Ram Charan condemns rumours on stoping Truejet employees salaries ట్రూజెట్ సేవలు త్వరలో పునరుద్దరణ: రామ్ చరణ్

Ram charan condemns rumours on stoping truejet employees salaries

trujet, spicejet, RRR, ram charan, indigo, Indian parliament, Covid pandemic, employees salaries, Regional Connectivity Scheme, UDAN Scheme, temporary break

Actor Ram Charan is also an entrepreneur who has invested in the aviation business apart from being a lead actor in Tollywood. He ventured into the airline business in 2015 with his own carrier service ‘Trujet’ as a low-cost regional carrier. Ram Charan condemned reports stating that the carrier service has not paid the full salaries to its employees, says truejet never stoped the salaries of employees.

ట్రూజెట్ పై అసత్య కథనాలు.. త్వరలో సేవల పునరుద్దరణ: రామ్ చరణ్

Posted: 02/19/2022 06:39 PM IST
Ram charan condemns rumours on stoping truejet employees salaries

హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నప్రాంతీయ విమానయాన సంస్థ ట్రూజెట్ ఇటీవల తమ సేవలను తాత్కాలికంగా నిలిపివేసింది. ద్వితీయ, తృతీయశ్రేణి నగరాలకు కూడా విమాన సర్వీసులను దగ్గర చేసే ప్రయత్నంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ‘ఉడాన్’ పథకం కింద అత్యధికంగా విమానసేవలు అందిస్తున్న సంస్థల్లో ట్రూజెట్ ఒకటి. అర్థిక ఇబ్బందుల్లో ఉన్న విమానయాన రంగాన్ని కరోనా మహమ్మారి మరింత దెబ్బతీసింది. దీంతో పలు విమానయాన సంస్థలు చితికి పోయాయి. కాగా అందులో ట్రూజెట్ విమానయాన సంస్థ కూడా ఉంది. దీంతో పరిపాలనాపరమైన, సాంకేతిక కారణాల వల్ల సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసింది.

కాగా, ఈమేరకు విషయాన్ని ప్రకటించిన సంస్థ.. త్వరలోనే మళ్లీ సేవలు పునరుద్దరిస్తామని సంస్థ ఎండీ వి.ఉమేశ్ తెలిపారు. ఒక ఇన్వెస్టర్ నుంచి 25 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 165 కోట్లు) సమీకరించే ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకు సంబంధించిన చర్చలు తుది దశకు చేరుకున్నాయి. మరికొన్నిరోజుల్లో ఇవి ఫైనల్ అవుతాయని ఉమేశ్ తెలిపారు. ఈ సంస్థ ఎండీ ఉమేశ్ టాలీవుడ్ మెగా హీరో రామ్ చరణ్‌కు సన్నిహితుడు. ఇద్దరూ కలిసి టర్బో మేఘా ఎయిర్ వేస్‌ సంస్థను ప్రారంభించారు. ఇందులో భాగంగా 12 జులై 2015న విమాన సేవలు ప్రారంభించారు.

ఆర్థిక నష్టాల్లో ఉన్న ఈ సంస్థ సేవలు తాత్కాలికంగా నిలిచిపోవడంపై సోషల్ మీడియాలో పలు వార్తలు హల్చల్ చేశాయి. ట్రూజెట్ సంస్థ నష్టాల్లో ఉందని, అందుకే విమానయాన సేవలను నిలిపివేశారని, ఉద్యోగులకు వేతనాలు కూడా ఇవ్వడం లేదన్న వార్తలు వచ్చాయి. సామాజిక మాధ్యమాల్లో హోరెత్తుతున్న ఈ వార్తలపై రామ్ చరణ్ స్పందించారు. ఆ వార్తలు పూర్తి అవాస్తవమని, ఉద్యోగులకు వేతనాలను ఆపలేదని, అందరికీ సకాలంలో వేతనాలు చెల్లిస్తున్నట్టు చెప్పారు. సంస్థ ఎండీ ఉమేశ్ కూడా ఈ వార్తలపై వివరణ ఇచ్చారు. ట్రూజెట్ విమాన సేవలు ఆపేస్తున్నట్టు వచ్చిన వార్తలు పూర్తిగా అబద్ధమని, ఇలాంటి వార్తలను నమ్మొద్దని కోరారు.

తమ సంస్థపై బురద జల్లే ప్రయత్నంలో భాగంగానే ఈ ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. సంస్థలోని పెద్ద స్థానాల్లో ఉన్న అధికారులు రాజీనామా చేశారని, వారి స్థానాలను కొత్త వారితో భర్తీ చేసినట్టు చెప్పారు. త్వరలోనే ఓ ఇన్వెస్టర్ రానున్నారని, ఆ తర్వాత కొత్త సీఈవోను ప్రకటించే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ట్రూజెట్ సేవలు మళ్లీ పునరుద్ద చెందుతాయని పేర్కొన్న ఉమేశ్.. నవంబరు 2021 నుంచి ఇప్పటి వరకు ఉద్యోగులకు పైసా కూడా చెల్లించలేదన్న వార్తలు పూర్తిగా అవాస్తవమని, వారికి పాక్షికంగా వేతనాలు చెల్లిస్తున్నట్టు వివరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles