Y.S. Pratap Reddy ‘confession’ to CBI rocks YS clan వైఎస్ ప్రతాప్ రెడ్డి వాంగ్మూలంలో సంచలన విషయాలు

Ys viveka murder case y s pratap reddy confession to cbi rocks ys clan

CBI, murder case, Vivekananda, YS Rajasekhara Reddy, YS JaganMohan Reddy, YS Pratap Reddy, Y.S. Vivekananda Reddy, Pulivendula, Kadapa, Y.S. Avinash Reddy, YCP state secretary, Devireddy SivaShanker Reddy, Rajashekar reddy, TDP MLC BTech Ravi, Raghunatha Reddy, Sunil Yadav, Rangaiah, servent, Erra Gangireddy​, Jagadishwar Reddy, Gangadhar, CBI, YS Vivekananda Reddy murder case, Sunitha Reddy, Pulivendula, kadapa, andhra pradesh, crime, Politics

The reported confession statement by Y.S. Pratap Reddy, the paternal uncle of Member of Parliament (Kadapa) Y.S. Avinash Reddy, made to the Central Bureau of Investigation (CBI) has created ripples in political circles. Mr. Pratap Reddy, elder brother of Y.S. Bhaskar Reddy, had reportedly confessed to the CBI on August 16 last year, which clearly indicated the differences within the YS clan.

వైఎస్ వివేకా కేసు: వైఎస్ ప్రతాప్ రెడ్డి వాంగ్మూలంలో సంచలన విషయాలు

Posted: 02/25/2022 08:01 PM IST
Ys viveka murder case y s pratap reddy confession to cbi rocks ys clan

మాజీ మంత్రి వై.ఎస్‌.వివేకా హత్యకేసు విచారణలో భాగంగా వైఎస్ ప్రతాపరెడ్డి సీబిఐకి ఇచ్చిన వాంగ్మూలంలో కీలక విషయాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. వివేకాపై కడప ఎంపీ వై.ఎస్‌.అవినాష్‌రెడ్డి, ఆయన తండ్రి వై.ఎస్‌.భాస్కర్‌రెడ్డి ఈర్ష్యగా ఉండేవాళ్లని అవినాష్‌రెడ్డి పెదనాన్న, భాస్కర్‌రెడ్డి సోదరుడు వై.ఎస్‌.ప్రతాప్‌రెడ్డి సీబీఐకి తెలిపారు. భాస్కర్‌రెడ్డి ఎప్పుడూ వివేకాకు వ్యతిరేకంగానే ఉండేవారని వెల్లడించారు. తన వద్దకు వచ్చే ప్రజల సమస్యలను వివేకా పరిష్కరించేవారని.. దీంతో భాస్కర్‌రెడ్డి, అవినాష్‌రెడ్డిల కంటే వివేకాకే ప్రజల్లో మంచి పేరు ఉండేదని వివరించారు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డికి సోంతనియోజకవర్గంలో అన్ని తానై నిర్వహించిన వైఎస్ వివేకాను అవినాశ్ రెడ్డి, బాస్కర్ రెడ్డీలు వ్యతిరేకించేవారని తెలిపారు. వివేకాను శత్రువులూ గౌరవించేవారని, ఆయన నిర్ణయాల్ని విమర్శించే సాహసం చేసేవారు కాదని చెప్పారు. భాస్కర్‌రెడ్డి, అవినాష్ రెడ్డిల ఈర్ష్యకు ఇవన్నీ కారణాలేనన్నారు. హత్యకు వారం రోజుల ముందు వివేకా... పులివెందుల తన కార్యాలయానికి వచ్చి అరగంట మాట్లాడారని, 2019 ఎన్నికల్లో కడప లోక్‌సభ టికెట్‌ వై.ఎస్‌.విజయమ్మకు లేదా షర్మిలకు ఇవ్వాలన్న అభిప్రాయంతో ఆయన ఉన్నారని తెలిపారు.

జమ్మలమడుగు శాసనసభ నియోజకవర్గానికి అవినాష్‌రెడ్డి మంచి అభ్యర్థి అవుతారన్న భావన వ్యక్తం చేశారని వివరించారు. ప్రజల్లోనూ అదే ప్రచారం ఉండేదని చెప్పారు. గతేడాది ఆగస్టు 16న ప్రతాప్‌రెడ్డి ఈ మేరకు సీబీఐ అధికారుల ఎదుట ప్రతాప్ రెడ్డి వాంగ్మూలం ఇచ్చారు. ‘వై.ఎస్‌.వివేకానందరెడ్డి అత్యంత సాధారణంగా, ఉదారంగా ఉండే రాజకీయ నాయకుడు. ఆయన శ్రేయోభిలాషులు చాలామంది ఆయనకే కడప లోక్‌సభ టికెట్‌ ఇవ్వాలని సిఫార్సు చేశారు’ అని ప్రతాప్‌రెడ్డి ఆ వాంగ్మూలంలో పేర్కొన్నారు. అందులోని ఇతర ప్రధానాంశాలివే.

హత్య జరిగిన రోజు 2019 మార్చి 15వ తేదీ ఉదయం 6.50 గంటల సమయంలో తన సోదరుడు వై.ఎస్‌.మనోహర్‌రెడ్డి ఫోన్‌ చేసి గుండెపోటు, రక్తపు వాంతులతో వైఎస్ వివేకా మరణించారని చెప్పాడంతో ఉలిక్కిపడ్డానని చెప్పారు. హుటాహుటి ఉదయం 7.20 గంటలకు అక్కడికి వెళ్లి చూసేసరికి మనోహర్‌రెడ్డి హాల్లో ఉండగా.. బయట అవినాష్‌రెడ్డి ఫోన్‌లో మాట్లాడుతూ కనిపించారని తెలిపారు. బెడ్ రూమ్ లోకి వెళ్లేసరికి అక్కడ ఎం.వి.కృష్ణారెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, ఇనయతుల్లా, ఆయన సోదరుడు ఉన్నారని అన్నారు.

బెడ్‌ సమీపంలో రక్తపు మడుగు ఉందని తెలిపారు. తలగడ, బెడ్‌షీట్‌పై రక్తం ఉంది. కమోడ్‌ సమీపంలో రక్తపు మడుగులో వివేకా మృతదేహం కనిపించిందని ప్రతాప్ రెడ్డి తన వాంగ్మూలంలో పేర్కోన్నారు. గోడలపైన రక్తం ఉంది. నుదుటిపై తీవ్రగాయాలున్నాయి. ఇవన్నీ చూశాక గుండెపోటుతో మృతిచెందలేదని.. ఏదో తేడా ఉందని గుర్తించాను. అవినాష్ రెడ్డి, భాస్కర్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి.. ఈ నలుగురూ వివేకా గుండెపోటుతో చనిపోయారని అప్పటికే అందరికీ చెప్పటంతో తాను తన అభిప్రాయాన్ని ఎవరి వద్దా వ్యక్తం చేయలేదని ప్రతాప్ రెడ్డి వాంగ్మూలంలో పేర్కోన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles