Yacharam's runaway bride gives groom a big shock పెళ్లైన మరుసటి రోజునే.. రూ.4 లక్షలతో వధువు పరార్..

Rangareddy bride runs away with valuables worth rs 4 lakh day after wedding

Bride runs away with valuables in Telangana, Bride runs away with valuables in Rangareddy, Bride runs away with valuables in Yacharam, Bride runs away with valuables day after marriage, FIR filed by victim against Bride, bride, bride run away, groom, marriage, vijayawada, yadagiri gutta, Vratam, Hyderabad, shopping, Yacharam police station, Rachakonda Police, Rangareddy, Telangana, Crime

A woman has been booked for running away with valuables worth Rs 4 lakh from grooms house day after getting married. In an FIR filed by victim at Yacharam police station, it was mentioned that a mediator talked to him into marrying a orphan woman at a lodge in Vijayawada, The day after on returning to groom native, bride runs away with valubles.

పెళ్లైన మరుసటి రోజునే.. రూ.4.5 లక్షలతో వధువు పరార్..

Posted: 12/21/2021 06:04 PM IST
Rangareddy bride runs away with valuables worth rs 4 lakh day after wedding

ఏ వయస్సులో చేయాల్సిన పని ఆ వయస్సులో చేయాలని పెద్దలు అంటుంటారు. లేటు మ్యారేజ్ చేసుకోవడం ఇప్పటి కుర్రకారుకు ఫ్యాషన్ గా మారింది. అదేంటి అంటే లైఫ్ లో ఎంజాయ్ మెంట్ కు కూడా సమయం ఇవ్వాలని అంటున్నారు. వీరు ఎంజాయ్ మెంట్ పిచ్చి తగలెయ్య.. హాయిగా పెళ్లి చేసుకుని భార్యతో కలసి జీవితాన్ని ఎంజాయ్ చేస్తే అదే కదా జీవితాంతం మధురజ్ఞాపకంగా నిలుస్తుంది. అలా కాదని నాలుగు పదుల వయసు దాటిన తరువాత పెళ్లి చేసుకుని ఎంజాయ్ చేద్దామంటే.. ఇదిగో ఇలా కూడా జరగొచ్చు సుమా.

లేటైతేనేం అనుకుని ఎట్టకేలకు ఓ అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుని.. నేరుగా దైవదర్శనానికి వెళ్లి.. అక్కడ వత్రాలు అచరించి.. తన భార్యను ఇంప్రెస్ చేద్దామని నేరుగా హైదరాబాద్ కు వెళ్లి షాపింగ్ చేసి.. ఆ తరువాత సోంతగ్రామానికి వచ్చిన ఓ వరుడికి.. వధువు జీవితంలో మర్చిపోలేని షాక్ ఇచ్చింది. తన వివాహం జరిగిన గంటల వ్యవధిలోనే అమె అతడ్ని మోసం చేసి పారిపోయింది. రంగారెడ్డి జిల్లా యాచారానికి చెందిన వ్యక్తికి 40 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకోవాలనిపించింది. ఆ వెంటనే ఓ మిత్రుడి సాయంతో మధ్యవర్తిని కలిశాడు. అమ్మాయిని చూడమని చెప్పాడు.  అయితే, అందుకు లక్ష రూపాయలు ఖర్చవుతుందని చెప్పడంతో అడిగినంత సమర్పించుకున్నాడు.

డబ్బులు అందుకున్న మధ్యవర్తి విజయవాడలో అమ్మాయి ఉందని చెప్పి బాధితుడిని అక్కడికి తీసుకెళ్లాడు. ఆ అమ్మాయికి ముందువెనక ఎవరూ లేరని చెప్పాడు. అమ్మాయి నచ్చడంతో విజయవాడలోనే ఓ లాడ్జిలో రహస్యంగానే వారి పెళ్లి జరగింది. ఈ తంతు గురువారం ముగిసింది. అనంతరం శుక్రవారం ఇద్దరూ కలిసి యాదగిరి గుట్ట చేరుకుని సత్యనారాయణ స్వామి వ్రతం కూడా ఆచరించారు. అయితే ఈ తంతు జరుగుతున్న సమయంలో వధువుతో పాటు మరో యువతి వుంది. అయితే అమె తన స్నేహితురాలిగా వరుడికి పరిచయం చేసింది. ఆ యువతి కూడా వధువరులతో కలసి వరుడి ఇంటికి వచ్చింది.

అయితే వధువు ముందు బిల్డప్ కు పోయిన వరుడు.. నేరుగా హైదారాబాద్ కు వెళ్లి షాపింగ్ చేయించాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ. 2.5 లక్షల రూపాయల షాపింగ్ చేశారు. అందులో మూడు తులాల బంగారు గొలుసు, రూ. 40 వేల దుస్తులు కొనుగోలు చేశారు. అక్కడి నుంచి నేరుగా వరుడి స్వగ్రామానికి చేరుకున్నారు. ఆ తర్వాత కాసేపటికే బీరువాలో బట్టలు సర్దుతున్నట్టు నటించిన కొత్త పెళ్లికూతురు అందులోని రూ. 2 లక్షలు, కొత్త దుస్తులను తన బ్యాగులో సర్దింది. ఆమెతో పాటు వచ్చిన యువతి నగరంలోని తన సోదరుడిని చూసేందుకు వెళ్తుందని చెప్పి కారును మాట్లాడి ఉంచింది. ఆ తర్వాత తనకు తలనొప్పిగా ఉందని, మందులు తీసుకురావాలని చెప్పి భర్తను మెడికల్  షాపునకు పంపింది. అతడటు వెళ్లగానే కారులో మహిళలిద్దరూ ఉడాయించారు.

అయితే జరిగిన ఘటనపై పోలీసులు క్యాబ్ డ్రైవర్ ను విచారించారు. కారులో దుస్తులు మార్చుకోవడంతో అనుమానం వచ్చిన క్యాబ్ డ్రైవర్, ఇదేంటని ప్రశ్నించాడు. అయితే తమను రూట్ మార్చి తీసుకెళ్తున్నాడని అరచి గోల చేస్తామని వారు బెదిరింపులకు పాల్పడేసరికి తనకెందుకులే అని వారిని ఎల్బీనగర్ వద్ద దింపేశానని తెలిపాడు. మరోవైపు, కొత్త పెళ్లి కూతురు డబ్బు, నగలు, దుస్తులతో పరారైన విషయం తెలిసి లబోదిబోమన్న బాధితుడు నిన్న స్థానిక పెద్దలకు చెప్పి బోరుమనడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అందరూ కలిసి మధ్యవర్తిని నిలదీయగా, తనకు ఏ పాపం తెలియదని, ఆమె ఇంత పనిచేస్తుందని ఊహించలేకపోయానని వాపోయాడు. కాగా, ఇదంతా ఓ ముఠా పనేనని అనుమానిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles