DGP dismisses allegations levelled by Revanth Reddy రేవంత్ రెడ్డి అరోపణలను ఖండించిన డీజీపీ

Dgp condemns revanth reddy allegations against ias ips officers in state

DGP dismisses Revanth allegations, DGP Mahender Reddy condemns reventh allegations, DGP Mahender Reddy clarifies on leave, DGP mahendar reddy, TPCC president, Revanth reddy, allegations, Bihar Gang, IPS officers, IAS officers, Hyderabad, Telangana, Politics

Dismissing the allegations made by TPCC president A Revanth Reddy against IAS and IPS officers in the State, Director-General of Police M Mahendar Reddy here on Thursday clarified that he was availing medical leave since February 18 after suffering hairline fractures in scapula bone.

రాజకీయ లబ్ది కొసం తమను పావులుగా వాడుకోవద్దు: రేవంత్ రెడ్డికి డీజీపీ సూచన

Posted: 03/03/2022 03:18 PM IST
Dgp condemns revanth reddy allegations against ias ips officers in state

తెలంగాణ రాష్ట్రాన్ని బీహార్ ఐఏఎస్‌ల‌ ముఠా ఏలుతోందంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. తెలంగాణ‌కు చెందిన మ‌హేంద‌ర్ రెడ్డిని సైతం ప‌క్క‌న‌బెట్టి బీహార్‌కు చెందిన అంజ‌నీకుమార్‌ను ఇన్‌చార్జ్‌ డీజీపీగా నియ‌మించార‌ని రేవంత్ రెడ్డి ‌చేసిన వ్యాఖ్య‌లు హాట్ టాపిక్‌గా మారాయి. రాష్ట్రంలోని కీలక ఐపీఎస్ స్థానాల్లో బిహార్ కు చెందిన పోలీసు అధికారులనే నియమించారని రేవంత్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో దుమారాన్నే రేపాయి. అయితే ఈ అరోపణలపై డీజీపీ మ‌హేందర్ రెడ్డి స్పందించారు. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు అవాస్త‌వ‌మ‌ని ఖండించారు. రాజకీయ లబ్ది కోసం పోలీసు అధికారులను పావులుగా వాడుకోరాదని ఆయన అక్షేపించారు.

త‌న‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం బ‌ల‌వంతంగా సెల‌వుపై పంపించింద‌ని చేసిన ఆరోప‌ణ‌ల్లో నిజం లేద‌ని తెలిపారు. తాను ఇంట్లో కాలుజారి ప‌డ‌టంతోనే త‌న‌కు ఎడ‌మ భుజానికి గాయ‌మైందని వివరించారు. త‌న‌ భుజంపైన మూడు చోట్ల ఫ్యా ఫ్రాక్చర్ అయిన‌ట్లు తెలిపారు. ఈ విష‌యం ఎక్స్ రే, సీటీ స్కాన్, ఎంఆర్ఐ రిపోర్టుల‌లో తేలిందని, భుజం క‌ద‌ల‌కుండా క‌ట్టుక‌ట్టారని అన్నారు. అందుకే తాను ఫిబ్ర‌వ‌రి 18 నుంచి మార్చి 4వ తేదీ వ‌ర‌కు సెల‌వులో ఉన్నాన‌ని తెలిపారు. వైద్యుల స‌ల‌హా మేర‌కు విధుల్లో చేర‌తాన‌ని వివ‌రించారు. ప్ర‌స్తుతం చికిత్స తీసుకుంటున్నానని అన్నారు. సీనియర్ అధికారిపై ఆరోపణలను చేయడం స‌రికాద‌ని చెప్పారు.

ఆల్ ఇండియా స‌ర్వీస్ అధికారులు, ఇతర అధికారులపై ఆరోపణలు, వ్యాఖ్య‌లు చేసేట‌ప్పుడు సంయ‌మ‌నం పాటించాల‌న్నారు. మ‌రోవైపు, ఐఏఎస్‌లను నిందించడం సరికాదని తెలంగాణ రాష్ట్ర ఐఏఎస్‌ల సంఘం ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. వారిని నిందిస్తే వారి విధుల్లో జోక్యం చేసుకోవడమే అవుతుందని స్ప‌ష్టం చేసింది. రాజ‌కీయ నాయకులు ఐఏఎస్‌ల‌పై చేస్తోన్న‌ ఇలాంటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొంది. ఆలిండియా సర్వీస్‌ రూల్స్‌ ప్రకారం ఐఏఎస్‌లను ఏ రాష్ట్రానికైనా కేటాయిస్తారని తెలిపింది. ఐఏఎస్‌, ఐపీఎస్ అధికారులకు ప్రాంతీయతను అంటగట్ట‌డం వారి మనోభావాలను దెబ్బ తీయడం అప్రజాస్వామికమని రాష్ట్ర ఉద్యోగుల జేఏసీ కూడా తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles