Raid unearths Rs 10 crore cash from 35 sq ft office in Mumbai ముంబై వ్యాపార సంస్థలో దాడులు.. నోరేళ్లబెట్టిన జీఎస్టీ అధికారులు.!

Raid unearths rs 10 crore cash from 35 sq ft office in mumbai

Chamunda Bullion, kalbadevi, GST officials raids, income-tax act, mumbai police, suspicious companies, state GST officials, bullion trader's 35 sq ft office, Rs 9.8 crore unaccounted cash, mumbai police, tax credit claims, hawala, 19 kg silver bricks worth Rs 13 lakh, secret compartments, Maharashtra, Crime

The state Goods and Services Tax (GST) and income-tax (I-T) investigation wing have seized nearly Rs 9.8 crore unaccounted cash and 19 kg silver bricks worth Rs 13 lakh stashed in secret compartments on the floor and a wall of a bullion trader's 35 sq ft office at Kalbadevi. Officials suspect Chamunda Bullion's involvement in fraudulent input tax credit claims and hawala.

ముంబై వ్యాపార సంస్థలో దాడులు.. నోరేళ్లబెట్టిన జీఎస్టీ అధికారులు.!

Posted: 04/27/2022 03:40 PM IST
Raid unearths rs 10 crore cash from 35 sq ft office in mumbai

ముంబైలోని ఓ వ్యాపార సంస్థపై దాడులు చేసిన జీఎస్టీ అధికారులు నోరెళ్లబెట్టారు. ఆ సంస్థ కార్యాలయంలో ఏమీ లభించలేదని వెనక్కు తిరుగుతున్న క్రమంలో కార్యాలయంలోని ఓ మూల టైల్ ఏర్పాటులో కొంత తిరకాసుగా ఉండటంతో అనుమానించిన అధికారులు దానిని తొలగించగా, నగదు నోట్ట కట్టలతో పాటు వెంటి ఇటుకలు బయటపడ్డాయి. తీస్తున్న కోద్దీ బయటపడిన నోట్ల కట్టలను చూసిన అధికారులు నోరెళ్లబెట్టారు. 35 చదరపు అడుగుల కార్యాలయంలో ఏకంగా రూ. పది కోట్ల మేర అక్రమంగా డబ్బు కట్టలను భద్రపర్చడంపై విస్మయం వ్యక్తం చేశారు.

సంస్థ అనుమానిత లావాదేవీలను గుర్తించిన అధికారులు తొలుత కార్యాలయంలో సోదాలు చేశారు. అక్కడేమీ లభించకపోవడంతో గోడలను, నేలను తవ్వి చూడగా ఆశ్చర్యపోయే రీతిలో దాదాపు రూ. 10 కోట్ల విలువైన నగదు, వెండి ఇటుకలు బయటపడ్డాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నగరంలోని కల్బాదేవి ప్రాంతంలో చాముండా అనే వ్యాపారికి చెందిన కార్యాలయం ఉంది. ఇటీవల ఈ కంపెనీ టర్నోవరు అకస్మాత్తుగా పెరగడాన్ని మహారాష్ట్ర జీఎస్టీ అధికారులు గుర్తించారు. గత మూడేళ్లలో చాముండా బులియన్ టర్నోవరు రూ. 23 లక్షల నుంచి ఏకంగా రూ. 1,764 కోట్లకు పైగా పెరగడం అధికారుల్లో అనుమానాలు రేకెత్తించింది.

మూడేళ్లలో లక్షల నుంచి కోట్లలోకి టర్నోవర్ వెళ్లడమే కష్టం అలాంటిది ఏకంగా వేల కోట్ల రూపాయల టర్నోవర్ లోకి వెళ్లడంతో జీఎస్టీ అధికారులు దృష్టిపడింది. దీంతో కల్బాదేవి సహా మూడు ప్రాంతాల్లో ఆసంస్థకు ఉన్న కార్యాలయాలపై జీఎస్టీ అధికారులు దాడులు చేశారు. కల్బాదేవిలో ఉన్న కార్యాలయంలో నిర్వహించిన సోదాల్లో ఏమీ లభించకపోవడంతో వెనుదిరిగేందుకు కూడా అధికారులు సిద్దమయ్యారు. అయితే, కేవలం 35 చదరపు అడుగుల ఇరుకైన గదిలో ఉన్న కార్యాలయాన్ని అధికారులు పరిశీలించగా, ఓ మూలన నేలపై ఉన్న టైల్స్‌ అమరికలో ఓ మూల కొద్దిగా తేడా కనిపించడంతో అధికారులు అనుమానించారు. దీంతో అక్కడికెళ్లి ఒక టైల్‌ను తొలగించి చూసి ఆశ్చర్యపోయారు.

నగదు కుక్కిన గోనె సంచులు కనిపించడంతో వెలికి తీశారు. తీస్తున్న కొద్దీ బయటపడుతుండడంతో అధికారులు నోరెళ్లబెట్టారు. ఈ సంచుల సంగతేంటని యజమాని, అతడి కుటుంబ సభ్యులను ప్రశ్నించగా వాటి గురించి తమకేమీ తెలియదని చెప్పారు. దీంతో గదిని తమ అధీనంలోకి తీసుకున్న అధికారులు ఆదాయపు పన్ను శాఖ అధికారులకు సమాచారం అందించారు. వారొచ్చి గదిని పరిశీలించి రహస్య అరలను గుర్తించారు. అనంతరం వాటిని తెరవగా రూ.9.8 కోట్లున్న నగదు నింపిన గోనె సంచులు, రూ. 13 లక్షల విలువైన 19 కేజీల వెండి ఇటుకలు లభ్యమయ్యాయి. కంపెనీపై కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles