Man stages protest against S.I slapping him చేయి చేసుకున్న పోలీసులకు చుక్కలు చూపిన పౌరుడు.!

Slapped for not wearing face mask biker protests in telangana

Telangana police, Telangana mask restrictions, Mahabubabad police, Telangana police violence, biker protest, Mahabubabad Town police station, Telangana, Crime

A biker staged a protest on the road in Mahabubabad town after police allegedly slapped him for not wearing a face mask. Srinivas and his daughter were going to a nearby market when they were stopped by the police. He was roughed up the police and slapped.

ITEMVIDEOS: చేయి చేసుకున్న ఎస్ఐకి చుక్కలు చూపిన పౌరుడు.!

Posted: 12/07/2021 03:17 PM IST
Slapped for not wearing face mask biker protests in telangana

కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న క్రమంలో మహబూబ్ నగర్ జిల్లాలోని ట్రాఫిక్‌ పోలీసులు స్థానిక ప్రజలకు అవగాహన కల్పించేందుకు చర్యలను చేపట్టారు. ఈ క్రమంలో పనిలోపనిగా హెల్మెట్ ధారణపై కూడా అవగాహన కల్పించేందుకు ఉపక్రమించారు. ఇంతవరకు బాగానే వున్నా.. అనుకోకుండా అక్కడి ఓ ఎస్ఐ ఓ వాహనదారుడిని తన కూతరు ఎదుటే చెంప చెల్లుమనిపించాడు. నిబంధనలు అతిక్రమించిన వాహనాన్ని నడుపుతున్నాడని పోలీసు ఎస్ఐ వాహనదారుడిపై దురుసగా ప్రవర్తించాడు. అంతే ఆ వ్యక్తి ఎస్ఐ వద్దకు వెళ్లి తనను కొట్టేందుకు తాను ఏం నేరం చేశానని నిలదీయడంతో అతనికి అండగా స్థానికులు కూడా మద్దతుగా నిలిచారు. ఈ ఘటనకు సంబంధించిన దృష్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

వివరాలు.. శ్రీనివాస్‌ అనే వ్యక్తి తన ఎనిమిదేళ్ల కూతురుతో కలిసి బైక్ మీద కూరగాయల మార్కెట్ కు వెళ్లాడు. అయితే అక్కడే ఉన్న పోలీసులు హెల్మెట్‌ ధరించలేదని దబాయిస్తూ.. బైక్‌ తాళం తీసుకున్నారు. అయితే ఆ వ్యక్తి తాను హెల్మెట్‌ ధరించానని పోలీసులకు చెప్పినా పట్టించుకోకుండా ఎస్‌ఐ మునీరుల్లా చేయి చేసుకున్నాడని శ్రీనివాస్‌ తెలిపాడు. తాను ఏ తప్పుచేయలేదని హెల్మెట్‌ ధరించినా.. లేదని దూషించి చేయి చేసుకున్నాడని ఆరోపించాడు. ఒక వేళ హెల్మెట్‌ ధరించని పక్షంలో ఫైన్‌ వేయాల్సిందని.. తనను కొట్టే హక్కు పోలీసులకు ఎవరిచ్చారని నిలదీశాడు.

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లోనే వాహనాలను సీజ్ చేయకూడదని హైకోర్టు అదేశాలు ఇచ్చిందని, అలాంటప్పుడు.. హెల్మెట్ లేదని తన బైక్ తాళం చెవిలు తీసుకోవడమేంటని ప్రశ్నించాడు. తన బైక్ కీస్ తీసుకోవడమే కాకుండా తనపై తన కూతురి ఎదురుగానే చేయి చేసుకోవడం ఏమిటని శ్రీనివాస్ పోలీసుల స్థానిక ఉన్నతాధికారి వద్ద అన అక్రోశాన్ని వెళ్లగక్కాడు. హెల్మెట్ లేకపోతే ఫైన్ వేయాల్సిన అధికారులు.. తానేదో నేరం చేసినట్లు ఎందుకు చేయి చేసుకున్నాడని నిరసిస్తూ ఆయన రోడ్డుపై బైఠాయించాడు. ఈ దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

వీడియో ప్రకారం.. పోలీసుల ప్రవర్తనతో శ్రీనివాస్‌ కూతురు అతన్ని పట్టుకొని ఏడవసాగింది. ‘మనం తప్పు చేయలేదు తల్లి.. నువ్వు ఏడవకు’ అంటూ శ్రీనివాస్‌ చెబుతాడు. అక్కడ ఉన్నవారు కూడా శ్రీనివాస్‌కు మద్దతు తెలిపారు. ఇక విషయం పెద్దదిగా మారుతుందని గ్రహించిన పోలీసులు సదరు వ్యక్తిని అక్కడ నుంచి బలవంతంగా పంపించివేస్తారు. ఈ ఘటనపై జిల్లా పోలీసు ఇంచార్జ్‌ స్పందిస్తూ.. ఎస్‌ఐ మునీరుల్లాను సదరు వ్యక్తి దూషించాడని తెలిపారు. మరోవైపు తన తండ్రి హెల్మెంట్‌ ధరించినా..  ధరించలేదని దూషిస్తూ పోలీసులు బైక్‌ తాళం తీసుకున్నారని అతని కుమార్తె ఏడుస్తూ చెప్పింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ ఎక్కడ ఉంది? అంటూ  కామెంట్లు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles