Telangana budget 2022-23 presented in Assembly రూ. 2.56 లక్షల కోట్లతో తెలంగాణ 2022-23 వార్షిక బడ్జెట్

Telangana fm presents rs 2 56 lakh crore state budget for 2022 23

Telangana assembly, Harish Rao, Finance minister Harish Rao, Legislative assembly, CM KCR, Annual Budget 2022-23, Telangana legislative assembly, Telangana budget, Telangana budget session, Telangana budget News, Latest Telugu News, Latest Telangana News, Telangana news

Finance minister Harish Rao presented budget 2022-23 in the legislative assembly. While the revenue expenditure of the budget is Rs 1.89 lakh crore, the capital expenditure is Rs 29,728 crore. The minister said that Telangana has made amazing progress in the short time since its inception. The budget would is totally for the poor and farmers in the state, he said.

రూ. 2.56 లక్షల కోట్లతో తెలంగాణ 2022-23 వార్షిక బడ్జెట్

Posted: 03/07/2022 03:41 PM IST
Telangana fm presents rs 2 56 lakh crore state budget for 2022 23

2022-23 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి తెలంగాణ బడ్జెట్ ను ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు అసెంబ్లీ ప్రవేశపెట్టారు.రూ.2.56 లక్షల కోట్లతోబడ్జెట్ ప్రవేశపెట్టారు. రెవెన్యూ వ్యయం రూ.1.89 లక్షల కోట్లు, క్యాపిటల్ వ్యయం రూ.29.728 కోట్లగా నిర్ణయించారు. దళితబంధుకు రూ.17,700, కొత్త వైద్యకళాశాలలకు రూ. వెయ్యి కోట్లు కేటాయించారు. అటవీ విశ్వవిద్యాలయానికి రూ.100 కోట్లు, పల్లె ప్రగతి కార్యక్రమానికి రూ.330 కోట్లు, పట్టణ ప్రగతి ప్రాణాళికకు రూ. 1,394 కోట్లు, పోలీస్ శాఖకు రూ.9,315 కోట్లు కేటాయించారు. అసరా పెన్షన్స్‌కు 11728 కోట్లు, కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ కి 2750 కోట్లు కేటాయించారు.

సొంత స్థలం ఉన్న వారు ఇల్లు కట్టుకోవడానికి 3 లక్షలు ఇవ్వనున్నారు. ఎస్టీల సంక్షేమానికి రూ.12,565 కోట్లు, వ్యవసాయ శాఖకు 24254 కోట్లు, ఇరిగేషన్ కు 22675 కోట్లు , హరిత హారానికి 932 కోట్లు , డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం కోసం 12 వేల కోట్లు, గిరిజన సంక్షేమం కోసం 12, 565 కోట్లు, బీసీ సంక్షేమం కోసం 5698 కోట్లు, బ్రాహ్మణ సంక్షేమం కోసం 117 కోట్లు, ఆర్ అండ్ బి కోసం 1,542 కోట్లు, పోలీస్ శాఖకు 9315 కోట్లు కేటాయించింది. ఫారెస్ట్ యూనివర్సిటీకి 100 కోట్లు, ఆయిల్ ఫామ్ సాగుకు రూ. వెయ్యి కోట్లు కేటాయించింది.

* సొంతింటి స్థలం కలిగిన పేదలకు ఇళ్ల నిర్మాణానికి నియోజకవర్గానికి 3వేల ఇండ్ల ఎంపిక. 3లక్షల చొప్పున రూ.12వేల కోట్ల కేటాయింపు.
* ఎస్టీ నివాస ప్రాంతాలకు రోడ్ల నిర్మాణం కోసం ఎస్టీఎస్డీఎఫ్ నిధుల నుంచి 1000 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో కేటాయించింది.
* గొల్ల కురుమల సంక్షేమం 11 వేల కోట్ల రూపాయల వ్యయంతో 7.3లక్షల యూనిట్ల గొర్రెల పంపిణీకి రూ. 1000 కోట్ల కేటాయింపు.
* నేతన్నలు మరణిస్తే వారి కుటుంబాలను రూ. 5 లక్షల బీమా పథకం.
* గీత కార్మికుల సంక్షేమం కోసం రూ.100 కోట్లతో ప్రత్యేక పథకం
* ప్రతి సంవత్సరం లక్షా 25 వేల మంది బాలింతలకు ‘కేసీఆర్ నూట్రీషియన్‌ కిట్‌’ లను అందించేందుకు ప్రభుత్వ నిర్ణయం.
* ప్రభుత్వ పాఠశాలు, జూనియర్ కాలేజీల విద్యార్ధినులకు ఉచితంగా హెల్త్ అండ్ హైజనిక్ కిట్స్ పంపిణీ చేయనున్న ప్రభుత్వం.
* దూప దీప నైవేధ్య పథకంలో హైదరాబాద్‌లోని 1736 దేవాలయాలు. రూ. 12.50 కోట్ల కేటాయింపు
* రోడ్ల నిర్మాణం, మరమ్మతులు, నిర్వహణ కోసం రూ. 1542 కోట్లను ప్రభుత్వం ఈ వార్షిక బడ్జెట్‌లో కేటాయించింది.
* మెట్రో రైలును పాతబస్తీలో 5.5 కిలోమీటర్లకు అనుసంధానించేందుకు ఈ బడ్జెట్‌లో రూ.500  కోట్లు కేటాయించింది.
* భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి కొత్త పథకం. మొదటి విడుతలో లక్ష మందికి మోటార్ సైకిళ్లు.
* రాష్ట్రవ్యాప్తంగా ఎస్టీ నివాస ప్రాంతాలకు రోడ్ల నిర్మాణం కోసం ఎస్టీఎస్డీఎఫ్ నిధుల నుంచి రూ. 1000 కోట్ల కేటాయింపు.
* గిరిజన, ఆదివాసీ గ్రామ పంచాయతీలకు సొంత భవనాల నిర్మాణం కోసం రూ.600 కోట్ల కేటాయింపు.
* కాళేశ్వరం టూరిజం సర్య్యూట్‌కు రూ. 750 కోట్లు ఈ బడ్జెట్‌లో కేటాయింపు.
* అర్బన్ మిషన్ భగీరథకు ఈ బడ్జెట్‌లో రూ. 800 కోట్లు కేటాయింపు.
* ఎయిర్ పోర్టు మెట్రో కనెక్టవిటీకి రూ. 500 కోట్లు కేటాయింపు. హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టుకు మరో రూ. 1500  కోట్లు కేటాయింపు.
* పరిశ్రమలకు ప్రోత్సాహకాలుగా రూ. 2142 కోట్లు కేటాయింపు
* పరిశ్రమలకు విద్యుత్ రాయితీ కింద రూ. 190 కోట్లను బడ్జెట్‌లో కేటాయింపు.
* హైదరాబాద్ మెట్రో పరిధిలో రోజుకు 20 లీటర్ల ఉచితంగా నీరందించే పథకానికి రూ. 300 కోట్లు కేటాయింపు.
* ఆర్టీసీని బలోపేతం చేసేందుకు రూ. 1500 కోట్లు కేటాయింపు.

తెలంగాణ బడ్జెట్ కేటాయింపులు ఇలా:-

1) దళితుల బంధు కోసం రూ.17,000 కోట్లు
2) పల్లె ప్రగతికి రూ.330 కోట్లు
3) పట్టణ ప్రగతికి రూ. 1,394
4) కొత్త మెడికల్ కాలేజీలకు రూ.1,000 కోట్లు కేటాయించారు
5) అటవీ విశ్వవిద్యాలయాలకు రూ.100 కోట్లు
6) మెదక్, మేడ్చల్, రంగారెడ్డి, నారాయణపేట, గద్వాల్, యాదాద్రికి కొత్త మెడికల్ కాలేజీలు
7) రూ. 50,000 లోపు రైతు రుణాన్ని మాఫీ చేయాలి
8) రూ. 75,000 కంటే తక్కువ ఉన్న సాగు రుణం వచ్చే ఆర్థిక సంవత్సరంలో మాఫీ చేయబడుతుంది
9) రూ. 16,144 కోట్ల పంట రుణాలను మాఫీ చేయాలి
10) 2.5 లక్షల ఎకరాల్లో పంట సాగు చేయాలనే లక్ష్యంతో పామాయిల్ సాగుకు రూ. 1000 కోట్లు
11) సొంత ప్లాట్ ఉన్న వ్యక్తులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి రూ. 3 లక్షల ఆర్థిక సహాయం
12) వ్యవసాయ రంగానికి రూ.24,254 కోట్లు కేటాయించారు
13) 'హరితహారం' కార్యక్రమానికి రూ.932 కోట్లు కేటాయించారు
14) ఆసరా పెన్షన్ కోసం రూ.11,728 కోట్లు
15) కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు రూ.2,750 కోట్లు
16) బ్రాహ్మణుల సంక్షేమానికి రూ.177 కోట్లు
17) రోడ్డు మరమ్మతులు, బిటి పునరుద్ధరణ నిర్వహణ మంజూరు కోసం రూ. 1,542 కోట్లు
18) పోలీసు శాఖకు రూ.9,315 కేటాయించారు
19) యాదాద్రి సహా దేవాలయాల అభివృద్ధి
20) గిరిజనుల సంక్షేమానికి రూ.600 కోట్లు
21) షెడ్యూల్డ్ తెగల సంక్షేమానికి రూ.12,565 కోట్లు
22) బీసీ సంక్షేమానికి రూ.5,698 కోట్లు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles