలోనే ఉన్న బంధువులు అందరూ ఒక్కసారిగా అక్కడి నుంచి భయపడుతూ పరుగులు తీశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వివరాల్లోకి వెళితే.. ఉత్తరాఖండ్ లోని శాంతిపురిలో కాలనీలో ఈనెల 12న ఓ వివాహ కార్యక్రమం జరిగింది. ఇదే సమయంలో అనుకోని సంఘటన జరిగింది. వివాహానంతరం నూతన దంపతులు బంధువులతో కలిసి చిందులేస్తున్నారు. డ్యాన్సులు చేస్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా బలమైన గాలులు వీచాయి. అక్కడున్నవారిపై పందిరి కూలి మీదపడింది. వెంటనే అక్కడున్నవారంతా భయంతో పరుగులు తీశారు. పలువురికి గాయాలైనట్లు తెలిసింది. ఇందుకు సంబంధించిన వీడియో, ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
(And get your daily news straight to your inbox)
Jun 30 | మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేల నాయకుడు ఏక్నాథ్ షిండే గురువారం రాత్రి 7.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయగా, డిప్యూటీ సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇవాళ రాత్రి... Read more
Jun 30 | రైలు టికెట్ కొనాలంటే ముందుగా కౌంటర్ వద్దకు వెళ్లేందుకు ప్రయాణీకులు ఎంతో సమయం క్యూల్లో నిలబడిఉండాలి. టికెట్లు ఇచ్చే వ్యక్తిపైనా తరచూ ఫిర్యాదులు వస్తుంటాయి. ఈ ప్రక్రియ సంక్లిష్టంగా మారడంతో పరిస్థితి మెరుగుపరిచేందుకు పలు... Read more
Jun 30 | గత కొన్నిరోజులుగా కొనసాగుతున్న మహారాష్ట్ర సంక్షోభానికి ఎట్టకేలకు తెరపడింది. కాంగ్రెస్, ఎన్సీపీలతో కలసి ప్రభుత్వ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న శివసేన రెబల్ వర్గ ఎమ్మెల్యేలు బీజేపితో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి రంగం సిద్దమైంది. అయితే... Read more
Jun 30 | బంగారం అంటే మహిళలకు చాలా ఇష్టం. దీని కోసమే ఎన్నో ఇళ్లలో మగవారు చీవాట్లు తింటారు. ఇంకొన్ని ఇళ్లలో ప్రశంసలను అందుకునే వాళ్లూ ఉన్నారు. మరి ఈ కుందనం నలుపు శరీర ఛాయ ఉన్నవారిపై... Read more
Jun 30 | గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న మహారాష్ట్ర సంక్షోభం శివసేన అధినేత, మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే రాజీనామాతో క్లైమాక్స్ కు చేరింది. మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్ ఎనమిది మంది మంత్రులపై విధించిన... Read more