TTD Board Cancels VIP Break Darshan up to Sunday భక్తుల రద్దీ దృష్ట్యా.. శ్రీవారి విఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

Ttd board cancels vip break darshan for five days

Tirumala Tirupati Devatshanam, TTD, VIP Break danshan, Tirumala, Tirupati, Lord Venkateshwara Darshan, Tirumala Balaji, Andhra Pradesh, Devotional

Owing to the heavy pilgrim rush for the Srivari darshan the Tirumala Tirupati Devatshanam (TTD) board has taken the decision to cancel the VIP break darshan for the coming five days until Sunday. The TTD has decided to allow devotees to the hill shrine directly as there was a huge rush at token counters in Tirupati. The pilgrims will be directly allowed into the compartments of Tirumala for darshan and the situation has been normalized now, said TTD PRO Ravi Kumar.

భక్తుల రద్దీ: ఆదివారం వరకు తిరుమల శ్రీవారి విఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

Posted: 04/12/2022 01:38 PM IST
Ttd board cancels vip break darshan for five days

కరోనా మహమ్మారి కారణంగా గత రెండేళ్లుగా తిరుమలతిరుపతి శ్రీవారి దర్శనం చేసుకునేందుకు భక్తులు ఎంతగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. కరోనా ఆంక్షల నేపథ్యంలో కేవలం ఆన్ లైన్ ద్వారానే టికెట్లు పోందిన భక్తులకు మాత్రమే తిరుమలకు చేరుకునేందుకు అనుమతించారు టీటీడీ అధికారులు. ఈ క్రమంలో తమ కొంగుబంగారమైన స్వామిని దర్శించుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో.. భక్తులు తిరుమలకు వేలాదిగా చేరుకుని తమ మొక్కలు తీర్చుకుంటున్నారు.ఈ క్రమంలో తిరుమల శ్రీవారి సర్వదర్శనం టిక్కెట్లకు భారీ డిమాండ్ నెలకొంది.

దీంతో టికెట్ల కోసం భక్తుల మధ్య తోపులాట చోటుచేసుకోగా కొందరు స్పృహ తప్పిపడిపోయారు. సర్వదర్శనం టికెట్ల కోసం ఏర్పాటు చేసిన క్యూ లైన్ కూడా స్వల్పంగా దెబ్బతింది. సర్వదర్శనం టికెట్ల కోసం గంటల తరబడి క్యూ లైన్లలో వేచి ఉన్నారు. తిరుపతిలోని మూడు చోట్ల తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు సర్వదర్శనం టికెట్లను జారీ చేస్తుంది. టీటీడీ రెండో సత్రం, భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం వద్ద టోకెన్లు జారీ చేస్తున్నారు. ఈ మూడు కౌంటర్ల వద్దకు భారీ సంఖ్యలో భక్తులు టోకెన్ల కోసం బారులు తీరారు. భక్తజనం పెద్దసంఖ్యలో కౌంటర్ల వద్దకు చేరుకుని ఎదురు చూస్తున్నారు.

వేకువ జాము నుంచే భక్తులు క్యూలైన్లలో నిలబటంతో ఉదయానికి భక్తుల బారులు కిలోమీటర్ల దూరం చేరుకున్నాయి. గంటల తరబడి టికెట్ల కోసం చూసి విసిగిపోయిన భక్తులు టికెట్ కౌంటర్ వద్దకు భక్తులు తోసుకురావడంతో తోపులాట చోటు చేసుకొంది. ఇక క్యూలైన్ల వద్ద భక్తులు నిలబడేందుకు సరైన ఏర్పాట్లను టీటీడీ అధికారులు చేయని కారణంగా ఈ పరిస్థితి నెలకొందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజులుగా సర్వదర్శనం టికెట్ల జారీని నిలిపివేశారు. దీంతో ఇవాళ్టి నుండి సర్వదర్శనం టికెట్లను జారీ చేయడంతో భక్తులు పెద్ద సంఖ్యలో టికెట్ల కోసం పోటీ పడ్డారు.

అయితే భక్తుల మధ్య తోపులాటను కంట్రోల్ చేయడంలో టీటీడీ విజిలెన్స్ సిబ్బంది చేతులెత్తేశారు. దీంతో తిరుపతి పోలీసులు రంగంలోకి దిగారు. క్యూ లైన్లలో భక్తుల మధ్య తోపులాటతో పలువురు భక్తులు స్పృహ తప్పి పడిపోయారు. మరోవైపు భక్తుల రద్దీ పెరగడంతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. కేవలం భక్తుల రద్దీ పెరగడంతో పాలక మండలి నిర్ణయం తీసుకుంది. విఐపి బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది. రేపటి నుంచి ఆదివారం వరకు విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తూ కీలక ప్రకటన చేసింది టీటీడీ పాలకమండలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles