Man Slips Trying To Board Train, alert Cop Saves Him కదులుతున్న రైలు దిగుతూ.. ప్రాణాలపైకి... అంతలో..

Watch rpf constable saves man from falling into platform gap at mumbai s wadala station

Man slips deboarding trian in maharashtra, Man slips deboarding trian at wadala station, alert RPF constable save man in maharashtra, alert rpf constable saves man at wadala railway station, man slips deboarding a local train at wadala railway station, RPF constable rescues man falling on tracks, Rpf cop rescues man from falling on tracks, RPF constable Netrapal Singh, life of a passenger, RPF cop netrapal singh saves life of a passenger, Netrapal singh, RPF Constable, passenger, CCTV footage, Local Train, wadala railway station, RPF India, Twitter, Life Saving, Maharashtra

Timely intervention by an alert constable of the Railway Protection Force (RPF) saved the life of a passenger who slipped and fell while boarding a moving local train at Mumbai's Wadala railway station. The Central Railway shared the clip on its official Twitter handle and urged people not to board or deboard a moving train.

ITEMVIDEOS: కదులుతున్న రైలు దిగుతూ.. ప్రాణాలపైకి... అంతలో..

Posted: 03/14/2022 02:51 PM IST
Watch rpf constable saves man from falling into platform gap at mumbai s wadala station

రైల్వే భద్రతా సిబ్బంది రోజురోజుకూ ప్రాణప్రదాలుగా మారుతున్నారు. అదేంటి వీరు వైద్యవృత్తిని చేపట్టలేదుకదా.. అయినా వీరిని ప్రాణప్రదాతలుగా అభివర్ణిస్తున్నారేమిటీ అన్న సందేహాం చాలా మందిలో కలుగుక మానదు. అయితే ఈ మధ్యకాలంలో రైల్వే స్టేషన్లలో సిసిటీవీ కెమెరాలను పోందుపర్చిన నాటి నుంచి అత్యంత ప్రమాదకరమైన దృశ్యాలను మనం చూస్తున్నాం. దీనికి తోడు ఈ వీడియోలను సాక్ష్యాత్తు రైల్వే విభాగమే సామాజిక మాద్యమాల్లో పొస్టు చేయడంతో అవికాస్తా వైరల్ గా మారుతున్నాయి. అంతలా హల్ చల్ చేయడానికి కారణం మాత్రం ఈ భీతిగొలిపే ప్రమాద సన్నివేశాలే.

అయితే రైల్వే అధికారులు ఎంతలా చెప్పినా.. పెడచెవిన పెడుతూ ఎందరొందరో ప్రయాణికులు రైలు కదులుతున్న సమయాల్లో దిగుతూ ప్రమాదాల బారిన పడుతున్నారు. అయితే సకాలంలో స్పందించిన ఆర్పీఎఫ్ సిబ్బంది వారిని హుటాహుటిన కాపాడటంతో వారు మరణపు అంపశయ్యపైకి వెళ్లి మరీ తిరిగి జీవం పోసుకుంటున్నారు. అయితే ఇందుకు దోహదపడతున్న ఆర్పీఎఫ్ సిబ్బంది ప్రాణప్రదాతలే. వారి ప్రాణాలను ప్రణంగా పెట్టి ప్రయాణికుల ప్రాణాలను కాపాడే బాధ్యతను చేతబూనిన వీరు అంతకంటే గొప్పవారే. కత్తిమీద సాములాంటి ఉద్యోగ విధులను కూడా వారు బాధ్యతగా నిర్వర్తిస్తూ.. స్టేషన్ కు రైలు చేరుకుని బయలుదేరి వెళ్లే వరకు వారు అనునిత్యం అప్రమత్తంగా వ్యవహరించాల్సి వుంటుంది.

అదే అప్రమత్తతతో తాజాగా ఓ ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఓ ప్రయాణికుడి ప్రాణాలను కాపాడాడు. వేగాన్ని అందుకుని పరుగులు పెడుతున్న ఓ లోకల్ రైలు నుంచి ఓ ప్రయాణికుడు కిందకు దిగాడు. అయితే రైలు వేగాన్ని అందుకోవడంతో కిందపడ్డాడు. దీనిని ఎవరూ గమనించకపోయినా అక్కడే వున్న ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ గమనించి.. పరుగుపరుగున అక్కడకు చేరకుని అత్యంత చాకచక్యంగా రైలు ట్రాకులకు, ఫ్లాట్ ఫామ్ కు మధ్య చిక్కుకుపోతున్న ప్రయాణికుడిని పక్కకు లాగాడు. దీంతో కిందపడిన వ్యక్తికి కొంతసేపు ఏం జరిగిందో కూడా అర్థంకాలేదు. ఆ తరువాత కానిస్టేబుల్ పక్కకు తీసుకెళ్లి కూర్చోబెట్టిన తరువాత అతడు తేరుకున్నాడు. ఇక ప్రమాదానికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles