Former Andhra Pradesh CM Konijeti Rosaiah passes away ఉమ్మడి రాష్ట్ర మాజీ సీఎం. కాంగ్రెస్ సీనియర్ నేత కె.రోశయ్య కన్నుమూత

Former chief minister of unified andhra pradesh k rosaiah passes away at 89

Ex AP CM, K Rosiah, K Rosaiah death, K Rosiah dies, Konijeti Rosaiah, Hyderabad news, Cngress, Tamil Nadu governor, Andhra Pradesh

Former Andhra Pradesh chief minister Konijeti Rosaiah passed away in Hyderabad. Rosaiah died while being taken to a private hospital after falling ill this morning. He was 89. The senior Congress leader had previously also served as governor of Tamil Nadu between 2011 and 2016.

ఉమ్మడి రాష్ట్ర మాజీ సీఎం. కాంగ్రెస్ సీనియర్ నేత కె.రోశయ్య కన్నుమూత

Posted: 12/04/2021 12:08 PM IST
Former chief minister of unified andhra pradesh k rosaiah passes away at 89

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత కొణిజేటి రోశయ్య (88) కన్నుమూశారు. తెలుగు ప్రజలకు సుపరిచితుడైన రాజకీయ దురంధరుడు, అజాతశత్రువు రోశయ్య ఇక లేరు అన్న వార్త రాజకీయ ప్రముఖులను విషాదంలోకి నెట్టింది. తన రాజకీయ జీవితంలో అనేక పదవులను అలంకరించిన ఆయన.. వాటికి వన్నె తెచ్చారే తప్ప.. ఎవప్పుడూ విమర్శలు, అరోపణల పాలు కాలేదు. రాజకీయాల్లో గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో ఆయన హైదరాబాద్లోని స్టార్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు.

అమీర్ పేటలోని నివాసానికి ఆయన భౌతికకాయాన్ని తరలించారు. ఆయనకు నివాళులు అర్పించేందుకు రాజకీయ, సినీ, వ్యాపార సహా పలు రంగాలకు చెందిన ప్రముఖులు తరలిరానున్నారు. రోశయ్య అంత్యక్రియలు ఆదివారం మధ్యాహ్నం మహాప్రస్థానంలో ప్రభుత్వ లాంఛనాలతో జరగనున్నాయి. అమీర్‌పేటలో ఉన్న ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్ధం నాంపల్లిలోని కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యాలమైన గాంధీభవన్‌కు తరలించనున్నారు. ఆదివారం మధ్యాహ్నం 12 నుంచి 12.30 గంటల వరకు అక్కడే ఉంచనున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు గాంధీభవన్‌ నుంచి రోశయ్య అంతిమయాత్ర ప్రారంభమవనుంది. మధ్యాహ్నం ఒంటిగంటకు జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్తానంలో అంత్యక్రియలు జరగనున్నాయి.

రాజకీయ కురువృద్దుడు కొణిజేటి రోశయ్య.. 1933, జూలై 4న గుంటూరు జిల్లాలోని వేమూరులో జన్మించారు. స్వాతంత్య్ర సమరయోధుడు, రైతు నేత ఎన్జీ రంగా శిష్యుడైన ఆయన నిడుబ్రోలులో రాజకీయ పాఠాలు నేర్చుకున్నారు. సుదీర్ఘకాలం కాంగ్రెస్‌పార్టీలో కొనసాగిన రోశయ్య.. 1968లో తొలిసారిగా శాసన మండలికి ఎన్నికయ్యారు. 1968, 74, 80లో వరుసగా మండలికి ప్రాతినిథ్యం వహించారు. 1979లో అంజయ్య ప్రభుత్వంలో తొలిసారిగా మంత్రిగా బాధ్యలు చేపట్టారు. 1982లో కోట్ల విజయ భాస్కర్‌రెడ్డి ప్రభుత్వంలో హోంశాఖ మంత్రిగా తన అమాత్యప్రస్తానాన్ని ప్రారంభించిన ఆయన అనేక పర్యాయాలు అనేక విభిన్నశాఖలకు మంత్రిగా సేవలందించారు.

1989లో మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, రవాణా, విద్యుత్‌ శాఖ మంత్రిగా సేవలు అందించారు. 1992లో కోట్ల విజయభాస్కర్‌ రెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, ఆరోగ్య, విద్య, విద్యుత్‌ శాఖలు చేపట్టారు. ఇటు రాష్ట్రంలోనే కాకుండా అటు పార్లమెంటు సభ్యుడిగా కూడా ఆయన సేవలు అందించారు. 1998లో నరసరావుపేట నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2004, 2009లో వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి సర్కార్‌లో ఆర్థిక మంత్రిగా బాధ్యలు నిర్వహించారు. ఉమ్మడి ఏపీలో పలు కీలక శాఖలు నిర్వహించిన ఆయన సుదీర్ఘకాలం ఆర్థికమంత్రిగా పనిచేశారు. మొత్తం 16 సార్లు రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

2009లో సీఎం రాజశేఖర్‌ రెడ్డి హఠాన్మరణంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 15వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2009 సెప్టెంబర్‌ 3 నుంచి 2011 జూన్‌ 25 వరకు సీఎంగా పనిచేశారు. అనంతరం ఐదేండ్లపాటు తమిళనాడు గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 2011 ఆగస్టు 31న తమిళనాడు 31వ గవర్నర్‌గా బాధ్యలు చేపట్టిన రోశయ్య.. 2016, ఆగస్టు 30 వరకు ఆ పదవిలో కొనసాగారు. వయోభారంతో గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles