`Punjab becoming hub for terrorist activities` ఉగ్ర కార్యకలాపాలకు కేంద్రంగా పంజాబ్: కంగనా రనౌత్

Kangana ranaut calls pm narendra modi s security lapse in punjab shameful

Kangana Ranaut, Narenrdra Modi, PM Modi, PM Narendra Modi, Modi, Punjab, Punjab security breach modi, Pm Modi security breach, PM Modi Punjab security lapse, PM Modi security lapse, PM Modi Punjab, Punjab, Politics

Kangana took to her Instagram Stories to call the incident 'shameful'. She wrote, "What happened in Punjab is shameful, Honourable Prime Minister is democratically elected leader/ representative/ voice of 1.4 billion people, an attack on him is an attack on every single Indian... it is an attack on our democracy itself, Punjab is becoming a hub for terroristic activities if we don't stop them now, nation will have to pay a big price."

ప్రధాని అడ్డగింత.. పంజాబ్ పై మళ్లీ నోరుపారేసుకున్న నటి కంగనా

Posted: 01/06/2022 03:17 PM IST
Kangana ranaut calls pm narendra modi s security lapse in punjab shameful

పంజాబ్ లోని హేుస్సేనివాలంలో గల అమరవీరుల స్థూపం వద్దకు రోడ్డు మార్గంలో వెళ్తున్న దేశ ప్రధాన మంత్రి నరేంద్రమోడీ కాన్వాయ్ ని దారిమధ్యలో రైతులు అడ్డగించడంపై నిరసనలు, విమర్శలు వెల్లువెత్తాయి. దేశ ప్రజలందరికీ ప్రతినిధి అయిన అత్యంత ముఖ్యమైన వ్యక్తికి పటిష్ఠ భద్రత కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్న ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు ఫిరోజ్ పూర్ లోని ప్రధాని ర్యాలి నిర్వహించే సభాస్థలికి లక్ష మంది జనం వస్తారని ఏర్పాట్లు చేసినా కనీసం వందల సంఖ్యలోనూ ప్రజలు రాకపోవడంతో.. కావాలనే రైతులు నిరసన దీక్ష చేస్తున్న మార్గాన్ని చివరి నిమిషంలో ఎంచుకున్నారని వాదనలు కూడా తెరపైకి వస్తున్నాయి.

ఈక్రమంలో అటు ఢిల్లీ శివార్లలో ఏడాది పాటు శాంతియుత దీక్షలు చేసిన రైతులతో పాటు ఇటు తమ ప్రత్యర్థైన కాంగ్రెస్ పార్టీని.. ఆపార్టీ పాలిత ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం జరిగిందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక ఈ కారణంగానే తమ క్యాబినెట్ మంత్రిని కూడా రక్షించే చర్యలకు ప్రధాని పూనుకున్నారని కూడా అరోపణలు ఊపందుకున్నాయి. కేంద్రమంత్రి తనయుడిని శిక్ష నుంచి తప్పించే ప్రయత్నాల్లో భాగంగానే ప్రధాని ఇలా రైతుల నిరసన దీక్షలు జరుగుతున్న రోడ్డు మార్గాన్ని చివరి నిమిషంలో ఎంచుకుని తన సభ ప్లాప్ అయ్యిందన్న వార్త తెలియకుండా.. మరో కొత్త అంశాన్ని తెరపైకి తీసుకోచ్చి ప్రజల దృష్టి మరల్చారన్న అరోపణలు లేకపోలేదు.

ఈ ఘటనపై దేశవ్యాప్తంగా పెద్ద చర్చ నడుస్తోంది. దీనిపై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కూడా ఇన్ స్టాగ్రామ్ లో స్పందించారు. దీన్ని సిగ్గుచేటుగా ఆమె అభివర్ణించారు. ‘‘పంజాబ్ లో జరిగినది నిజంగా అవమానకరం. గౌరవనీయ ప్రధాన మంత్రి ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన నేత, ప్రతినిధి. 140 కోట్ల ప్రజల గొంతుక. ఆయనపై దాడి అంటే ప్రతీ భారతీయుడిపై దాడి అవుతుంది. ఇది మన ప్రజాస్వామ్యంపైనే దాడి. పంజాబ్ టెర్రరిస్ట్ కార్యకలాపాలకు కేంద్రంగా మారుతోంది. వారిని ఇప్పుడు కనుక నిలువరించకపోతే.. తర్వాత దేశం మొత్తం పెద్ద మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. మోదీకి అండగా భారత్ నిలుస్తుంది’’ అంటూ ఆమె పోస్ట్ పెట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles