MP Farmer Stumbles Upon 11.88-Carat Diamond లీజు భూమిలో అదృష్టం.. రైతుకు దొరికిన విలువైన వజ్రం..

Luck shines on farmer as he mines almost 12 carat diamond

Pratap Singh Yadav, diamond, farmer, Patti diamond mine,Krishna Kalyanpur, diamond officer Ravi Patel, Panna district, Madhya Pradesh

Fortune shone on a farmer in Madhya Pradesh as he stumbled upon a 11.88 carat good quality diamond in a small, leased mine in Panna, famous for diamond mines. The small-time farmer, Pratap Singh Yadav, who also works as a labourer, found this diamond from a mine in Patti area in the district, diamond officer Ravi Patel told reporters.

లీజు భూమిలో అదృష్టం.. రైతుకు లభించిన రూ.50లక్షల విలువైన వజ్రం..

Posted: 05/05/2022 11:39 AM IST
Luck shines on farmer as he mines almost 12 carat diamond

అదృష్టం ఎప్పుడు ఎవరి తలుపు తడుతుందో తెలియదు కానీ.. రాసిపెట్టి ఉంటే మాత్రం పాతాళంలో దాక్కున్నా.. వచ్చి తడుతుందని పెద్దలు అంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం, కర్నూలు జిల్లాలో వర్షాలు పడితే వ్రజాలు లభించడం రాత్రికి రాత్రే ఆయా వ్యక్తులు లక్షాధికారులు, కోటీశ్వరులు కావడం ఎలాగో అలాగే.. మధ్యప్రదేశ్ లోని పన్నా జిల్లా కూడా వజ్రాల జిల్లాగా అంతే పేరుగాంచింది. ఈ జిల్లాలో ఓ పేద రైతు లీజుకు తీసుకున్న భూమిలో అత్యంత నాణ్యమైన వజ్రం లభించింది. మూడు నెలల క్రితం భూమిని లీజుకు తీసుకుని జరుపుతున్న తవ్వకాల్లో ఆయనకు తన అదృష్టాన్ని మార్చే నాణ్యమైన వజ్రం లభించింది.

ఈ వజ్రానికి కనీసం రూ. 50 లక్షల ధర పలికే అవకాశం ఉందని రైతు కుటుంబసభ్యులు అంచనా వేస్తున్నారు. ఆయన మూడు నెలల శ్రమకు ఫలితం లభించిందని గ్రామస్థులు పేర్కోంటున్నారు. ఇక ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి ఎంటరైతే.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని పన్నా జిల్లాకు చెందిన ప్రతాప్ సింగ్ అనే రైతు.. తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఓ యజమాని నుంచి భూమిని లీజుకు తీసుకుని మూడు నెలలుగా వజ్రాల కోసం తవ్వుతున్నాడు. ఈ క్రమంలో తాజాగా అతడికి 11.88 కేరెట్ల బరువున్న వజ్రం దొరికింది. తన మూడు నెలల శ్రమ ఫలించిందని.. ఇక తన కష్టాలు దూరమయ్యాయని భావించిన రైతు సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.

అయితే ఇది నిజమైన వజ్రమేనా అన్న విషయమై స్థానిక వజ్రాల కార్యాలయం అధికారి రవి పటేల్ ను రైతు సంప్రదించగా.. ఇది ఎంతో నాణ్యమైన వజ్రమని ఆయన తెలిపారని రైతు చెప్పారు. మూడు నెలల కష్టానికి ప్రతిఫలం దక్కిందని చెప్పిన రైతు ప్రతాప్ సింగ్ యాదవ్.. తనకు దొరికిన వజ్రాన్ని డైమండ్ కార్యాలయంలో అప్పగించానని, తర్వలో జరగనున్న వేలంలో వచ్చిన డబ్బుతో ఏదైనా వ్యాపారం పెట్టుకుంటానని పేర్కొన్నాడు. అలాగే, తన పిల్లల చదువుల కోసం కొంత ఖర్చు చేస్తానని చెప్పుకొచ్చాడు. ఈ వజ్రాన్ని వేలం వేయడం ద్వారా వచ్చిన సొమ్ములో రాయల్టీ, పన్నులు మినహాయించుకుని మిగతా మొత్తాన్ని ప్రభుత్వం రైతుకు అందజేస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles