130 Russian buses ready to evacuate Indian students ఖార్కీవ్ నుంచి 130 బ‌స్సుల్లో భార‌తీయ విద్యార్థుల త‌ర‌లింపు

Russia arranged 130 buses to evacuate indians from kharkiv sumy

indians in Ukraine, indian students in Ukraine, Indian evacuation operation Kyiv, India Kyiv, Indian embassy Kyiv, indian students, Colonel General Mikhail Mizintsev, Kharkiv, sumy, Putin, Russia, Ukraine, 130 buses

Russian officials said that 130 buses have been arranged for the evacuation of Indian students and other foreigners from Kharkiv and Sumy who are stuck amid the war in Ukraine. The Russian national defence control centre head colonel general Mikhail Mizintsev said earlier.

130 ర‌ష్యా బ‌స్సుల్లో విద్యార్థుల త‌ర‌లింపు.. భారత విద్యార్థిపై కాల్పులు..

Posted: 03/04/2022 05:29 PM IST
Russia arranged 130 buses to evacuate indians from kharkiv sumy

ఉక్రెయిన్‌లోని ఖార్కీవ్ ప‌ట్ట‌ణాన్ని ర‌ష్యా చేజిక్కించుకున్న విష‌యం తెలిసిందే. అయితే ఆ న‌గ‌రంలో వేలాది మంది భార‌తీయ విద్యార్థులు చిక్కుకున్నారు. వారితో పాటు ఇత‌ర దేశస్థులు కూడా ఉన్నారు. ఖార్కీవ్‌, సుమే ప్రాంతంలో ఉన్న భార‌తీయ విద్యార్థుల‌ను త‌ర‌లించేందుకు 130 బ‌స్సులు సిద్ధంగా ఉన్న‌ట్లు ర‌ష్యా ర‌క్ష‌ణశాఖ కంట్రోల్ సెంట‌ర్‌ తెలిపింది. ఆ విద్యార్థుల‌ను ర‌ష్యాలోని బెల్గోరాడ్ ప్రాంతానికి త‌ర‌లించ‌నున్నట్లు క‌ల్న‌ల్ జ‌న‌ర‌ల్ మిఖేయిల్ మిజిన్‌సేవ్ తెలిపారు. ఖార్కీవ్‌లోని రైల్వే స్టేష‌న్‌లో పెద్ద సంఖ్య‌లో భార‌తీయ విద్యార్థులు బంధీ అయి ఉన్న‌ట్లు నిన్న ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్ చెప్పిన విష‌యం తెలిసిందే.

ఫైరింగ్ వ‌ల్ల ఖార్కీవ్ నుంచి విద్యార్థుల త‌ర‌లింపు ఆగిన‌ట్లు ఇండియా పేర్కొన్న త‌ర్వాత పుతిన్ నిన్న ఈ వ్యాఖ్య‌లు చేశారు. ర‌ష్యా సెక్యూర్టీ కౌన్సిల్‌లో మాట్లాడిన పుతిన్‌.. 3179 మంది భార‌తీయుల్ని బంధీలుగా చేసిన‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు. ఖార్కీవ్‌లో విద్యార్ధులు చిక్కుకున్న విష‌యంపై పుతిన్‌తో బుధ‌వారం ప్ర‌ధాని మోదీ ఫోన్‌లో మాట్లాడిన విష‌యం తెలిసిందే. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌, ఖర్కీవ్‌లో భయాంకర దాడులు జరుగుతున్నాయి. ఇరు దేశాల సైనికులు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా యుద్దభూమిలో పోరును కొనసాగిస్తున్నారు.

ఇదిలా ఉండగా.. విద్యార్థుల త‌ర‌లింపు కోసం మంత్రి వీకే సింగ్‌ పోలాండ్ వెళ్లారు. ఈ సందర్బంగా ఆయన శుక‍్రవారం మీడియాతో మాట్లాడారు. కీవ్‌ నగరంలో భారత విద్యార్థిపై కాల్పులు జరిగినట్టు కేంద్ర మంత్రి వీకే సింగ్‌ చెప్పారు. కీవ్‌లో రష్యా సైనికులు జరుపుతున్న కాల్పుల నుంచి తప్పించుకునే క్రమంలో విద్యార్థిపై ఫైరింగ్‌ జరిగినట్టు మంత్రి వెల్లడించారు. కాల్పుల్లో గాయపడిన వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారని.. ప‍్రస్తుతం అతడికి వైద్య చికిత్సలు జరుగుతున్నట్టు చెప్పారు. మరోవైపు మంగళవారం రష్యా దాడుల్లో భారత విద్యార్థి నవీన్‌ శేఖరప్ప మృతి చెందిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : indian students  Colonel General Mikhail Mizintsev  Kharkiv  sumy  Putin  Russia  Ukraine  130 buses  

Other Articles