Charminar-Golconda Underground Tunnel, Is it Real? చార్మినార్ పై తప్పుడు ప్రచారం.. అసలేం జరుగుతోందంటే..!

Archaeology dept warns netigens over wrong propaganda on charminar

Charminar, Hyderabad, ASI, AIMIM, Syed Sohail Quadri, corporator, Tunnel from Charminar to Golconda, Social media, secret tunnel unearthed at charminar, stairwell, secret passages, Archaeological Survey of India (ASI), Circle Director A Smitha Kumar, social media

Installation of a lightning conductor, electrification of minarets and staircases, shifting of the control panel from within the Charminar and installation of a 15 kV generator on the historical monument’s premises were carried out by the Archaeological Survey of India (ASI).

చార్మినార్ పై తప్పుడు ప్రచారం.. అసలేం జరుగుతోందంటే..!

Posted: 02/18/2022 12:49 PM IST
Archaeology dept warns netigens over wrong propaganda on charminar

నాలుగు శతాబ్దాల హైదారబాద్ మహానగరానికి మణిమకుటంగా బాసిల్లుతున్న చారిత్రక సంపద చార్మినార్ పై సామాజిక మాద్యమాల్లో తప్పుడు ప్రచారం జరగడంపై అధికారులు స్పందించారు. నెటిజనులు ఈ తప్పుడు వార్తలను ప్రచారం చేసిన నేపథ్యంలో వారిపై చర్యలు తీసుకోబడతాయని అధికారులు హెచ్చరించారు. చారిత్రక కట్టడం చార్మినార్ ఎలాంటి ప్రకృతి విపత్తులకు కూడా చెక్కుచెదరకుండా చర్యలు తీసుకున్నామని.. అంతేకానీ సోషల్ మీడియాలో తప్పుడు వార్తలను ఎవర్వూ నమ్మవద్దని రాష్ట్ర పరావస్తు శాఖ అధికారులు ప్రజలను కోరారు.

అపురూప చారిత్రక కట్టడం పిడుగు పాటుతో పాటు ఇతర ప్రకృతి విపత్తులతో ఎలాంటి నష్టం వాటిల్లకుండా.. విపత్తులను సైతం ఎదర్కోనే దిశగా కేంద్ర పురావస్తు శాఖ (ఏఎస్‌ఐ) అదేశాల మేరకు రక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు హైదరాబాద్ సర్కిల్ పురావస్తు శాఖ డైరెక్టర్ స్మిత కుమార్ తెలిపారు. ఇందులో భాగంగా చార్మినార్ వద్ద లైటనింగ్‌ కండక్టర్‌ను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. అయితే ఈ మేరకు పనులు జరుగుతున్న క్రమంలో గతంలో తమ శాఖ నిర్మించిన అప్రాన్ స్లాబ్ కూలిందని పేర్కోన్నారు. దానిని కూడా తమ శాఖ అధ్వర్యంలో మళ్లి పునరుద్దరిస్తామని చెప్పారు.

దేశవ్యాప్తంగా ఉన్న చారిత్రక, వారసత్వ సంపదను పరిరక్షించేందుకు చర్యలు తీసుకుంటున్న ఆర్కియాలజీ సర్వే ఆఫ్‌ ఇండియా తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. చార్మినార్‌  అంతర్భాగంలో ఎలక్ట్రికల్‌ కండక్టర్ల ఏర్పాటు కోసం గోతుల తవ్వకాలు చేపట్టింది. సమాచార లోపం కారణంగా స్థానికులు అందోళనకు దిగారు. వారికి విషయాన్ని చెప్పిన తరువాత.. సొరంగాల తవ్వకాలు జరుపుతున్నారని..  చార్మినార్ కట్టడాన్ని బలహీన పరుస్తున్నారని కోందరు, ఇక్కడ నుంచి గోల్కొండకు రహస్య స్వరంగం బయటపడిందని మరికొందరు.. చార్మినార్ లోపల దిగుడు బావి కనుగోన్నారని ఇంకోందరు సోషల్ మీడియా ద్వారా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని అమె అన్నారు.

చార్మినార్‌ కట్టడం పరిరక్షణలో భాగంగా నాలుగు మినార్‌లతో పాటు మరిన్ని అంతర్గత నిర్మాణాలకు ప్రకృతి పరంగా, ఇతర ప్రమాదాల కారణంగా నష్టం వాటిల్లకుండా చర్యలు చేపట్టామని స్మిత తెలిపారు. అయితే తప్పుడు సమాచారం ప్రచారం జరగడం వల్ల ఏం జరుగుతుందో తెలియని అనేక మంది ఇక్కడకు చేరుకోవడంతో తమ పనులకు ఆటంకం కలుగుతుందని అన్నారు. ఇలాంటి సమాచారం ప్రచారం చేసేవారిపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఆర్కియాలజీ శాఖపరంగా పనులు చేపడుతున్నామని, అయితే తవ్వకాల విషయంలో సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని, కట్టడాన్ని పరిరక్షించేందుకే ఈ చర్యలు తీసుకుంటామని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles