LPG cylinder price: Relief ahead of assembly elections కమర్షియల్ ఎల్సీజీ గ్యాస్ సిలిండర్ ధరలపై భారీ తగ్గింపు..

Lpg cylinder price big relief announced ahead of sitharaman s budget

LPG Gas, LPG Cylinder Prices, rates cut, commercial Lpg gas cylinder price, liquified petroleum gas, Union Budget 2022, five state elections, non-subsidized cyclinder 14.2 price

Ahead of the presentation of Budget 2022, oil marketing companies on Tuesday reduced commercial 19-kg LPG cylinder cost by Rs 91.50 effective from today, 1st February. Following the revision, 19 kg commercial cylinder will cost Rs 1907 in the national capital.

కమర్షియల్ ఎల్సీజీ గ్యాస్ సిలిండర్ ధరలపై భారీ తగ్గింపు..

Posted: 02/01/2022 04:37 PM IST
Lpg cylinder price big relief announced ahead of sitharaman s budget

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ పార్లమెంటు హాలులో ఇవాళ బడ్జెట్‌ ప్రవెశపెట్టిన విషయం తెలిసిందే. అయితే అంతకు ముందే దేశవ్యాప్తంగా కమర్షియల్ గ్యాస్‌ సిలిండర్‌ ధరల నుంచి ఊరట ఇచ్చే ప్రకటన వెలువడింది. డొమెస్టిక్‌ సిలిండర్లపై భారీగా ధరలను తగ్గిస్తున్నట్లు ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు ప్రకటించగా.. ప్రస్తుతం సబ్సీడి గ్యాస్ సిలిండర్ల జోలికి వెళ్లని అయిల్ కంపెనీలు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు ప్రకటన చేయడం గమనార్హం.  ప్రతి నెలా ఒకటో తేదీన ధరల సవరణపై ఓఎంసీలు ప్రకటిస్తాయన్నది తెలిసిందే. అయితే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో విజయావకాశాల కోసం ధరలను తాత్కాలికంగా తగ్గించినట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి

అటు డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధరలు అక్టోబర్ నుంచి పెరగలేదు. అదే సమయంలో నవంబర్‌ నుంచి పెట్రో ధరలు సైతం స్థిరంగా ఉన్నాయి. ఈ తరుణంలో బడ్జెట్‌కు కొద్ది గంటల ముందు చమురు సంస్థలు కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్‌ ధరలను తగ్గించినట్లు ప్రకటనలు విడుదల చేశాయి. ఐదు అసెంబ్లీ రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో.. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గృహా వినియోగ సిలిండర్‌ ధర ధరలు స్వల్పంగా పెరిగే అవకాశం ఉందని భావించారు. అదే సమయంలో కమర్షియల్‌ సిలిండర్‌ల ధరల‍్లోనూ మార్పు ఉండొచ్చని ఆశించారు. కానీ, ఈ తరుణంలో కేంద్రం డొమెస్టిక్‌ సిలిండర్ల ధరల్ని పెంచుకుండా ఊరటనిచ్చాయి. మరోవైపు ఆయిల్‌ కంపెనీలు భారీగానే తగ్గింపులు ప్రకటించాయి.

ఫిబ్రవరి 1న ఢిల్లీలో 14.2 కేజీల ఇండేన్‌ డొమెస్టిక్‌ సిలిండర్‌ ధర రూ. 899.50 గా ఉంది. అలాగే కోల్‌కతాలో  డొమెస్టిక్‌ సిలిండర్‌ ధర 926రూ. ఉంది. ముంబైలో నాన్‌ సబ్సిడైజ్డ్‌ ఎల్పీజీ సిలిండర్‌ రూ. 899.50 గా, చెన్నైలో రూ. 915.50గా ఉంది ఇవాళ. మరికొన్ని రాష్ట్రాల్లోనూ కంపెనీలు సిలిండర్‌ల ధరలు భారీగా తగ్గించాయి. హైదరాబాద్‌లో ప్రస్తుతం డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.952 దగ్గర ఉంది. నాలుగు నెలలుగా ఇదే ధర కొనసాగుతోంది. ఇక ఓఎంసీ కమర్షియల్‌ సిలిండర్‌ ధరలపైనా భారీగానే తగ్గింపు ప్రకటించింది. (19కేజీల) ఎల్పీజీ సిలిండర్‌ రూ.91.50పై. తగ్గింది. ఇది ఈ రోజు నుంచే అమలులోకి రానుంది. వాస్తవానికి కొత్త ఏడాది మొదటి రోజునే ఓఎంసీ కమర్షియల్‌ సిలిండర్‌పై 102రూ. తగ్గించింది. అయినప్పటికీ 2 వేల రూపాయలకు పైనే ఉండేది. ప్రస్తుత ధరల సవరణ తర్వాత ఢిల్లీలో కమర్షియల్‌ సిలిండర్‌ ధర  రూ. 1,907రూ.గా ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles