Punjab Assembly Election 2022 Polling Date Rescheduled: ECI పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేసిన ఈసీ

Uttarakhand assembly polls bjp minister harak singh rawat likely to join congress

Assembly election 2022, punjab election 2022, Punjab Assembly Election 2022, Election 2022, Punjab Polling Date Rescheduled, Guru Ravidas Jayanti, Election Commission of India, Punjab Polls 2022, Punjab Election 2022 Date, Punjab Election 2022 News, punjab election date 2022 news, BJP, Congress, Politics

After multiple political parties from Punjab urged the Election Commission of India Punjab (ECI) to reschedule the single-phase state assembly election poll date in view of Guru Ravidas Jayanti, ECI has accepted the demand. Today after a meeting, ECI announced that the votes in Punjab will be cast on February 20 instead of the earlier schedule of February 14.

సీఎం చన్నీ విన్నపం.. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేసిన ఈసీ..

Posted: 01/17/2022 05:32 PM IST
Uttarakhand assembly polls bjp minister harak singh rawat likely to join congress

పంజాబ్ లో ఈ నెల 14న జరగాల్సిన అసెంబ్లీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఈ మేరకు ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల తేదీని ఫిబ్రవరి 14 నుండి ఫిబ్రవరి 20కి వాయిదా వేసింది. పంజాబ్ ఎన్నికలను వాయిదా వేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని పంజాబ్ ముఖ్యమంత్రి చరన్ జీత్ సింగ్ చన్నీతో పాటు కాంగ్రెస్, బీజేపి, అప్ సహా అన్ని రాజకీయ పార్టీలు స్వాగతించాయి. వాస్తవానికి ఈసీ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 14న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగాల్సి ఉంది.  గురు రవిదాస్ జయంతి వేడుకల దృష్ట్యా రాజకీయ పార్టీల నుండి అనేక అభ్యర్థనలను స్వీకరించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది.

అయితే, ఫిబ్రవరి 16న వారణాసిలో గురు రవిదాస్ జీ జయంతి వేడుక కోసం పంజాబ్ నుంచి పెద్ద సంఖ్యలో (దాదాపు 20 లక్షల మంది) భక్తులు తరలి వెళ్లనున్నారు. వారంతా వారం ముందే వారణాసి బయల్దేరతారని.. ఈ క్రమంలో ఎన్నికలను వాయిదా వేయాలని పంజాబ్ ముఖ్యమంత్రి చన్నీ ఎన్నికల సంఘాన్ని కోరారు. ఎన్నికల తేదీని వాయిదా వేయని పక్షంలో వీరంతా ఎన్నికలకు దూరం అయ్యే పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. చన్ని తరువాత కాంగ్రెస్ పార్టీ సహా బీజేపి, అప్ పార్టీలు కూడా ఎన్నికల సంఘాన్ని ఈ విషయమై ఎన్నికల తేదీని మార్చాలని విన్నవించాయి. దీంతో పలు రాజకీయ పార్టీల నుంచి వినతువు వెలువడంతో ఎన్నికల తేదీని మార్చింది ఎన్నికల సంఘం.

ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం సమావేశంలో సమీక్షించిన తరువాత.. ఓ ప్రకటన విడుదల చేస్తూ, గత కొన్ని రోజులుగా పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు పలు రాజకీయ పార్టీలు ఇతర సంస్థల నుండి అనేక ప్రాతినిధ్యాలను స్వీకరించిందని, అదే సమయంలో జరుపుకునే మతపరమైన పండుగపై దృష్టి సారించింది. గురు రవిదాస్ జయంతి ఉత్సవాల నేపథ్యంలో వచ్చే నెల 16కు ఒక వారం ముందు నుండి పంజాబ్ నుండి వారణాసికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివెళ్లే అవకాశం ఉందని.. అందువల్ల పంజాబ్ పొలింగ్ తేదీని 14 నుంచి 20కి మార్చుతున్నామని ఎన్నికల సంఘం పేర్కోనింది.

పంజాబ్ కోసం కొత్త సంబంధిత తేదీలు:

1. నోటిఫికేషన్ తేదీ: జనవరి 25, 2022 (మంగళవారం)
2. నామినేషన్ చివరి తేదీ: ఫిబ్రవరి 1, 2022 (మంగళవారం)
3. పరిశీలన తేదీ: ఫిబ్రవరి 2, 2022 (బుధవారం)
4. ఉపసంహరణ తేదీ: ఫిబ్రవరి 4, 2022 (శుక్రవారం)
5. పోలింగ్ తేదీ: ఫిబ్రవరి 20, 2022 (ఆదివారం).

ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ ఎన్నికలతో పాటు మరో నాలుగు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు మార్చి 10 న జరుగుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles