Karnataka AssemblyPasses Anti-Conversion Bill By Voice Vote మతమార్పిడి నిరోధక బిల్లుకు కర్ణాటక అసెంబ్లీ ఆమోదం..

Anti conversion bill karnataka assemblypasses anti conversion bill by voice vote

karnataka assembly, Anti-Conversion Bill, Karnataka Anti-Conversion Bill, Anti-conversion Bill Passed, BJP Karnataka, Karnataka INC, Karnataka news, Anti-Conversion Bill-2021, Protection of Right to Freedom of Religion Bill, Congress, BJP, Karnataka Assembly, Karnataka, Politics

Despite not getting support from the opposition in the Assembly and from several quarters in the society, the ruling BJP government in Karnataka passed the Protection of Right to Freedom of Religion Bill, 2021, commonly referred to as Anti-Conversion Bill, by voice vote in the state legislative assembly.

కాంగ్రెస్ నిరసన మధ్య.. మతమార్పిడి నిరోధక బిల్లుకు కర్ణాటక అసెంబ్లీ ఆమోదం..

Posted: 12/24/2021 11:22 AM IST
Anti conversion bill karnataka assemblypasses anti conversion bill by voice vote

కర్ణాటక అసెంబ్లీలో విపక్ష కాంగ్రెస్ సభ్యుల నిరసనల మధ్య వివాదాస్పదమైన మత మార్పిడి బిల్లుకు అధికార పక్షం అమోదం తెలిపింది. కాంగ్రెస్ సభ్యులు నిరసనలు నిరసనల మధ్యే బీజేపి ప్రభుత్వం మత స్వేచ్ఛా పరిరక్షణ బిల్లును ప్రవేశపెట్టి దానికి అమోదం తెలిపింది. సీఎం బస్వరాజ్ బొమ్మై నేతృత్వంలోని సభ గురువారం ఈ బిల్లును ప్రవేశపెట్టింది. ఈ బిల్లును కాంగ్రెస్‌ సభ్యులు సభలో  వ్యతిరేకించారు. వెల్‌లోకి దూసుకెళ్లి నిరసన తెలిపారు. నిరసనలు, ఆందోళనల మధ్య సభ బిల్లును మూజువాణి ఓటుతో ఆమోదించింది. ప్రజావ్యతిరేక, అమానవీయ, చట్టవ్యతిరేక బిల్లును తెచ్చారంటూ కాంగ్రెస్‌ తీవ్రంగా విమర్శించింది.

ఈ బిల్లును కాంగ్రెస్ తో పాటుగా క్రైస్తవ సంఘాలు కూడా తీవ్రంగా వ్యతిరేకించాయి. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నిరసనలు తెలిపాయి. అయినా ప్రభుత్వం తాము తీసుకువచ్చిన బిల్లును అమోదించుకుంది. సభలో బిల్లును ప్రవేశపెట్టిన తర్వాత కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట్లాడుతూ.. ఆరెస్సెస్ ఎజెండాలో భాగంగానే ఈ బిల్లును తీసుకువచ్చారని ధ్వజమెత్తారు. అయితే, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప మాట్లాడుతూ.. ఇది దేశ సంస్కృతిని కాపాడే బిల్లు అని చెప్పుకోచ్చారు.

ఈ బిల్లు ప్రకారం.. బలవంతంగా కానీ, ప్రలోభాలకు గురిచేయడం ద్వారా కానీ, మోసపూరిత విధానాల ద్వారా కానీ మతమార్పిడికి ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటారు. చట్ట వ్యతిరేకంగా, నిబంధనలను అతిక్రమిస్తూ మత మార్పిడి జరిగితే నేరంగా పరిగణించి, రూ.25వేల జరిమానా, మూడు నుంచి ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తారు. సామూహిక మత మార్పిడి నేరానికి గరిష్టంగా పదేళ్ల జైలు, రూ.1లక్ష జరిమానా విధిస్తారు. బిల్లు ప్రకారం ఇలాంటి వాటిని నాన్‌–బెయిలబుల్‌ నేరంగా పరిగణిస్తారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles