Hair Dresser Naga Srinu Sensational Comments On Manchu Vishnu మంచువిష్ణు హెయిర్ డ్రెస్సర్ నాగశ్రీను వీడియో వైరల్

Hair dresser naga srinu sensational comments on manchu vishnu video goes viral

MAA President, Manchu Vishnu, Hair Dresser, Naga srinu, Mohan babu, Banjarahills police station, Hair dressing equipment, Humiliation, tollywood

A theft was reported at the office of Movie Artist Association (MAA) president Manchu Vishnu in Film Nagar, Hyderabad. In his office, the actor had reportedly preserved a few valuable pieces of hairdressing equipment. Vishnu, along with his manager Sanjay, has complained with the police about the theft.

పేదవాడి జీవితంతో ఆటలోద్దు.. మంచువిష్ణు హెయిర్ డ్రెస్సర్ వీడియో వైరల్

Posted: 02/28/2022 07:16 PM IST
Hair dresser naga srinu sensational comments on manchu vishnu video goes viral

సినీనటుడు, మూవీ అర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు మంచు విష్ణు వ్యక్తిగత హెయిర్‌ స్టైలిస్ట్‌పై జూబ్లీహిల్స్‌ పోలిస్ స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసుల వివరాల ప్రకారం.. బోరబండకు చెందిన నాగశ్రీను సినీనటుడు మంచు విష్ణు వద్ద హెయిర్‌ సైలిస్ట్‌గా గత పదేళ్లుగా పనిచేస్తున్నాడు. కాగా ఆయన ఈ నెల 17న జూబ్లీహిల్స్‌ సీబీఐ కాలనీలోని మంచు విష్ణు కార్యాలయంలో నుంచి రూ.5లక్షల విలువైన హెయిర్‌ డ్రెస్సింగ్‌, మేకప్‌ సామగ్రిని అనుమతి లేకుండా తీసుకెళ్లాడు. మంచు విష్ణుకు చెందిన సామాగ్రిని అతని అనుమతి లేకుండా తీసుకెళ్లాడు. దీంతో మంచువిష్ణు మేనేజర్ సంజయ్.. నాగశ్రీనుకు ఫోన్ చేసినా అందుబాటులోకి రావడం లేదని అతనిపై చోరీకి పాల్పడినట్లు జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఈనెల 19న ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కాగా, మంచువిష్ణ మేనేజర్ సంజయ్ అతనిపై చోరి కేసు నమోదు చేసిన నేపథ్యంలో హెయిర్ స్టైలిస్ట్ నాగశ్రీను విడుదల చేసిన వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. ఆ వీడియోలో ఆయన మాట్లాడుతూ.. మోహన్ బాబు, మంచు విష్ణు కలిసి తనను చిత్ర హింసలు పెట్టీ చెప్పుకోలేని విధంగా బూతులు తిట్టి కులం పేరుతో అవమానించార‌ని నాగ శీను ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. దీంతో మనస్తాపానికి గురైన తాను ఉద్యోగం మానేవేసానని, అయితే తాను ఉద్యోగం మానివేసినందుకు 5 లక్షల విలువ చేసే హెయిర్ డ్రెస్సింగ్ సామాగ్రి చోరీ అని అక్రమంగా కేసు పెట్టారని హెయిర్ డ్రెస్స‌ర్ వాపోయాడు. ఫిబ్ర‌వ‌రి 17న మధ్యాహ్నం ఒంటి గంటకు ఈ సంఘటన జరిగింది. ఇదంతా అక్కడ ఉన్న సీసీటీవీ లో రికార్డ్ అయ్యింది.

తాను పేదవాడినని, తాను పెద్దలతో పోరాడే శక్తి లేనివాడినని.. తనపై ఇలాంటి అరోపణలు మోపడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించాడు. ఈ వార్త విన్న మా తల్లి ఆసుపత్రి పాలైంది. నా తల్లికి గుండె నొప్పి రావడంతో ఆసుపత్రిలో జాయిన్ చేయించాను. 10 ఎండ్లుగా మోహన్ బాబు దగ్గర నమ్మకంగా పని చేస్తున్నాను. నాపై కావాలనే బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. నాలాంటి పేదవాడి జీవితంతో అడుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నా. పెద్దవాళ్ళకు ఇది తగదు. విష్ణు బాబు నా పైన ఫిర్యాదు చేసి కేసు పెట్టారు. మోహన్ బాబు ఫ్యామిలీ నన్ను అసభ్య పదజాలంతో దూషించినందుకే నేను ఉద్యోగం మానేశాను.నేను ఎలాంటి దొంగతనం చేయలేదని నాగ‌శీను స్ప‌ష్టం చేశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles