The mystery of the chained woman in China మహిళను గొలుసుతో బంధించి పాతికేళ్లుగా అరాచరం..

Chinese authorities investigate case of woman chained up in freezing temperatures

mentally-ill woman, woman trafficking in china, Chinese authorities, public concern, woman abdution in china, woman kidnapped in china, woman marriage in china, Tiktok video, International concern, woman trafficking, woman abduction, viral video clip, trending video, crime

Chinese authorities have responded to public concern about a mentally-ill woman who is kept in a hut with an iron chain around her neck by her husband and denied she had been kidnapped after rumours swirled online. The woman, surnamed Yang, became the source of international concern after a video clip posted on Douyin two weeks ago revealed her living conditions in Fengxian county, Jiangsu, eastern China.

చైనాలో దారుణం: మహిళను గొలుసుతో బంధించి పాతికేళ్లుగా అరాచరం..

Posted: 02/24/2022 03:08 PM IST
Chinese authorities investigate case of woman chained up in freezing temperatures

చైనాలో మానవ అక్రమ రవాణా ముఠాల ఆగడాలు పెచ్చుమీరుతున్నాయి. ఆడవాళ్లను అటబోమ్మలుగా చేసిన అడుకుంటున్న ఘటనలు ఎంత దయనీయంగా, దారుణంగా వుంటాయా.? అన్న ప్రశ్నలు ఉత్పన్నమయ్యేలా చేస్తున్నాయి. చల్లని గాలులు వీస్తున్న శీతల వాతావరణంలోనూ ఓ మహిళను తలుపులు లేని చిన్న గుడిసెలోఉంచారు. గుడిసెలో ఉంచడమంటే అమెకు మతిస్థిమితం సరిగా లేదన్న సాకుతో అమెను చావుకు చేరువ చేస్తున్నారు. ఈ అభాగ్యురాలితో కావాల్సిన పనులన్ని చేయించుకున్న తరువాత అమెను గొలుసులతో బంధించి ఓ గుడిసెలో నిర్బంధించారు. సరైన అహారం కూడా ఇవ్వకుండా.. ఎప్పుడు చస్తుందా.? అంటూ వ్యవహరించారు.

తూర్పు చైనాలోని జియాంగ్సు ప్రావిన్స్‌లో జరిగిన ఘటన కలకలం రేపుతోంది. ఇప్పుడీ వీడియోపై చైనాలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. మహిళలను కిడ్నాప్ చేస్తున్న హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠాలు వారిని వ్యభిచార గృహాలకు విక్రయిస్తున్నాయి. ఈ వీడియో వెలుగులోకి వచ్చాక విద్యావంతుల నుంచి సామాన్యుల వరకూ తీవ్రస్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. రంగంలోకి దిగిన ఫెంగ్ కౌంటీ అధికారులు విచారణకు ఆదేశించారు. ఇందులో భాగంగా 17 మంది అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

అలాగే, ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫెంగ్ కౌంటీ కమ్యూనిస్ట్ పార్టీ చీఫ్‌‌‌ను పదవి నుంచి తప్పించారు. తలుపు లేకుండా ఉన్న చిన్న గదిలో మెడలో గొలుసులతో బంధించిన మహిళ వీడియో గత నెలలో వైరల్ అయింది. యునాన్‌కు చెందిన బాధిత మహిళను 1998లో మానవ అక్రమ రవాణా ముఠా సభ్యులు జియాంగ్సుకు తెచ్చినట్టు ప్రభుత్వం తెలిపింది. ఆ తర్వాత ఆమెను వధువుగా రెండుసార్లు విక్రయించారు. బాధిత మహిళకు 1995లో వివాహం కాగా రెండేళ్ల తర్వాత విడాకులు తీసుకుంది. సాంగ్ అనే మహిళ ఆమెకు మాయమాటలు చెప్పి తనతో తీసుకెళ్లింది.

అమె మాయమాటలకు లొంగిపోయిన బాధిత మహిళను ఏకంగా 2 వేల కిలోమీటర్ల దూరంలోని జియాంగ్సు ప్రావిన్సుకు తీసుకెళ్లి గోంఘాయ్ కౌంటీకి చెందిన వ్యక్తికి వధువు పేరుతో అమ్మేసింది. ఆ తర్వాత వారు వధువు పేరుతో మరో వ్యక్తికి ఆమెను అమ్మేశారు. కొనుగోలు చేసిన వ్యక్తి ఫెంగ్ కౌంటీకి చెందిన ఇంకో వ్యక్తికి విక్రయించాడు. అనంతరం ఓ వ్యక్తి ఆమెను వివాహం చేసుకున్నాడు. 2000వ సంవత్సరంలో వారికి వివాహ ధ్రువీకరణ పత్రం కూడా జారీ అయింది. 1999 నుంచి 2020 మధ్య బాధిత మహిళ ఏడుగురు పిల్లలకు జన్మనిచ్చినట్టు ప్రభుత్వం తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles