Rs.2000 crore worth TS land went private: Revanth Reddy సీఎం కేసీఆర్ కు పది ప్రశ్నలతో రేవంత్ లేఖ.!

Why was an undertaking given to centre on parboiled rice asks revanth

Revanth Reddy, Telangana Pradesh Congress Committee (TPCC), Telangana Rashtra Samithi (TRS), Chief Minister K. Chandrasekhar Rao, political drama, New Delhi dharna, CM undertaking to Centre, parboiled rice, Paddy Procurement, Telangana Farmers, Telangana, Politics

Telangana Pradesh Congress Committee (TPCC) president A. Revanth Reddy has alleged that Telangana Rashtra Samithi (TRS) president and Chief Minister K. Chandrasekhar Rao has been playing political drama in the name of dharna at New Delhi and wondered how the Chief Minister had given an undertaking to the Centre that State would not supply parboiled rice.

రైతులకు అన్యాయం చేసి.. హస్తినలో డ్రామాలు: సీఎం కేసీఆర్ పై రేవంత్ ఫైర్

Posted: 04/11/2022 09:23 PM IST
Why was an undertaking given to centre on parboiled rice asks revanth

తెలంగాణ రైతుల ప్రయోజనాలకు ఉరితాళ్లు బిగిస్తూ కేంద్రానికి లేఖ రాసిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు.. తెలంగాణ రైతుల వద్ద ముఖం చెల్లక.. దేశరాజధాని న్యూఢిల్లీలో ధర్నా పేరుతో రాజకీయ డ్రామా ఆడుతున్నారని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. యాసంగి గింజలపై ముఖ్యమంత్రి కేంద్రానికి లేఖ రాసిచ్చే అధికారం ఎవరిచ్చారని ఆయన నిలదీశారు. బాయిల్డ్ రైస్ ను రాష్ట్రం సరఫరా చేయదని కేంద్రానికి హామీ ఇచ్చిందీ ఆయనే.. ఇప్పుడు ధర్నాల పేరుతో డ్రామాలు అడుతోంది ఆయనేనని రేవంత్ అరోపించారు.

ధర్నాలు, నిరసనలు అంటూ ఇక్కడ ముఖం చెల్లక హస్తినకు వెళ్లి నాటకాలు ఆడితే రైతులు విశ్వసిస్తారని భావిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. కేంద్ర, రాష్ట్రాల్లోని రెండు బీజేపి, టీఆర్ఎస్ పార్టీల మోసాలను రైతులు ముందునుంచే గ్రహించారని అన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పది ప్రశ్నలతో కూడిన లేఖ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి రాశారు. తెలంగాణ నుంచి బాయిల్డ్‌ రైస్‌ ఇక ఇవ్వబోమని 2021 అక్టోబరు 4న కేంద్రానికి లేఖ రాసింది వాస్తవం కాదా..? అని నిలదీశారు. ఓ వైపు రైతుల జీవితాలను బలిపీఠంపై పెట్టిన మీరే మరోవైపు ధర్నాలతో డ్రామాలకు తెరలేపుతారా? అని ప్రశ్నించారు.

వరి సేకరణ వల్ల రాష్ట్రానికి రూ.7,500 కోట్ల నష్టం వాటిల్లిందని, ఇకపై ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయదని 2021 ఫిబ్రవరిలో ముఖ్యమంత్రి ప్రకటన చేశారా లేదా.? అని ఆయన ప్రశ్నించారు. బియ్యం కొనుగోలు చేయవద్దన ఆలోచన అప్పుడే పురుడు పోసుకుందన్న సందేహాన్ని రేవంత్ వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 25, మార్చి 8న భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ)తో జరిగిన క్యారచరణ ప్రణాళిక వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు.. ఈ సారి ధాన్యం సరఫరా చేయడం లేదని కేంద్రానికి తెలియజేశారా లేదా.? అని ఆయన సూటిగా ప్రశ్నించారు.   

మార్చిలో వరి సేకరణకు ఏర్పాట్లు ప్రారంభించాలి. ప్రభుత్వం ఈ సమస్యపై సీరియస్‌గా ఉండి ఉంటే, కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, రైస్‌మిల్లర్లకు కోటా కేటాయింపు, రవాణా టెండర్ల ఖరారు ప్రక్రియ ఎందుకు పూర్తి చేయలేదు? వరి రైతులు దళారులకు అమ్ముకుని నష్టపోతున్నారనేది నిజం కాదా? అని రేవంత్ ప్రశ్నించారు. తెలంగాణ వికేంద్రీకృత సేకరణ వ్యవస్థ (డిపిఎస్)లో భాగమని, కొనుగోలు కేంద్రాలను తెరవడం రాష్ట్ర బాధ్యత అని తెలియజేసిన టిపిసిసి అధ్యక్షుడు, రాష్ట్రంలో పాలన బాధ్యతను నెరవేర్చకుండా న్యూఢిల్లీలో ధర్నా చేయడం ఏమిటని ప్రశ్నించారు. దళారుల చేతుల్లో రైతులు రూ. 3,000 కోట్లు నష్టపోయేలా కాకుండా రూ. 1,500 కోట్ల నష్టాన్ని భరించడం ద్వారా రాష్ట్ర సేకరణ సమస్యను పరిష్కరించవచ్చని రేవంత్ రెడ్డి కోరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles