HC Questions over ordinance of special invitees to TTD board విచారణ సాగుతుండగా అర్డినెన్స్ ఎలా తెస్తారు.? సర్కారుకు హైకోర్టు ప్రశ్న

High court questions over ordinance for appointment of special invitees to ttd board

High Court, YS Jaganmohan Reddy, ordinance, YV Subba Reddy, TTD, TTD board, TTD board special invitees, Andhra Pradesh, Politics

The Andhra Pradesh high court today had questions the Andhra Pradesh Government over the Ordinance approved by the cabinet to amend the state endowments act, to allow the appointments of special invitees to the Tirumala Tirupati temple board, while the case is in the Court.

విచారణ సాగుతుండగా అర్డినెన్స్ ఎలా తెస్తారు.? సర్కారుకు హైకోర్టు ప్రశ్న

Posted: 02/28/2022 03:29 PM IST
High court questions over ordinance for appointment of special invitees to ttd board

తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే) బోర్డులో ప్రత్యేక ఆహ్వానితుల నియామకంపై హైకోర్టులో విచారణ జరిగింది. ప్రత్యేక ఆహ్వానితుల జీవోపై హైకోర్టు గతంలో స్టే ఇచ్చిందని పిటిషనర్‌ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. జీవోపై స్టే కొనసాగుతున్నా అదే అంశంపై ప్రభుత్వం ఆర్డినెన్స్‌ తీసుకొచ్చిందన్నారు. దీనిపై స్పందించిన హైకోర్టు.. న్యాయస్థానంలో కేసు జరుగుతుండగా ఆర్డినెన్స్‌ ఎలా తీసుకొస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీనికి వివరణ ఇస్తూ ప్రత్యేక ఆహ్వానితులను నియమించబోమని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం విచారణను మార్చి 11కు వాయిదా వేసింది. ఆ రోజే తుది విచారణ జరిగే అవకాశం ఉంది.

తితిదే బోర్డులో ప్రత్యేక ఆహ్వానితులకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవోపై భాజపా నేత భానుప్రకాశ్‌, మరొకరు పిటిషన్‌ దాఖలు చేశారు. 52 మంది ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించారని వారిలో కొంత మందికి నేర చరిత్ర ఉందని, ఇంత మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించడం సరికాదని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనికి సంబంధించి విచారణ జరుగుతుండగానే ప్రభుత్వం ఆర్డినెన్స్‌ తీసురావడంపై వాళ్లు మరోసారి పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఇవాళ విచారణ జరిగింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles