'Cash Pipeline' Found at PWD engineer Home in Karnataka కర్నాటక ఇంజనీరు ఇంట్లో క్యాష్ పైప్ లైన్: ‘‘నీటికి బదులు నోట్ల కట్టలు..’’

Cash pipeline found at pwd joint engineer residence during raid in karnataka

Anti-Corruption Bureau (ACB), Corruption case, Wads of currency notes, cash Wads of currency notes, PWD Engineers Residence, Shantha Gowda Biradar, Kalburgi district, Karnataka, cirme

Wads of currency notes were dug out of pipelines in a raid by Karnataka's Anti-Corruption Bureau at the residence of an engineer with the Public Works Development (PWD). Officials said the residence of PWD joint engineer Shantha Gowda Biradar in Kalburgi district was raided as part of a statewide crackdown on government officials accused of corruption.

కర్నాటక ఇంజనీరు ఇంట్లో క్యాష్ పైప్ లైన్: ‘‘నీటికి బదులు నోట్ల కట్టలు..’’

Posted: 11/24/2021 06:31 PM IST
Cash pipeline found at pwd joint engineer residence during raid in karnataka

కర్నాటకలో ఓ పబ్లిక్ వర్క్స్ డెవలప్ మెంట్ ఇంజనీరు ఇంట్లో క్యాష్ పైప్ లైన్ ను అధికారులు కనుగోన్నారు. ఈ ఇంజనీరు చలవేమో కానీ ఈ పైప్ లైన్ నుంచి నీటికి బదులు క్యాష్ (నోట్ల కట్టలు) వస్తున్నాయి. ఇలా ఏకంగా ఒక బకెట్ నిండా నోట్ల కట్టలను అధికారులు పట్టుకోగలిగారు. అదేంటి వినడానికే విడ్డూరంగా వుంది. ఫైప్ లైన్ నుంచి నీరు ప్రవహిస్తుంది కానీ నోట్ల కట్టలు ప్రవహించడమేంటీ అంటారా.? అక్కడికే వస్తున్నాం. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభుత్వ అధికారులపై కర్ణాటకలోని అవినీతి నిరోధక శాఖ అధికారులు చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే.

రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన చర్యలలో భాగంగా కల్బుర్గి జిల్లాలోని పీడబ్ల్యూడీ జాయింట్ ఇంజనీర్ శాంతగౌడ బిరాదార్ నివాసంపై దాడులు చేసినట్లు అవినీతి నిరోధక శాఖ అధికారులు తెలిపారు. అంతేకాదు పబ్లిక్ వర్క్స్ డెవలప్‌మెంట్ (పీడబ్ల్యూడీ)కి చెందిన ఇంజనీర్ నివాసంలో  తాము ఒక ప్లంబర్‌​ సాయంతో పైప్‌లైన్‌ల నుంచి కరెన్సీ నోట్లను తీశామని అధికారులు వెల్లడించారు. పైగా తమకు పైపులైన్‌లో నగదు దాచినట్లు సమాచారం రావడంతోనే ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ మేరకు సుమారు రూ. 25 లక్షల నగదు, భారీ మొత్తంలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.

అయితే అవినీతి నిరోధక శాఖ ఇప్పటి వరకు దాదాపు 15 మంది అధికారులపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులకు సంబంధించన సోదాలు నిర్వహించినట్లు తెలిపింది. ఇటీవల బెంగళూరు డెవలప్‌మెంట్ అథారిటీ కార్యాలయంపై కూడా అవినీతి నిరోధక శాఖ దాడులు నిర‍్వహించిన సంగతి తెలిసిందే.  ఈ క్రమంతో కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై మాట్లాడుతూ.." రాష్ట్ర ప్రభుత్వం అవినీతిని ఏ రూపంలోనూ సహించదు. అవినీతి నిరోధక శాఖ ఇచ్చే నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం వారిపై తగిన చర్యలు తీసుకుంటుంది" అని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles