Pimps use OTP cover to provide 'safe sex', busted పరాయిదేశ యువతుల హైటెక్ సెక్స్ రాకెట్.. స్పెషల్ కోడ్ ఎంట్రీ..!

Hyderabad police busts high tech sex racket run by uganda woman two held

Hyderabad police, Sex racket, Uganda citizen, high-tech sex racket, Crime, Hyderabad, Hyderabad sex racket, uganda women sex racket, uganda women technology in sex racket, uganda women hyderabad sex racket, uganda woman OTP sex racket, Hyderabad sex racket, Uganda woman, brothel, prostitution, Narsingi, OTP, Sex racket, Hyderabad Latest News, Telangana, Crime

A sex racket that sent customers secret codes via OTP was busted by the Narsingi police. Police stated that they had never seen such a “high-tech” racket in the city previously. Police officials came across the high-profile case 10 days ago, and informed that the perpetrators were Ugandan nationals. According to a report, the accused only allowed customers to meet sex workers after they shared a secret code.

పరాయిదేశ యువతుల హైటెక్ సెక్స్ రాకెట్.. స్పెషల్ కోడ్ ఎంట్రీ..!

Posted: 04/21/2022 04:08 PM IST
Hyderabad police busts high tech sex racket run by uganda woman two held

హైదరాబాద్ మినీ భారత్ గా కూడా ఖ్యాతి గడించింది. ఇక అంతర్జాతీయ నగరంగా కూడా ప్రసిద్దికెక్కింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వమే ప్రమోట్ చేస్తున్న క్రమంలో.. నిజంగానే అంతర్జాతీయ నేర కార్యకలాపాలకు కూడా ఇది అడ్డాగా మారింది. అసాంఘికశక్తులు హైదరాబాద్ కేంద్రంగా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాయి. అందివచ్చిన నూతన సాంకేతికతను వారు అసాంఘిక కార్యకలాపాలకు వినియోగిస్తూ.. పోలీసులకు చిక్కకుండా.. అడ్డు అదుపులేకుండా నిరాటంకంగా తమ దందాలను కోనసాగిస్తున్నారు.

సాంకేతికతో పాటు సరికొత్త విధానాలను అవలంభిస్తూ అంతర్జాతీయ ముఠాలు తమ అక్రమాలను కొనసాగిస్తున్నాయి. తాజాగా దేశంకాని దేశంలో వీసాలపై వచ్చిన పరాయిదేశ యువతులు కూడా అక్రమ వ్యాపారాలకు పాల్పడుతున్నాయి. హైటెక్ సెక్స్ రాకెట్ వెలుగులోకి వచ్చింది. ఈ వ్యభిచార దందాను ఉగాండా దేశీయులు నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. సెక్స్ రాకెట్ కోసం ప్రత్యేక యాప్ ను రూపొందించారు. స్పెషల్ కోడ్ తో బుకింగ్స్ చేపడుతన్నట్లు తేల్చారు. ఇందులో ఉగాండా దేశీయులతో పాటు పలువురు ప్రముఖలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ వ్యభిచార దందా బయటికి రాకుండా నిర్వాహకులు పెద్ద వ్యవస్థనే రూపొందించారు. బ్యాంక్‌ యాప్‌లో సెక్యూరిటీ మాదిరిగా ఓ ప్రత్యేక యాప్ ను రూపొందించారు. దీని ఆధారంగా ప్రత్యేక కోడ్ లు పంపిస్తారు. ఈ కోడ్ లను ఫ్లాట్ కు వచ్చినప్పుడు ఎంట్రీ చేస్తేనే విటులను కలిసే అవకాశం ఉండేలా తయారు చేశారు. గతంలో వెలుగులోకి వచ్చిన సెక్స్ రాకెట్లతో పోల్చితే.. ఇది కొత్త తరహా దందాగా పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు ఈస్థాయిలో హైటెక్ సెక్స్ బయటికి రావటం నగర పోలీసులకు సవాల్ గా మారింది.

మరోవైపు గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ఇంటిపై జీడిమెట్ల పోలీసులు దాడి చేశారు. సీఐ బాలరాజు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా నల్లజెల్ల మండలం ఆగ్రహారం గ్రామానికి చెందిన పత్తి వీరరాజు(33) జీడిమెట్ల టీఎస్‌ఐఐసీ కాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. విశ్వసనీయ సమాచారం అందుకున్న పోలీసులు ఆ ఇంటిపై దాడి చేసి నిర్వాహకుడు వీరరాజు, విటుడు చీకోటి శ్రీకాంత్‌(28), యువతి(24)లను అదుపులోకి తీసుకున్నారు. యువతిని రెస్క్యూ హోంకు తరలించి నిర్వాహకుడు, విటుడిపై కేసు నమోదు చేశారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hyderabad sex racket  Uganda woman  brothel  prostitution  Narsingi  OTP  Sex racket  Hyderabad  Telangana  Crime  

Other Articles