Shooting at Tanglewood Middle School in Greenville గ్రీన్ విల్లే పాఠశాలలో కాల్పలు.. ఏపీ ఉపాధ్యాయుడి చర్యకు అభినందనలు

Student in custody after fatal shooting at tanglewood middle school in greenville sc

shooting in school. Shooting in Tanglewood school, shooting in Greeenville, Shooting in South Carolina School, 12-year-old, Greenville, Greenville County, Jamari Cortez Bonaparte Jackson, South Carolina, Tanglewood Middle School, arrested, boys, sheriff, student, suspect, Gun culture, Tanglewood school, Greenville, shooting, middle school, South Carolina, America, United States

Koneru Sridhar has received appreciation for saving the lives of 20 students at Tanglewood Middle School in South Carolina in the USA. On Thursday, a 12-year-old opened fire at fellow students killing one instantly. Sridhar, hailing from Vijayawada, and working as a Maths teacher in the same school, took 20 students to the safety.

గ్రీన్ విల్లే పాఠశాలలో కాల్పలు.. ఏపీ ఉపాధ్యాయుడి చర్యకు అభినందనలు

Posted: 04/01/2022 12:33 PM IST
Student in custody after fatal shooting at tanglewood middle school in greenville sc

అగ్రరాజ్యం మరోమారు తుపాకీ సంస్కృతి అమాయక విద్యార్థిని బలితీసుకుంది. తన తోటి విద్యార్థుల పాలిట సహచర విద్యార్థికి కలిగిన మనస్పర్థలతో ఆయనను కటకటాలపాలు చేసింది. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యతను తమ తలపై వేసుకున్న ఉపాద్యాయులు.. ఏ విద్యార్థి ఏ క్షణంలో తుపాకులు తీసుకువస్తారో.. ఎవరిపై కోపంతో ఎవరిని పేల్చేస్తారో తెలియని భయాంధోళన పరిస్థితులు అలుముకున్నాయి. ఇంతటి అందోళనకర పరిస్థితుల్లో అక్కడి ఉపాద్యాయులు విద్యార్థులను ఎలా సన్మార్గంలో నడిపిస్తారో.. ఎలా విద్యాబుద్దులు నేర్పిస్తారో కూడా అర్థకాని ప్రశ్న.

ఇక అమెరికాలో ఎవరికి కోపం వచ్చినా.. వెంటనే తమ ఇంట్లో వున్న తుపాకులను తీసుకువచ్చి.. వారిపై ప్రతీకారంగా తుటాలను వదలడం సర్వసాధారణంగా మారిపోయింది. తాజాగా సౌత్ కరోలినా మిడిల్ స్కూల్‌లో ఓ విద్యార్థి తన సహచర విద్యార్థులపై జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన విద్యార్థి.. అసుపత్రిలో చికిత్స పోందుతూ ఇవాళ మరణించారు. అమెరికాలోని దక్షిణ కరోలినా రాష్ట్రంలోని గ్రీన్ విల్లే పట్టణంలోని టాంజిల్ వుడ్ పాఠశాళలో గురువాత ఈ ఘటన జరిగింది. కాల్పల్లో గాయపడిన విద్యార్థిని పోలీసులు చికిత్స నిమిత్తం అసుపత్రికి తరలించగా.. చికిత్స పోందుతూ ఇవాళ తుదిశ్వాస విడిచాడని పోలీసులు తెలిపారు.

కాల్పులు జరిగిన కొద్దిసేపటికే టాంగిల్‌వుడ్ మిడిల్ స్కూల్ సమీపంలో నిందితుడైన బాలుడి(12)ని అదుపులోకి తీసుకున్నట్లు గ్రీన్‌విల్లే కౌంటీ షెరీఫ్ లెఫ్టినెంట్ ర్యాన్ ఫ్లడ్ ఒక ప్రకటనలో తెలిపారు. కాల్పులు జరిపింది సహ విద్యార్థే అని తేలింది. నిందితుడిని కొలంబియాలోని జువైనల్ ప్రిజన్‌కు తరలించారు. కాల్పుల సమయంలో స్కూల్‌ వద్ద నుంచి ఒక పోలీసు అధికారి మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో ఎమర్జెన్సీ బ్యాకప్‌ను అభ్యర్థించారు. ఈ నేపథ్యంలో 100 కంటే ఎక్కువ మంది పోలీసులు పాఠశాలకు చేరుకున్నారు. పాఠశాలలోని విద్యార్థులను సమీపంలోని బ్రూక్‌వుడ్ చర్చికి తీసుకువెళుతున్నారని, అక్కడ తల్లిదండ్రులు వారిని తీసుకెళ్లవచ్చని వాలర్ చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా విజయవాడలోని ప్రసాదంపాడుకు చెందిన ఓ ఉపాధ్యాయుడు ఏకంగా 20 మంది విద్యార్థుల ప్రాణాలను కాపాటడంతో అతను చూపిన సాహపానికి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, సహచర విద్యార్థులతో పాటు స్థానికులు ఆయనను అభినందించారు. గ్రీన్ విల్లే పట్టణంలోని టాంజిల్ వుడ్ పాఠశాలలో విజయవాడంకు చెందిన కోనేరు శ్రీధర్.. మాథమ్యాటిక్స్ టీచర్ గా విధులు నిర్వహిస్తున్నారు. కాల్పులు జరిగిన వెంటనే తన క్లాసులో ఉన్న 20మందిని బెంచిల కింద కూర్చోపెట్టి తలుపులు మూసివేశారు. పోలీసులు చేరుకుని శ్రీధర్ చర్యను అభినందించారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gun culture  Tanglewood school  Greenville  shooting  middle school  South Carolina  America  United States  

Other Articles