Covid-19 R-value drops marginally in many states దిగివచ్చిన ‘ఆర్’ వ్యాల్యూ.. పండుగ వేళ అప్రమత్తత అవసరం

R value which indicates spread of covid 19 drops marginally in india

COVID-19 R-Value Delhi, COVID-19 Delhi, IIT Madras Analysis, Delhis R Value Covid, covid, r value, coronavirus spread, covid in india, reproduction value, Covid-19, India, spread of Coronavirus, coronavirus

Compared to one week ago, the reproduction value (R-value) of Covid-19 has dropped marginally in Delhi and many other states. The R-value gives an idea of the spread of Covid-19. It indicates the number of people an infected person can spread the disease to, and a pandemic is considered to have ended if this value goes below one.

దిగివచ్చిన ‘ఆర్’ వ్యాల్యూ.. అయినా 19 రాష్ట్రాల్లో సాధారణానికి మించే..

Posted: 05/03/2022 02:13 PM IST
R value which indicates spread of covid 19 drops marginally in india

ఇండియాలో కొవిడ్​ నాలుగో వేవ్​పై భయాందోళనలను నెలకొన్న తరుణంలో.. దేశ ప్రజలకు కాస్త ఉపశమనాన్ని కలిగించే వార్త ఒకటి బయటకొచ్చింది. వారం రోజుల క్రితంతో పోల్చుకుంటే.. ఢిల్లీ సహా అనేక ప్రాంతాల్లో కొవిడ్​ 'ఆర్'​ వాల్యూ కాస్త తగ్గింది. సహజంగా ఆర్​ వాల్యూతో.. వైరస్​ను ఓ వ్యక్తి ఎంతమందికి వ్యాపింపజేస్తున్నడో లెక్కగట్టవచ్చు. ఆర్​ వాల్యూ 1 కన్నా తక్కువకు పడిపోతే.. మహమ్మారి దశ ముగిసినట్టు పరిగణిస్తారు. కాగా మే 1 నాటికి.. 19 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఆర్​ వాల్యు 1 కన్నా ఎక్కువగా ఉంది. దేశంలో ఆర్​ వాల్యూ ప్రస్తుతం 1.13గా నమోదైంది.

దేశవ్యాప్తంగా ఇవాళ రంజాన్ ఈద్​, అక్షయ తృతీయ పండగలు జరగనున్న నేపథ్యంలో మళ్లీ కరోనా వ్యాప్తికి ఇవి ఆస్కారం కల్పిస్తాయా.? అన్న భయాందోళనలు నెలకోన్నాయి. అయితే కొవిడ్​ ఆంక్షలతో రెండేళ్లుగా వెలవెలబోయిన మార్కెట్లు.. ఇప్పుడిప్పుడే కిటకిటలాడనున్నాయి. రంజాన్ పండగను ముస్లింలు​ జరుపుకుంటున్న తరుణంలో ఇదే రోజున అక్షయతృతీయ కూడా రావడంతో అటు ముస్లింలు, ఇటు హిందువులతో ఉదయం నుంచే దేశవ్యాప్తంగా ఉన్న అనేక మార్కెట్లు కిక్కిరిసిపోతున్నాయి. మొత్తంగా కరోనాకు ముందు పరిస్థితులు నెలకొన్నాయి.

అక్షయ తృతీయ రోజున పసిడిని కొనుగోలు చేస్తే తమ ఇళ్లలో ఆ ఏడాడంతా స్వర్ణమయంగా మారుతుందని హిందువుల విశ్వాసం. దీంతో ఉదయం మార్కెట్లు తెరవగానే బంగారం దుకాణాలకు కస్టమర్ల రాక ప్రారంభమైంది. కరోనా నేపథ్యంలో గత రెండేళ్లుగా చప్పగా సాగిన వ్యాపారం ఈసారి జోరందుకుంటుందని జ్యువెలరీ దుకాణాదారులు ఆశాభవంతో వున్నారు. ఇక కస్టమర్ల కోసం ఇప్పటికే పలు రకాల ఆపర్లు ప్రకటించారు. రద్దీ నేపథ్యంలో కస్టమర్లకు అసౌకర్యం కలగకుండా, వేసవిని లెక్కచేయక వచ్చే కస్టమర్ల కోసం శీతల పానీయాలను కూడా సిద్దం చేశారు.

రెండు పండగలు ఒకేసారి రావడం, ఆంక్షలు కూడా లేకపోవడం.. దీనికి తోడు ఇటీవల ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతుండంతో వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు కరోనా ఆర్ వ్యాల్యూ కూడా పెరగుతున్న నేపథ్యంలో ఇది నాలుగో దశకు దారితీస్తుందన్న వార్తలు కూడా వచ్చాయి. అయితే గత పది రోజుల క్రితం దేశంలో నమోదైన కరోనా ఆర్ వ్యాల్యూ తాజాగా కాసింత తగ్గడంతో వైద్యనిపుణులు ఊపిరిపీల్చుకుంటున్నారు. అయినప్పటికీ ప్రజలు మాత్రం తగు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. పండుగల వేళ కేసులు పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ప్రజలు భౌతిక దూరాన్ని పాటించాలని, మాస్కులను ధరించాలని సూచిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles