Parrikar’s son Utpal denied Ticket in BJP first list ఉత్పల్ పారికర్ కు బీజేపి మొండిచెయి.. ప్రెస్ మీట్ పై ప్రాధాన్యత

Utpal parrikar to announce his decision today on contesting goa assembly polls

Utpal Parrikar, Manohar Parrikar, former defence minister, Panaji Assembly constituency, Goa Assembly Elections, BJP, Press meet, Goa, Politics

Utpal Parrikar, son of former defence minister Manohar Parrikar, who was denied Goa Panaji Assembly constituency ticket from BJP, to hold a press conference today on his decision on contesting Goa assembly polls.

ఉత్పల్ పారికర్ కు బీజేపి మొండిచెయి.. ప్రెస్ మీట్ పై ప్రాధాన్యత

Posted: 01/21/2022 10:04 AM IST
Utpal parrikar to announce his decision today on contesting goa assembly polls

గోవా దివంగత ముఖ్యమంత్రి, మాజీ కేంద్ర రక్షణశాఖ మంత్రి మనోహర్‌ పారికర్‌ తనయుడు ఉత్పల్‌ పారికర్‌కు బీజేపి పార్టీ హ్యాండిచ్చింది. గోవా ప్రజల హృదయాలతో పాటు దేశ ప్రజల మనస్సులను కూడా గెలిచిన తన తండ్రి ఎన్నో ఎళ్లుగా ప్రాతినిధ్యం వహించిన పనాజీ అసెంబ్లీ స్థానం నుంచి ప్రస్తుతం బీజేపి నేరచరిత కలిగిన వ్యక్తులకు స్థానాన్ని కేటాయించిందని ఆయన అరోపించారు. తన తండ్రి పోటీ చేసిన పనాజీ అసెంబ్లీ సెగ్మంట్ స్థానాన్ని ఈ సారి జరగనున్న గోవా అసెంబ్లీ ఎన్నికల్లో తనకు కేటాయించాలని ఆయన పదే పదే బీజేపి పార్టీని, పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ అయిన మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నావిస్ ను అభ్యర్థించినా ఫలితం దక్కలేకపోయింది.

పనాజీ అసెంబ్లీ స్థానం నుంచి సిట్టింగ్ బీజేపి ఎమ్మెల్యే అటానాసియో మోన్‌సెర్రెట్‌కు కేటాయిస్తూ గోవా బీజేపి ఎన్నికల కమిటీ నిర్ణయం తీసుకుంది. క్రితం రోజు బీజేపీ విడుదల చేసిన గోవా అసెంబ్లీ తొలి దశ జాబితాలో పనాజీ స్థానం కూడా ఉంది. ఉత్పల్ పారికర్ అభ్యర్థనలను తోసిరాజుతూ పనాజీ స్థానాన్ని సిట్టింగ్‌ ఎమ్మెల్యే అటానాసియో మోన్‌సెర్రెట్‌కు కట్టబెట్టింది. 34 మందితో విడుదల చేసిన తొలి  లిస్టులో పనాజీ స్థానాన్ని అటానాసియోకు ఇవ్వడంతో ఉత్పల్‌ పారికర్‌కు ఎదురుదెబ్బ తగిలినట్లయ్యింది. కేంద్రమంత్రివర్గంలోని నాయకుల తనయులకు అసెంబ్లీ ఎన్నికలలో స్థానాలను కేటాయిస్తున్న బీజేపి.. మరోవైపు దివంగత నేత మనోహర్ పారికర్ వారసుడిని అవమానిస్తోందని ఆయన అనుచరవర్గం విమర్శిస్తోంది.

అయితే ఉత్పల్‌ పారికర్ విషయంలో న్యాయం చేసేందుకు బీజేపి కట్టుబడి వుందని గోవా ఎలక్షన్‌ ఇన్‌చార్జ్‌  దేవేంద్ర ఫడ్నవీస్‌ అన్నారు. కాగా ఆయనకు పనాజీ స్థానాన్ని ఇవ్వడం కుదరలేదని తెలిపారు. ఆ సీటును సిట్టింగ్‌ ఎమ్మెల్యేకు ఇ‍వ్వాల్సి వచ్చిందని, అలాగనే పారికర్‌ ఫ్యామిలీని వదులుకోబోమని పేర్కొన్నారు. ‘మనోహర్‌ పారికర్‌ కుటుంబం.. తమతో చాలా సాన్నిహిత్యంగా ఉంటుంది. దాంతోనే పనాజీ స్థానం కాకుండా రెండు ఆప్షన్లు ఇచ్చామన్నారు. అందులో ఒక స్థానాన్ని ఉత్పల్‌ నిరాకరించారు. ఇంకో ఆప్షన్‌ మాత్రమే ఉంది. ఈ విషయంపై మేము ఆయనతో చర్చిస్తున్నాం. అందుకు ఉత్పల్‌ పారికర్ ఒప్పుకుంటాడనే అనుకుంటున్నాం’ అని ఫడ్నవీస్‌ పేర్కొన్నారు.

ఇదిలావుండగా, ఇవాళ ఉత్పల్ పారికర్ ప్రేస్ మీట్ పెట్టనున్నారని ఆయన అనుచరవర్గం తెలిపింది. గోవా అసెంబ్లీ ఎన్నికలలో తన తండ్రి పాత నియోజకవర్గస్థానాన్ని ఆశించి భంగపడ్డ ఆయన బీజేపి పార్టీపై తన నిర్ణయాన్ని వెల్లడించనున్నారని తెలుస్తోంది. అయితే తనకు మొండి చెయిని అందించిన బీజేపిపై ఆయన ఆగ్రహాన్ని వెళ్లగక్కుతారా.. లేక కొనసాగుతారా.? ఇతర పార్టీలో చేరుతారా.? స్వతంత్రంగా బరిలోకి దిగుతారా.? అయితే ఆయనకు ఏ పార్టీ మద్దతునిస్తోంది.? అన్న అంశాల నేపథ్యంలో ఆయన ప్రేస్ మీట్ సర్వత్రా ప్రాధాన్యత సంతరించుకుంది. అప్ పార్టీలో చేరి పగ్గాలను అందుకుంటారా.? లేక కొత్త పార్టీ అలోచనలో వున్నారా.? అన్న విషయాలపై కూడా క్లారిటీ రానుందని తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles