Delhi thief flies to Hyderabad to snatch chains వీడు మామూలోడు కాదు.. విమానంలో వచ్చి చైన్ స్నాచింగ్..

Delhi thief flies to hyderabad to snatch gold chains nabbed at airport with stolen mangalsutra

delhi airport, hyderabad airport, Delhi thief flies to Hyderabad to snatch gold chains, gold chain snatcher, mangalsutra robbery, Hemant Kumar Gupta, Hemant Gupta, chain-snatcher, Delhi to Hyderabad, snatching gold chains, Gold Ornaments, cyberabad police, Telangana, Crime

A 30-year-old gold chain snatcher, Hemanth Kumar Gupta, whose modus operandi involved flying down to Hyderabad from New Delhi, snatch chains from women and then catch a flight back to the national capital was arrested at the Hyderabad airport. Police nabbed the culprit when he was getting ready to board a SpiceJet flight back to Delhi and recovered a stolen mangalsutra worth thousands of rupees from him.

వీడు మామూలోడు కాదు.. విమానంలో వచ్చి చైన్ స్నాచింగ్..

Posted: 03/31/2022 01:24 PM IST
Delhi thief flies to hyderabad to snatch gold chains nabbed at airport with stolen mangalsutra

ఎవరికైనా విమానం చూస్తే ఎక్కాలని, అందులో గగన విహారం చేయాలని భావిస్తుంటారు. అయితే అందుకోసం శ్రద్దగా చదువుకుని మంచి ఉద్యోగం చేయడం ద్వారానో లేక మంచి వ్యాపారవేత్తగా రాణించడం ద్వారానో తమ కలను సాకారం చేసుకుంటారు. కానీ ఇక్కడ మనకు ఎదురైన వ్యక్తి మాత్రం మరో టైపు. తనపై ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా.. ఏకంగా తన కలలను సాకారం చేసుకుంటూన్నాడు. అదేంటి ఎవరికీ అనుమానం రాకుండా అంటున్నారు. ఏమైనా సంఘవిద్రోహశక్తులతో జతకట్టాడా.? అన్న అనుమానం వస్తోంది కదూ.  నిజమేనండీ.. ఇతని పేరు హేమంత్ కుమార్ గుప్తా. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఇతని ప్రస్తుతం ఢిల్లీలో నివాసముంటున్నాడు.

విమానంలో హైదరాబాద్‌కు వచ్చి చైన్‌స్నాచింగ్‌ చేసి తిరిగి విమానంలోనే ఢిల్లీ వెళ్లడం అతడి తీరు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో కమల (55) పుస్తెలతాడును లాక్కొని వెళ్లాడు. పుస్తెలతాడు లాగుతున్న సమయంలో కిందపడ్డ ఆమె తలకు బలమైన గాలయ్యాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిని కదలికలను పోలీసులు సీసీ కెమెరాల ద్వారా పరిశీలించారు. ఎయిర్‌పోర్టువైపు వచ్చినట్లు తెలియడంతో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమనాశ్రయంలోని పోలీసు ఔట్‌పోస్టులోని కానిస్టేబుళ్లు శ్రీశైలం, భాను, లింగం విమానాశ్రయంలోని భద్రతాధికారులతో కలిసి అన్ని విమానాల్లో క్షుణంగా తనిఖీలు చేశారు.

బుధవారం తెల్లవారు జామున 5.45 గంటలకు ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న స్పైస్‌జెట్‌ విమానంలో అతడిని పట్టుకున్నారు. అతడి వద్ద ఉన్న నాలుగు తులాల బంగారు పుస్తెలతాడును స్వాధీనం చేసుకున్నారు. గతంలో ఇలాంటి తరహాలోనే ఆరు స్నాచింగ్‌లు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. నిందితుడిని రాచకొండ పోలీసులకు అప్పగించారు. చాకచక్యంగా వ్యవహరించిన ఆర్‌జీఐఏ ఔట్‌పోస్టు కానిస్టేబుళ్లను శంషాబాద్‌ డీసీపీ జగదీశ్వర్‌రెడ్డి అభినందించారు. ఇదిలా ఉండగా ఓఎల్‌ఎక్స్‌లోచూసి ఎల్‌బీనగర్‌కు చెందిన వ్యక్తి నుంచి ద్విచక్రవాహనం కొనుగోలు చేసి అదే వాహనాన్ని వాడి స్నాచింగ్‌కు పాల్పడ్డాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles