ISRO Eyes December 2024 For Its Venus Mission శుక్రగ్రహంపైకి భారత్ అంత‌రిక్ష నౌక‌: ఇస్రో చైర్మన్

Isro plans mission to venus eyes december 2024 launch window

Isro, India Venus Mission, ISRO News, Indian Space mission to Venus, ISRO Chairman S Somnath, Venus mission, Venus Earth similarity, climate change, S Somnath, Isro chairman, Isro missions, Mangalyaan, Chandrayaan

After sending missions to the Moon and Mars, ISRO is now readying a spacecraft to orbit Venus to study what lies below the surface of the solar system's hottest planet, and also unravel the mysteries under the Sulfuric Acid clouds enveloping it. Addressing a day-long meeting on Venusian science, Indian Space Research Organisation (ISRO) Chairman S Somnath said the Venus mission has been conceived, a project report made and "money identified".

శుక్రగ్రహంపైకి భారత్ అంత‌రిక్ష నౌక‌.. నివేదిక సిద్దం చేసిన ఇస్రో.!

Posted: 05/04/2022 06:43 PM IST
Isro plans mission to venus eyes december 2024 launch window

మిషన్ చంద్రయాన్ సహా మంగళయాన్ మిషన్లతో చంద్రగ్రహం, గురుగ్రహంపైకికి అంతరిక్ష నౌకలను పంపి ప్రయోగాలను అధ్యయనం చేసిన ఇస్రో.. ఇక తాజాగా శుక్ర గ్రహంపై దృష్టి సారించింది. మ‌న సౌర వ్య‌వ‌స్థ‌లో సూర్యుడికి అత్యంత ద‌గ్గ‌ర‌గా ఉండే రెండో గ్ర‌హం శుక్రుడు(వీన‌స్‌). ఈ గ్ర‌హ ఉప‌రిత‌లంపై స‌ల్ఫ్యూరిక్ యాసిడ్ మేఘాలు కమ్ముకుని ఉంటాయి. భార‌త అంత‌రిక్ష ప‌రిశోధ‌న సంస్థ‌(ఇస్రో) తాజాగా, ఈ గ్ర‌హంపై ప్ర‌యోగాల‌కు సిద్ధ‌మ‌వుతోంది. వీన‌స్ గ్ర‌హ క‌క్ష‌లో ప‌రిభ్ర‌మించగ‌ల అంత‌రిక్ష నౌక‌ను సిద్ధం చేస్తోంది. దాని ద్వారా ఈ గ్ర‌హం ఉప‌రిత‌లంపై ఏముంది? ఎలాంటి మూల‌కాలు ఇక్క‌డ నిక్షిప్త‌మై ఉన్నాయ‌నే విష‌యాల‌ను ప‌రిశోధించాలని అనుకుంటోంది.

ఆ గ్ర‌హం చుట్టూ క‌మ్ముకుని ఉన్నస‌ల్ఫ్యూరిక్ ఆమ్ల మేఘాల వెనుక దాగిన కార‌ణాల‌ను వెలికి తీయాల‌నుకుంటోంది. ఈ ప్ర‌యోగానికి సంబంధించిన ప్రాజెక్ట్ రిపోర్ట్ సిద్ద‌మైంద‌ని ఇస్రో చైర్మ‌న్ ఎస్ సోమ్‌నాథ్ వెల్ల‌డించారు. వీన‌స్ సైన్స్ కు సంబంధించిన స‌మావేశం అనంత‌రం సోమ్‌నాథ్ ఈ ప్ర‌క‌ట‌న చేశారు. వీన‌స్ మిష‌న్‌కు అవ‌స‌ర‌మైన నిధుల సేక‌ర‌ణ‌పై కూడా నిర్ణ‌యం జ‌రిగింద‌న్నారు. ఈ ప్ర‌యోగం విజ‌య‌వంతం చేయాల‌ని, ఎలాంటి లోటుపాట్ల‌కు అవకాశం క‌ల్పించ‌వ‌ద్ద‌ని ఇస్రో శాస్త్ర‌వేత్త‌ల‌ను ఆయ‌న కోరారు. వీన‌స్ మిష‌న్ ను ఇస్రో విజ‌య‌వంతంగా చేప‌ట్ట‌గ‌ల‌ద‌ని స్ప‌ష్టం చేశారు.

ఈ మిష‌న్ వీన‌స్‌ను 2024 సంవ‌త్స‌రం డిసెంబ‌ర్‌లో చేప‌ట్టే అవ‌కాశ‌ముంది. ఇందుకు సంబంధించి శుక్ర గ్ర‌హ‌ క‌క్ష‌లో చోటు చేసుకునే మార్పులు మొద‌లైన వాటిని శాస్త్ర‌వేత్త‌లు అధ్య‌య‌నం చేస్తున్నారు. 2025లో శుక్ర గ్ర‌హం, భూ గ్ర‌హం క‌క్ష‌లు స‌మీపానికి వ‌స్తాయ‌ని, ఆ స‌మ‌యంలో స్పేస్ క్రాఫ్ట్‌ను శుక్ర గ్ర‌హ క‌క్ష‌లో ప్ర‌వేశ‌పెట్టాల‌ని ఇస్రో భావిస్తోంది. అంత‌రిక్షంలో ఇలాంటి ప‌రిస్థితి మ‌ళ్లీ 2031 వ‌ర‌కు రాద‌ని తెలిపింది. అందువ‌ల్ల‌, ఈ ప్ర‌యోగాన్ని క‌చ్చితంగా విజ‌య‌వంతం చేయాల‌ని ఇస్రో ప‌ట్టుద‌ల‌తో ఉంది. ఈ ప్ర‌యోగంలో ప్ర‌ధానంగా శుక్ర గ్ర‌హ వాతావ‌ర‌ణాన్ని, ఉప‌రిత‌లాన్ని ప‌రిశీలిస్తారు. అగ్ని ప‌ర్వతాల ఆన‌వాళ్లు, లావా ప్ర‌వాహ మార్గాలను గుర్తిస్తారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles