Divisive politics in the name of a single country: Justice K Chandru ఆరెస్సెస్, బీజేపీ తీరుతో ప్రజాస్వామ్యానికి ముప్పు: జస్టిస్ చంద్రు

Democracy would be in danger if fascism continued to rule the country justice k chandru

democracy, socialism, fascism, secularism, AIYF National congress meet, divisive politics, single country, ruling party, audit exemption, social media, Taxes, PM assitance fund, National Politics

Madras High Court Former Judge Justice K. Chandru called for the fight against secularism and socialism, saying that democracy would be in jeopardy if fascism continued to rule the country. Justice Chandru wants to repel the social media campaign on divisive politics in the name of a single country. The ruling party was enjoying every exemption and whoever made donations to the BJP would be audited and taxed.

ఒకే దేశం మాటున విభజన రాజకీయాలు జరుగుతున్నాయ్: మద్రాస్ హైకోర్టు రిటైర్డ్ జడ్జి

Posted: 01/10/2022 12:46 PM IST
Democracy would be in danger if fascism continued to rule the country justice k chandru

కేంద్రంలోని అధికార బీజేపీ పార్టీ సహా దానికి ప్రాణప్రదమైన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) పై మద్రాస్ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ కె.చంద్రు తీవ్ర విమర్శలు చేశారు. ఈ రెండూ తమ భావజాలాన్ని ప్రజలపై రుద్దుతున్నాయని ఆరోపించారు. ఫాసిజం దేశంలో పాలన కొనసాగిస్తే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లౌకికవాదం, సోషలిజానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని లేకపోతే దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని ఆయన అవేధన వ్యక్తం చేశారు.

హైదరాబాద్లోని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) 16వ జాతీయ మహాసభల్లో పాల్గొన్న ఆయన సభావేదిక పైనుంచి ప్రసంగిస్తూ.. ఒకే దేశం పేరుతో విభజన రాజకీయాలు జరుగుతున్నాయని, ఇందుకు సామాజిక మాధ్యమాలను వాడుకుంటున్నారని విమర్శించారు. అయితే వాటిని తిప్పికోట్టాల్సిన అవశ్యకత ఎంతైనా వుందని అన్నారు. అన్ని వ్యవస్థలను హస్తగతం చేసుకుంటున్న ఆరెస్సెస్ వాటిని బలహీన పరుస్తోందని, ఇది చాలా ప్రమాదకరమని అన్నారు. చట్టాలు కనుక అధికారంలో ఉన్న వారికి అనుకూలంగా లేకపోతే రాజ్యాంగాన్ని సవరించేస్తున్నారని విమర్శించారు.

అడిటింగ్, పన్ను చెల్లింపుల నుంచి అధికార పార్టీకి చెందినవారు మినహాయింపును అనుభవిస్తున్నారని అరోపించిన ఆయన ఆ పార్టీకి ఎవరు విరాళాలు ఇచ్చినా వారిపై ఐటీశాఖ పన్ను చెల్లింపుల వ్యవహారాలపై దాడులు చేస్తోందని అన్నారు. ప్రధానమంత్రి సహాయనిధి నిధుల వినియోగంపై కూడా ఎలాంటి ఆడిట్ ఉండదని, ఆ నిధులు ఎక్కడెక్కడ, ఎవరికి ఖర్చు చేస్తున్నారో.. ఎవరు ఖర్చు చేస్తున్నారో కూడా అర్థం కావడం లేదన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించినట్లయితే రిజర్వేషన్లు ఎక్కడ అమలు చేస్తారని జస్టిస్ చంద్రు కేంద్రప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

ప్రధానమంత్రి హోదాలో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ పర్యటించారని అయితే ఎక్కడా ఏమీ జరగలేదని.. కానీ ఇటీవల పంజాబ్‌లో పర్యటించిన ప్రధాని నరేంద్రమోదీ తన ప్రాణాలకు ముప్పు ఉందని అన్నారని ఆయన గుర్తుచేశారు. అయితే, ఎవరివల్ల, ఎందుకు ఆయన ప్రాణాలకు ముప్పు పొంచి ఉందో చెప్పాలని జస్టిస్ చంద్రు డిమాండ్ చేశారు. తన కాన్వాయ్ వెళ్లే మార్గంలో భద్రత లోపభూష్టిమైన విషయం అంతర్జాతీయ సమస్యగా చిత్రీకరించిన బీజేపి.. మరి ఆయనకు తన దేశంలోనే ప్రాణాలకు హాని ఉందని వ్యాఖ్యానించిన వ్యాఖ్యలను ఎందుకు పరిగణలోకి తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఇక న్యాయస్థానాలు తీర్పులు మాత్రమే ఇవ్వాలని, సూచనలు కాదని జస్టిస్ చంద్రబుఅన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles